ప్రొ.నాగేశ్వర్: మోడీని ఢీకొట్టే నాయకుడు ప్రతిపక్షాలకు ఉన్నాడా..?

ప్రస్తుతం దేశంలో బలమైన నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిటారుగా నిలబడి ఉన్నారు. ప్రతిపక్షాలు ఇప్పుడిప్పుడే ఏకమవుతున్నాయి. వివిధ రాష్ట్రాల వారీగా కొన్ని పార్టీలు ఏకమయ్యాయి. కొద్ది రోజుల కిందట జరిగిన ఉపఎన్నికల్లో ప్రతిపక్షల ఐక్యత బీజేపీపై తీవ్ర ప్రభావం చూపించింది. బీజేపీ పునాదులను దాదాపుగా దెబ్బతీసింది. వచ్చే ఎన్నికల నాటికి.. బీజేపీకి ఈ ప్రాంతీయ పార్టీల ప్రధాన ప్రత్యర్థిగా ఎదురు నిలుస్తాన్న ప్రచారం జరుగుతోంది. అందుకే బీజేపీ మద్దతు దారులు ఓ వాదన బలంగా వినిపిస్తున్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీ ఉంటారు. విపక్షాల తరపున ఎవరు ప్రధానమంత్రి ఎవరు..? అని సందేహాలు ప్రారంభించారు.

ప్రాంతీయ పార్టీల్లో రాహుల్‌గాంధీకి ఆమోదయోగ్యత లేదు..!

ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో విపక్షాలన్నీ ఏకమయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్టుకోలేదు. కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ వస్తే తానే ప్రధానమంత్రి అవుతానని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాందీ ప్రకటించారు. కానీ వెంటనే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్ కూడా .. కొన్ని సందేహాలు లేవనెత్తారు. ఎందుకంటే.. మమతా బెనర్జీతో పాటు ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా.. ప్రధానమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అలాగే సమాజ్ వాదీ పార్టీకి కూడా కొన్ని పరిమితులు పెట్టింది. ఎందుకంటే.. రాహుల్ ప్రధాని కావడం వీరికి ఇష్టం లేదు. ఈ పార్టీలకు పరిమితులు ఉండటానికి కొన్ని కారణాలున్నాయి.

ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు ఎక్కువ..!

ప్రాంతీయ పార్టీల నేతలకు ప్రధానమంత్రి పదవిపై ఆశ ఉంది. దీనికి తోడు.. కాంగ్రెస్‌ నాయకత్వాన్ని అంగీకరిస్తే.. తమ రాష్ట్రంలో తమ పార్టీపై ఎలాంటి ప్రబావం ఉంటుదోనన్న ఆందోళన. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా అంగీకరించలేవు. ఎందుకంటే.. రాహుల్ ను ప్రధానమంత్రిగా ప్రకటిస్తే కాంగ్రెస్ బలపడుతుంది. ఈ రెండు పార్టీలకూ కాంగ్రెస్ యూపీలో బలపడటం ఇష్టం లేదు. కాంగ్రెస్ బలపడితే .. ఆ ప్రభావం ఈ పార్టీలపై పడుతుంది. బెంగాల్‌లో మమతా బెనర్జీ పరిస్థితి కూడా అంతే. తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పెరగకూడదని ఆమె కోరుకుంటున్నారు. అందు వల్ల బీజేపీ నేతలు… నరేంద్రమోదీకి ఢీకొట్టే… నేత ఎవరో చెప్పాలంటూ.. సవాల్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించే స్థితిలో విపక్షాలు లేవు.

ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదు..!

దీనికి ప్రతిపక్షాల వద్ద ఇప్పటికప్పుడు సమాధానం లేదు. ఇందిరాగాంధీ అత్యంత బలంగా ఉన్నప్పుడు… కూడా ఆమెకు వ్యతిరేకంగా కూటమి కట్టాయి. అప్పుడు ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా లేవు. జనతా పార్టీనే అందర్నీ కూడగట్టింది. అప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు.. తమ ప్రధానమంత్రి అభ్యర్థి ఇందిరాగాంధీ.. మీకెవరు అంటూ.. ప్రశ్నించడం ప్రారంభించారు. కానీ అప్పుడు కూడా జనతా పార్టీ నేతలు సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే.. అప్పుడు చాలా మంది నేతలు ఇందిరాగాందీకి వ్యతిరేకంగా పోరాడుతూ.. ప్రధానమంత్రి పదవి కోసం రేసులో ఉన్నారు. వారిలో ఎవరో వారు తేల్చుకోలేకపోయారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం… ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించుకున్నారు. రెండో ఉదాహరణ..వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనూ.. ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్‌కు వచ్చింది. తమకు వాజ్‌పేయి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు మీకెవరు అంటూ.. బీజేపీ నేతలు కాంగ్రెస్‌ నేతలను టీజ్ చేశారు. అప్పట్లో సోనియాపై విదేశీ వనిత అనే ముద్ర ఉంది. రాహుల్ గాంధీ రాజకీయ ప్రవేశానికి రెడీగా లేరు.

ప్రధాని అభ్యర్థిని చూసి ప్రజలు ఓటేయరు..!

కానీ ప్రజలు ఇవేమీ పట్టించుకోకుండా… ప్రధాని అభ్యర్థితో సంబంధం లేకుండా.. యూపీఏకి అధికారం ఇచ్చారు. యూపీఏ తరపున మన్మోహన్ ప్రధాని అయ్యారు. ఎప్పటికప్పుడు నాయకులు పుట్టుకు వస్తూనే ఉన్నారు. నాయకులు చరిత్రను సృష్టించరు. చరిత్ర నాయకుల్ని సృష్టిస్తుంది. బీజేపీయేతర పక్షాలకు.. ప్రధానమంత్రి అభ్యర్థి లేరు. భారత దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఎంపీలు ఎన్నికవుతూంటారు. ప్రధానమంత్రి అభ్యర్థిని బట్టి కాదు. గత ఎన్నికల్లో చూసుకుంటే.. దక్షిణాదితో పాటు.. బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా మోదీ మానియాను చూసి ఎవరూ ఓటేయలేదు. వచ్చే ఎన్నికలు కూడా అంతే.

ఎన్నికల ఫలితాలను బట్టే ప్రధాని..!

ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిస్తే.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకొస్తారు. ప్రాంతీయ పార్టీలన్నీ అత్యధిక స్థానాలు గెలిస్తే.. వారి నుంచే ఓ ప్రధానమంత్రి వస్తారు. అంటే…ప్రజల తీర్పు నుంచే ప్రధాని వస్తారు.. తప్ప ప్రధానే ప్రజల తీర్పును నిర్ణయించరు. కర్ణాటకలో బీజేపీ తరపున యడ్యూరప్పను, కాంగ్రెస్ తరపున సిద్ధరామయ్యను సీఎం అభ్యర్థులుగా ప్రకటించారు. కానీ ప్రజల తీర్పును బట్టి .. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. దీన్ని బట్టి చూస్తే ప్రజాతీర్పును బట్టే ప్రధానమంత్రులవుతారు. అంటే..మోడీకి పోటీగా ఇప్పటికిప్పుడు అభ్యర్థిని తెరపైకి తేవాల్సిన అవసరం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close