“యాత్ర” లాభం ఎవరికి..? కాంగ్రెస్‌కా ..? వైఎస్ఆర్ కాంగ్రెస్‌కా..?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఎలా చరిత్ర సృష్టించిందన్న విషయాన్ని మరోసారి ప్రజలకు గుర్తు చేసేందుకు తెరకెక్కిస్తున్న సినిమా “యాత్ర”. బయోపిక్‌గా చెబుతున్నప్పటికీ.. ఆయన పాదయాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ప్రజల కోసం ఎలా తపించాడన్న విషయాన్ని.. పాదయాత్రలో ఎన్ని కష్టాలు పడ్డారన్న విషయాన్ని ప్రేక్షకుల మనసును హత్తుకునేలా చేసి.. ఆ పాదయాత్ర స్పిరిట్‌ను మరోసారి ప్రజల మనసుల్లో రగిలించడం “యాత్ర” ప్రధాన ఉద్దేశం. రాజకీయాలకు… ఈ సినిమాకు సంబంధ లేదని ఎవరు ఎంత చెప్పినా.. బ్యాక్‌గ్రౌండ్ మాత్రం చాలా ఈజీగానే అర్థమైపోతుంది.

కానీ టీజర్ చూసిన తర్వాత… చాలా మందికి వస్తున్న అనుమానం ఒక్కటే. ఈ “యాత్ర” లక్ష్యానికి అనుగుణంగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందా..? గురి తప్పి కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తుందా అనే..! ఎందుకంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే…కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వ్యక్తిగతంగా ఆయన పాదయాత్ర చేశారని చూపించలేరు. కాంగ్రెస్ పార్టీ కోసమే ఆయన పాదయాత్ర చేసినట్లు చూపించాలి. ట్రైలర్‌లో ఇది స్పష్టమైంది. మిగతా అంశాల సంగతేమో కానీ.. కాంగ్రెస్ మార్క్ కండువాను ఆయన భుజం మీద వేసుకోవడం మాత్రం చూసే వారి మనసులో ముద్రపడిపోతుంది. అంటే అందరీ కాంగ్రెస్ పార్టీనే గుర్తుకు వస్తుంది.

“యాత్ర”లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన లేకపోతే.. ఆ సినిమాలో జీవం లేనట్లే. ఒక వేళ కాంగ్రెస్ ప్రస్తావనే తీసుకురాకుండా… కథ అంతా నడిపినా.. అసలు వైఎస్ పాదయాత్ర ఎందుకు చేశారన్నదాన్ని తప్పక చూపించాల్సిందే. అంటే.. నేరుగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన తీసుకురాకపోయినా… వైఎస్… కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే పాదయాత్ర చేశారన్న విషయం అంతర్లీనంగా ప్రజల మనసుల్లోకి వెళ్లిపోతుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. అప్పుడు వైఎస్ పాదయాత్ర చేశారు.. ఇప్పుడు జగన్ పాదయాత్ర చేస్తున్నారన్న కోణంలో ఆ తర్వాత పబ్లిసిటీ చేసుకోవచ్చు.. కానీ పార్టీల ప్రస్తావన వచ్చే సరికి…సీన్ అంతా మారిపోతుంది.

ఈ “యాత్ర” కాంగ్రెస్‌కు ప్లస్‌గా మారుతుందన్న అంచనాలు పెరిగిపోవడానికి మరో కారణం.. ఓటు బ్యాంక్. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంటే.. ప్రధానంగా మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలు . వీరంతా గత ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచారు. కారణం.. వైఎస్ బొమ్మే. ఈ సారి జగన్‌ బీజేపీతో స్నేహపూర్వకంగా మెలుగుతూండటంతో.. ఈ వర్గాలన్నీ అసంతృప్తిలో ఉన్నాయి. బీజేపీకి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఎప్పుడూ దూరమే. వారంతా… “యాత్ర”ను చూసి మళ్లీ కాంగ్రెస్‌కు దగ్గరయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఎలా చూసినా “యాత్ర” లాభం .. ఆశించినట్లుగా వైసీపీకే దక్కే సూచనలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

వివరణ కూడా అడగకుండానే ఎమ్మెల్సీపై అనర్హత !

టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close