వైఎస్ 43 లక్షల ఇళ్లు కట్టిస్తే.. ఇంకా గూడు లేని వాళ్లు ఎందుకున్నారు రోజా..?

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఒక్క రోజే.. మూడు లక్షల ఇళ్లలో పేద కుటుంబాలు గృహప్రవేశారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పండుగల నిర్వహించింది. యథావిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇందులో గొప్పతనం ఏమీ కనిపించలేదు. జగన్ మీడియా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆ పార్టీ నేతలు కూడా.. పెద్దగా ఎక్కడా స్పందించలేదు. వ్యతిరేకంగా స్పందిస్తే..ఇళ్లు పొందిన పేదల్లో తమపై వ్యతిరేకత వస్తుందని భావించారు. అందుకే వీలైనంతగా గృహప్రవేశ కార్యక్రమాలపై నిశ్మబ్దాన్ని పాటించారు. కానీ నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం తన మార్క్ విమర్శలు చేశారు.

“బావగారూ బాగున్నరా” సినిమాలో కోట శ్రీనివాసరావు డైలాగుని రివర్స్‌లో చెప్పినట్లు.. “వైఎస్ గొప్పదనం ముందు..చంద్రబాబు గొప్పదనం ఎంత..” అని తీసి పడేశారు. ఇందు కోసం ఆమె చెప్పిన లెక్కలు వింటే… వైఎస్‌ని పొగిడారో తిట్టారో అర్థం చేసుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి… ఐదేళ్లలో 43 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ లెక్కల ప్రకారం బీపీఎల్ కేటగిరిలో ఉన్న కుటుంబాలు 50 లక్షలకు అటూ ఇటుగా ఉంటాయి. మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 43 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తే.. ఇంకా ఏపీలో పదిహేను లక్షల కుటుంబాలు ఇళ్ల కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాయి..? అంటే.. రోజా చెప్పిన ఆ 43 లక్షల ఇళ్లలో… అసలు నిజంగా కట్టినవి ఎన్ని..? పేపర్లపై కట్టి డబ్బులు కాజేసినవి ఎన్ని..?. ముఖ్యమంత్రి కూడా.. గృహప్రవేశ కార్యక్రమంలో.. దాదాపుగా రూ. 4వేల కోట్లకుపైగా నిధులు నొక్కేశారని ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో ఇళ్ల విషయంలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన సీఐడీ విచారణ ప్రారంభించింది కూడా.

ఇక ఇళ్ల విషయంలో చంద్రబాబు ఘనతేమీ లేదని చెప్పడానికి.. బీజేపీని పొగడటానికి కూడా రోజా వెనుకాడ లేదు. కట్టిన మూడు లక్షల ఇళ్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టారట. కేంద్రం ఏమైనా ఊరికే ఇస్తుందా..? ఏపీ నుంచి వసూలు చేస్తున్న పన్నుల నుంచే ఇస్తోంది కదా..?. అంటే..బీజేపీకి అయినా క్రెడిట్ ఇవ్వడానికి రెడీనే కానీ..చంద్రబాబు గొప్పతనం మాత్రం అంగీకరించకూడదన్నది వైసీపీ పాలసీ. దాన్ని రోజా తన మాటలతో వెల్లడించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీకి షాక్… పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌పై సీఈసీ స్ప‌ష్ట‌త‌

ఏపీలో రెండు మూడు రోజులుగా చ‌ర్చ‌నీయాంశం అయిన పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల వ్యాలిడిటీపై స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. పోస్ట‌ల్ బ్యాలెట్ల విష‌యంలో చాలా చోట్ల రిట‌ర్నింగ్ అధికారులు సంత‌కం చేసినా, సీల్ వేయ‌లేదు. కొన్ని...

సుధీర్ బాబు బిరుదు మారింది

మ‌న హీరోలంద‌రికీ పేరుకు ముందు ఏదో ఓ బిరుదు త‌గిలించుకోవ‌డం అల‌వాటు. ఒక‌వేళ వాళ్ల‌కు ఇష్టం లేక‌పోయినా, ఫ్యాన్సూ, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లూ త‌గిలించేస్తుంటారు. సుధీర్ బాబుకీ ఓ బిరుదు ఉంది. నైట్రో స్టార్...
video

‘హరోం హర’ ట్రైలర్: కుప్పంలో ఆయుధ పూజ

https://youtu.be/fnef0Uvvx1I?si=7BScZ4oy9zD2DSxc సుధీర్ బాబు 'హరోం హర' సినిమాతో రాబోతున్నాడు. సేహరి సినిమా తీసిన జ్ఞాన సాగర్ ద్వారక ఈ సినిమాకి దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పాటలు వచ్చాయి కానీ కథ...

శర్వానంద్.. ఓ పెళ్లి పాట

శర్వానంద్ 'మనమే' రావడానికి ఇంకా వారం రోజులే వుంది. ఇప్పటికే కొంత ప్రమోషనల్ కంటెంట్ బయటికి వచ్చింది. ఇప్పుడు టప్పా టప్పా అనే పాట ని వదిలారు. ఇదొక పెళ్లి పాట. ట్యూన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close