కేసీఆర్ ఢిల్లీ టూర్ ..! సంచలనాలుంటాయా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ర చంద్రశేఖర్ రావు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానమంత్రి ఆపాయింట్‌మెంట్ కోసం ఆయన చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి నాలుగు రోజులు వెయిట్ చేసినా… మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో నిరాశగా తిరిగి వచ్చారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రుల సమావేశం పదహారో తేదీన జరగబోతున్న సమయంలో… ప్రధాని కార్యాలయం హఠాత్తుగా కేసీఆర్‌కు పదిహేనో తేదీ మధ్యాహ్నం అపాయింట్‌మెంట్ ఖరారు చేసింది. ముస్లిం రిజర్వేషన్లతో పాటు జోన్ల అంశానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర సహా.. పలు అంశాలు.. కేంద్రం వద్ద పెడింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి కేసీఆర్ ప్రయత్నించే అవకాశం ఉంది. ఇదంతా అధికారికం. కానీ రాజకీయ పరంగానూ కొన్ని సంచలనాత్మక విషయాలపై.. కేసీఆర్ .. మోదీతో చర్చిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

ప్రధానమంత్రి ఆపాయింట్‌మెంట్ ఖరారు కాగానే కేసీఆర్ ముందుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. గవర్నర్ నరసింహన్‌తో సమావేశయ్యారు. ఇటీవల రాష్ట్రపతితో అన్ని రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన గవర్నర్… నాలుగు రోజులు ఎదురు చూసి ప్రధానమంత్రిని కలిసి.. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై నివేదికలిచ్చి వచ్చారు. ఈ క్రమంలో.. నరసింహన్‌తో కేసీఆర్ భేటీ ఆసక్తి రేకేతిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలపై మోదీకి ఓ మాట చెబుతారని ప్రచారం జరుగుతోంది. కూటమిలో చేరేందుకు ఒక్క పార్టీ కూడా ఆసక్తి చూపించకపోవడంతో.. కేసీఆర్ కూడా లైట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల ఏడాదిలో కేసీఆర్ రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఎంత చాన్స్ ఉందో.. తీసుకోకపోవడానికి కూడా అంతే చాన్స్ ఉంది.

కేసీఆర్‌ తీసుకునే సంచలన నిర్ణయం ఏదైనా ఉందా అంటే… అది ఎన్డీఏలో చేరడం. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడు కేంద్రమంత్రులెవరూ లేరు. టీడీపీ మంత్రులు ఇద్దరూ రాజీనామాలు చేశారు. అంతకు ముందే దత్తాత్రేయను సాగనంపారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేసే యోచనలో నరేంద్రమోదీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్‌ ను కేబినెట్‌లోకి మోదీ అహ్వానించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. ఇప్పుడు బీజేపీకి కొత్త మిత్రులు కావాలి. కేసీఆర్ పెట్టుకున్న ఫెడరల్ ఫ్రంట్‌వైపు వచ్చే పార్టీలేవీ లేవు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల వరకూ కాపోయినా.. ఇప్పుడు టీఆర్ఎస్‌కు మంత్రి పదవులు ఇస్తే.. కొత్త మిత్రులు వస్తారని.. దూరంగా ఉన్నపార్టీల్లో ఆలోచన మొదలవుతుందన్న భావనలో బీజేపీ వర్గాలున్నాయి.

కొద్ది రోజుల నుంచి బీజేపీకి కేసీఆర్ మద్దతుగా నిలుస్తున్నారు. బీజేపీ కూడా.. తెలంగాణలో టీఆర్ఎస్‌పై పోరాడుతున్నదేమీ లేదు. ఓ రకంగా అప్రకటిత మిత్రపక్షాలుగానే ఉన్నారు. కానీ బీజేపీతో ఎలాంటి సంబంధాలు పెట్టుకున్నా.. అది చాలా డేంజర్ అనే విషయం కేసీఆర్‌కు బాగా తెలుసు. ఒక వేళ పెట్టుకున్నా.. ఆ నిర్ణయాన్ని ఆయన జస్టిఫై చేసుకోగలరు. కానీ ఎన్నికల సమయంలో ప్రజల రియాక్షన్స్ మాత్రం అంచనా వేయలేరు. అందుకే… కేసీఆర్ తటపటాయించే అవకాశం ఉంది. ఏ విధంగా చూసినా కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఈ సారి కాస్తంత రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close