అమెరికా సెక్స్ స్కాండల్… నేను ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు: మెహరీన్

అమెరికాలోని చికాగో కేంద్రంగా కిషన్ మోదుగుముడి దంపతులు సాగించిన సెక్స్ స్కాండల్ తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ముఖ్యంగా తెలుగు సినిమాల్లో నటించే కథానాయికల్లో పెద్ద అలజడి రేపింది. సరిగ్గా సెక్స్ స్కాండల్ వెలుగుచూసిన సమయంలో ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’, ‘రాజా ది గ్రేట్’ సినిమాల హీరోయిన్ మెహరీన్ ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లారు. కెనడాలోని వాంకోవర్ నుంచి లాస్ వేగాస్‌కి హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు అమెరికన్ బోర్డర్ సెక్యూరిటీ అధికారులు మెహరీన్ ఫ్యామిలీని 30 నిమిషాలు విచారించినట్టు ప్రముఖ ఆంగ్ల పత్రికలో వార్త వచ్చింది. మెహరీన్ తమకు ఇంటర్వ్యూ ఇచ్చినట్టు పత్రికలో పేర్కొన్నారు.

అయితే… తాను ఏ ఎవరికీ ఎటువంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. అమెరికాలో బోర్డర్ సెక్యూరిటీ అధికారులకు, తనకు మధ్య ఏం జరిగింది? అమెరికాలో ఏమైంది? వంటి అంశాలను త్వరలో చెబుతానని సోషల్ మీడియా సాక్షిగా తెలిపారు. ఇంకా మెహరీన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లో ఏముందటే… “నేను ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా వచ్చిన కథంతా తప్పే. వైరల్ ఫీవర్ వల్ల ప్రస్తుతం నేను ముంబైలో వున్నాను. అందుకని, ‘పంతం’ లాస్ట్ ప్రమోషనల్ ఈవెంట్‌కి అటెండ్ కాలేదు. ఆరోగ్యం కుదుటపడిన తరవాత అమెరికాలో ఏం జరిగిందనేది అందరికీ చెబుతా. లాస్ వేగాస్ వెళ్తున్నప్పుడు నేను తెలుగు సినిమాల్లో నటిస్తానని ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలిసింది. ఎందుకు అమెరికా వెళ్తున్నావని బోర్డర్ సెక్యూరిటీ అధికారులు ప్రశ్నించారు. తరవాత సెక్స్ స్కాండల్ గురించి చెప్పారు. దానికి నాకూ ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. నన్ను క్షమాపణలు కోరారు. తరవాత ఎటువంటి సమస్య ;లేకుండా ప్రయాణించే వీలు కల్పించారు. ఇతరులు ఏదో చెప్పడం కంటే నేనే ఆ ఘటన గురించి చెప్పడం మంచిదని స్టేట్మెంట్ ఇస్తున్నా. అమెరికాలో నేను ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న మాట వాస్తవమే. అయితే… కొందరు చేసిన తప్పుడు పనులను ఇండస్ట్రీకి చెడ్డ పేరు రావడం బాధ కలిగిస్తోంది. తప్పు చేసిన వాళ్లకు సరైన శిక్ష పడుతుందని ఆశిస్తున్నా. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతో మంచిది. తెలుగు సినిమాల్లో నేను నటిస్తూనే వుంటా” అన్నారు.

చివరగా మీడియాకి ఓ విజ్ఞప్తి చేశారామె. అమెరికా ఘటనకు సంబంధించి తనతో మాట్లాడకుండా తాను చెప్పినట్టు ఎటువంటి కథనాలు ప్రచురించవద్దని మెహరీన్ కోరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close