బ్ర‌హ్మీపై క‌సి తీర్చుకున్నాడా?

పాపం… స్టార్ క‌మెడియ‌న్‌గా వెలుగొందిన బ్ర‌హ్మానందం ప‌రిస్థితి రోజు రోజుకీ దిగ‌జారిపోతోంది. ఆయ‌న‌కు సినిమాలు బాగా త‌గ్గిపోయాయి. చేసిన సినిమాల్లోనూ అర కొర పాత్ర‌లే ద‌క్కుతున్నాయి. తాజాగా విడుద‌లైన `నేల టికెట్టు` చూస్తే బ్ర‌హ్మానందం దుస్థితి అర్థ‌మ‌వుతుంది. జూనియ‌ర్ ఆర్టిస్టు కంటే దారుణ‌మైన పాత్ర ఇచ్చాడు క‌ల్యాణ్ కృష్ణ‌. ఫృథ్వీ సీన్లో.. వెనుక నిల‌బ‌డి – కొన్ని పిచ్చి ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తున్న బ్ర‌హ్మీని చూస్తే.. `బ్ర‌హ్మానందం ఇలాంటి పాత్ర‌ల‌కు కూడా ఒప్పుకునే ప‌రిస్థితికి వ‌చ్చేశాడా` అనే అనుమానం క‌లుగుతుంది. ఈ సినిమా మొత్తం బ్ర‌హ్మానందానికి ఇచ్చిన డైలాగులు ఒక‌టో, రెండో. అది కూడా `పోన్లే.. పాపం` అంటూ జాలి ప‌డి ఇచ్చిన‌ట్టుంది.

అయితే… ఈ ఎపిసోడ్ మొత్తం వెనుక ఓ రివైంజ్ డ్రామా న‌డిచిన‌ట్టు టాలీవుడ్ టాక్‌. క‌ల్యాణ్ కృష్ణ తొలి సినిమా `సోగ్గాడే చిన్ని నాయిన‌`లో బ్ర‌హ్మానందం ఓ కీల‌క పాత్ర చేశాడు. ఆ పాత్ర నిడివి, ద‌ర్శ‌కుడు దానికి ఇచ్చిన ప్రాధాన్యం ఎక్కువే. అయితే క‌ల్యాణ్ కృష్ణ‌కు అదే తొలి సినిమా. దాన్ని అదునుగా తీసుకుని బ్ర‌హ్మానందం క‌ల్యాణ్ కృష్ణ‌ని తెగ ఆడేసుకున్నాడ‌ట‌. ఆ సినిమా జ‌రుగుతున్న‌న్ని రోజులూ క‌ల్యాణ్‌ని బ్ర‌హ్మీ నానా హింస‌ల‌కూ గురి పెట్టాడ‌ట‌. చెప్పిన టైమ్‌కి షూటింగ్‌కి రాక‌పోవ‌డం, ఇచ్చిన డైలాగ్‌ని త‌న‌కు న‌చ్చిన‌ట్టు చెప్ప‌డం – ఏమైనా అడిగితే `నాకే ఎదురు చెబుతావా` అన్న‌ట్టు చూడ‌డం.. ఇవ‌న్నీ క‌ల్యాణ్ కృష్ణ మ‌న‌సుల‌తో పెట్టేసుకున్నాడ‌ట‌. అందుకే బ్ర‌హ్మానందంపై త‌న రివైంజు తీర్చుకోవ‌డానికే.. త‌న‌ని కావాల‌ని ఈ సినిమాలో పెట్టుకుని, జూనియ‌ర్ ఆర్టిస్టు కంటే దారుణ‌మైన పాత్ర ఇచ్చిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బ్ర‌హ్మానందంపై కొన్ని సీన్లు చేశార‌ని అయితే.. వాటిని ఫైన‌ల్ ఎడిట్‌లో క‌ట్ చేసేశార‌ని టాక్‌. అలా.. బ్ర‌హ్మానందంపై త‌న క‌సి తీర్చుకున్నాడు. కానీ సినిమా పోయిందిగా పాపం?! ద‌ర్శ‌కుడిపై ఆర్టిస్టుకి కోపం వ‌చ్చినా, ఆర్టిస్టుపై ద‌ర్శ‌కుడికి కోపం వ‌చ్చినా అది సినిమాకే న‌ష్టం. పోయేది నిర్మాతే. ఈ నిజాన్ని న‌వ‌తరం ద‌ర్శ‌కులు ఎప్పుడు తెలుసుకుంటారో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close