కుటుంబరావుతో డిబేట్..! జీవీఎల్‌కు పరువేమైనా మిగిలిందా..?

“నువ్ ఆధారాలు బయటపెడతానంటే… పొద్దున్నే ఢిల్లీకి వస్తా” అన్నారు కుటుంబరావు. దానికి సమాధానంగా ఓ ఆరోపణ చేశారు జీవీఎల్. “సాగరమాల పథకంలో భాగంగా అఫిడవిట్‌లో చెప్పినన్ని నిధులు ఏపీకి ఇచ్చినట్లు నిరూపిస్తే” గుండు కొట్టించుకుంటానని సవాల్ చేశారు కుటుంబరావు. వెబ్‌సైట్లో అన్ని వివరాలు ఉన్నాయన్నారు జీవీఎల్. ఇలా.. ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు… ప్రతి దాన్ని సాధికారికంగా చెబుతూంటే.. దానికి ప్రత్యారోపణ చేయడం ద్వారానో… ఉదరగొట్టడం ద్వారానో… తప్పించుకునే ప్రయత్నం చేశారు.. బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఓ టీవీ చానల్ డిబేట్‌లో … జీవీఎల్ మాటలు, చేసిన వాదన చూస్తున్న వారిని..బీజేపీ నిజంగానే ఏపీకి ఏమీ ఇవ్వలేదన్న భావన కలగడం ఖాయం. కేంద్రం ఏపీకి ఎన్నో ఇచ్చిందని చెప్పుకుంటున్న జీవీఎల్..తనకు తెలియకుండా.. దానికి రివర్స్ భావాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు.

కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేస్తున్న అఫిడవిట్లలో.. నిజం ఏమిటి..? అబద్దం ఏమిటన్నదానిపై.. కుటుంబరావు వివరంగా చెప్పారు. దానికి సమర్థంగా తన వద్ద ఉన్న సమాచారంతో కౌంటర్ ఇవ్వాల్సిన…జీవీఎల్ పదే పదే ఆరోపణలకే ప్రాధాన్యం ఇచ్చారు. మళ్లీ యూసీల ప్రస్తావన తెచ్చారు. కేంద్రం ఇచ్చిన నిధులకు ఏపీ పంపిన యూసీలు తప్పుడువన్నారు. నీతిఆయోగ్ ఆ విషయం చెప్పలేదు కదా అంటే.. ఇన్‌స్పెక్షన్ రిపోర్టులనే కొత్త ప్రాసెస్ తీసుకొచ్చారు. ఎవరు చేస్తారు ఈ ఇన్‌స్పెక్షన్..? ఎలా చేస్తారు ఈ ఇన్‌స్పెక్షన్..? అనే కొత్త అనుమానాలు తీసుకొచ్చారు. ఇలాంటివేమైనా ఉంటే… టీవీ డిబేట్లలో జీవీఎల్ ప్రకటించడం ఏమిటన్న అనుమానాలు అందరికీ వస్తాయి. వచ్చాయి కూడా…! దానిపై వివరణ ఇచ్చేంత తీరిక జీవీఎల్‌కు దొరకలేదు.

సాగరమాల ప్రాజెక్ట్‌ గురించి జీవీఎల్ గొప్పగా చెప్పుకునేందుకు చేసిన ప్రయత్నంలో… ఆయన గాలిని కుటుంబరావు పూర్తిగా తీసేశారు. సాగరమాల ప్రాజెక్ట్ కింద రూ. 5 కోట్లు కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినట్లు నిరూపించినా గుండు కొట్టించుకుంటానని సవాల్ చేశారు. దానికి జీవీఎల్ దగ్గర ఉన్న సమాధానం.. వెబ్‌సైట్‌లో వివరాలు ఉన్నాయనే. రైల్వేలు, పోర్టులు, విశాఖ స్టీల్ ప్లాంట్లకు చేసిన పనులను.. కూడా… సాగరమాలలో కలిపి అఫిడవిట్‌లో చూపించింది కేంద్రం. ఆ విషయాన్ని కుటుంబరావు చెబితే… జీవీఎల్.. సమాధానం చెప్పలేకపోయారు. ముందు ముందు లక్షా అరవై వేల కోట్ల రూపాయలు వస్తాయంటూ.. టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు.

ఇక లోకేష్‌పై చేసిన విమర్శల విషయంలోనూ జీవీఎల్‌లో అదే తడబాటు. ఓ మంత్రి, మధ్యవర్తి ఢిల్లీలో లోకేష్ పేరు చెప్పుకునికేంద్రమంత్రి వద్ద లాబీయింగ్ చేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండించిన లోకేష్… దమ్ముంటే.. పేరు బయటపెట్టాలని తొడకొట్టినంత పని చేశారు. చెప్పకపోయేసరికి.. ఎందుకు చెప్పలేకపోతున్నారని టీజ్ చేశారు. ఇలా కార్నర్ చేస్తూంటే.. ఎవరైనా పేరు బయటపెడతారు. కానీ జీవీఎల్ మాత్రం.. డిబేట్‌లో తనకు ఓ కేంద్రమంత్రి చెప్పారని.. ఆ కేంద్రమంత్రి అబద్దం చెప్పరు కదా.. అని కొత్త వాదన తీసుకొచ్చారు. అసలు కేంద్రమంత్రి పేరు చెబితేనే కదా..జీవీఎల్ కు చెప్పారో లేదో.. తెలుస్తుంది. మొత్తానికి జీవీఎల్.. కుటుంబరావుతో టీవీ డిబేట్లలో పాల్గొని.. మంచి చేస్తున్నాడో.. చెడు చేస్తున్నాడో.. బీజేపీ నేతలకు కూడా అర్థం కావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close