క్రైమ్: మనిషి రూప తోడేళ్లు..! 12 ఏళ్ల బాలికపై 22 మంది అత్యాచారం..!!

కాంక్రీట్ జంగిల్ లాంటి నగరాల్లో .. మనిషి రూప తోడేళ్ల మధ్య.. పసిపిల్లలు మాన, ప్రాణాలు కాపాడుకోవడం కూడా కష్టంగా మారుతోంది. మెట్రో నగరాల్లో నిత్యం ఏదో ఓ దురాగతం వెలుగుచూస్తూనే ఉంది. ఇలా కూడా చేస్తారా.. అనిపించేలా ఒక దానిని మించి మరో ఘటన బయటపడుతోంది. ఈ ఘటనల్లో బాధితులంతా… బాలికలే. అభం..శుభం తెలియని చిన్నారులే. ప్రపంచం మొత్తం నివ్వెరపోయే ఇలాంటి ఓ ఘటన చెన్నైలో వెలుగు చూసింది. ఓ పన్నెండేళ్ల బాలికపై.. ఇరవై రెండు మంది కామాంధులు… దాదాపుగా ఏడు నెలల పాటు.. అత్యాచారం చేసిన ఘటన …మాయమైపోతున్న మనుషులకు…అంతమైపోతున్న విలువలకు.. సాక్షిభూతంలా నిలిచింది.

చెన్నై శివారులో.. 300 ఫ్లాట్లు ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ ఉంది. కొత్తగా కట్టిన అపార్ట్‌మెంట్ కావడం… శివారు కావడంతో… సగానికిపైగా అపార్ట్‌మెంట్ ఖాళీగానే ఉంది. అందులో నివసించే ఓ కుటుంబంలో ఎనిమిదో తరగతి చదివే చిన్నారి ఉంది. రోజూ స్కూల్‌ నుంచి వచ్చే సమయంలో… లిఫ్ట్ ఆపరేటర్ ఆ పాపతో.. మాట కలిపాడు. మాటలు చెప్పి ఓ రోజు.. బేస్‌మెంట్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. ఆ పాప బెదిరిపోవడంతో.. ఇక తోడేలయిపోయాడు. తర్వాత … తన స్నేహితుల్ని కూడా పిలిచేవాడు. రోజు పాప.. స్కూల్‌ వ్యాన్ దిగే సమయంలో.. కాపు కాసేవారు. పాపను అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్‌లోకో.. మరో చోటికో తీసుకెళ్లేవారు. ఇలా మొత్తం ఏడు నెలల పాటు 27 మంది తోడేళ్లుగా పాపపై పడ్డారు.

ఎవరికీ చెప్పుకోలేక.. కుమిలి కుమిలి ఏడ్చే ఆ పాప.. బాధను చివరికి తల్లి కనిపెట్టింది. ఏం జరిగిందని ఆరా తీస్తే.. విషయం మొత్తం బయటకు వచ్చింది. పోలీసుల విచారణలో మరిన్ని భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి. పాపపై అత్యాచారానికి పాల్పడిన వాళ్లంతా.. ఓ సెక్యూరిటీ సంస్థకు చెందిన వారు. సెక్యూరిటీగా గార్డులుగా పని చేసేవారు. కొంత మందిని అరెస్ట్ చేశారు. మరికొంత మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.

చిన్నారుల పట్ల తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో.. ఇలాంటి ఘటనలు నిరూపిస్తూ ఉంటాయి. భద్రత ఉంటుందని.. అపార్టుమెంట్లలో నివసించేవారు.. చుట్టూ మనిషి రూపంలో ఉన్న తోడేళ్లను గుర్తించడం అసాధ్యం. అందుకే.. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పిల్లల్ని కాపాడుకోవాలి. ఏ మాత్రం.. నిర్లక్ష్యం చేసినా.. కడుపుకోత అనుభవించాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close