వర్మను చుట్టూ తిప్పుకున్న ‘ఆఫీసర్‌’!

రామ్‌గోపాల్‌ వర్మ తీసిన లేటెస్ట్‌ సిన్మా ‘ఆఫీసర్‌’. అందులో ఆఫీసర్‌గా నటించినది నాగార్జున. ఈ ఆఫీసరే వర్మను తన ఆఫీసు చుట్టూ తెగ తిప్పుకున్నాడు. ఓ నెలో… రెండు నెలలో కాదు, ఏకంగా ఏడాది పాటు తిప్పుకున్నాడు. కథ నచ్చినా… ఆ కథపై వర్మకు ఎంత ప్రేమ ఉందో తెలసుకోవడం కోసం తిప్పుకున్నాడు. నిజానికి, 2016 ఎండింగ్‌లోనే వర్మ ‘ఆఫీసర్‌’ కథను చెప్పాడని నాగార్జున తెలిపారు. కథ నచ్చినా వెంటనే ఓకే చెప్పకుండా వర్మను టెస్ట్‌ చేశార్ట. కథ నచ్చిన తరవాత రామ్‌గోపాల్‌ వర్మతో ‘‘నువ్విలా చెబుతావ్‌. మళ్ళీ మారతావ్‌. నాలుగు ఐదు నెలల తర్వాత రా. అప్పుడు కూడా ఇంతే ప్యాషన్‌తో కథ చెబితే చేద్దాం’’ అని నాగార్జున చెప్పార్ట! ఆయన చెప్పిస టైమ్‌కి మళ్ళీ వెళితే… ‘‘సెప్టెంబర్‌లో ఇదే ప్యాషన్‌తో కథ చెబితే సినిమా చేద్దాం’’ అన్నాడట! మళ్ళీ సెప్టెంబర్‌లో వెళితే… ‘‘కథంతా బాగా చెప్పావు కానీ… నేను మంచి సినిమాలు, నాకు నచ్చినవి చేయాలనుకుంటున్నా. సినిమాల మీదే పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నా. నువ్వు దృష్టి పెట్టకుండా వేరే వేరే పనులు పెట్టుకొనేటట్లు అయితే వద్దు’’ అని క్లియర్‌గా చెప్పేశాని నాగార్జున తెలిపారు. అప్పుడు వర్మ సరేనంటే.. సినిమా స్టార్ట్‌ చేశార్ట! స్టార్ట్‌ చేసిన తరవాత తాను గనుక సరిగా చేయకపోతే తన్నమని వర్మ లెటర్‌ రాశార్ట!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close