గల్లా జయదేవ్ స్పీచ్ : మెరుపులు , మరకలు

గల్లా జయదేవ్ ఉపన్యాసం తో లోక్సభలో అధికారపక్షాన్ని మరొకసారి ఎండగట్టారు. మోడీ మాట తప్పి మోసం చేశారని సూటిగా విమర్శలు చేశారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడుతూ ముందుగా ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు కేశినేని నానికి కృతజ్ఞతలు తెలిపారు ‌ . ఈ ఉపన్యాసాన్ని కేసినేని నాని ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మొదటిసారి ఎంపి అయిన తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక మొదటిసారి ఎంపికైన వ్యక్తి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి అంటూ అవకాశం ఇచ్చిన అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఆ తర్వాత ప్రత్యేక హోదా విభజన హామీలు మోదీ మాట తప్పడం వంటి అనేక అంశాలపై గంటపాటు ప్రసంగం చేశారు. ఈసారి కూడా చక్కటి వాగ్ధాటితో మంచి ఇంగ్లీష్ లో ప్రసంగించిన గల్లా జయదేవ్ ఉపన్యాసంలో చాలా మెరుపులు, అలాగే కొన్ని మరకలు కూడా ఉన్నాయి.

మెరుపులు ఇవే:

విడిపోయిన తర్వాత నవ్యాంధ్ర నష్టపోయిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎంతగా చెప్పినప్పటికీ ఢిల్లీ పెద్దలు మాత్రం అనేక ఇతర రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ చాలా మెరుగైన పరిస్థితిలోనే ఉంది కదా ఇంకా ఎందుకు ఇంతలా పోరాడుతున్నారు అంటూ చేస్తున్న వాదనను సమర్థంగా తిప్పి కొట్టారు గల్లా . ఎవరైనా కానీ తన పక్కింటి వాళ్లతో ఎక్కువగా పోల్చుకుంటారు తప్ప ఎక్కడో ఉన్నవాళ్ళతో కాదని, తన పక్కన వాళ్ళు అందరూ గొప్పగా ఉంటే తాము మాత్రం చితికి పోతే దాన్ని భారతీయులు ఎవరైనా సరే ఎంతో సీరియస్గా తీసుకుంటారని చెబుతూ ఆంధ్రప్రదేశ్కు పొరుగు అయినటువంటి కర్ణాటక ,తమిళనాడు , తెలంగాణ, కేరళ రాష్ట్రాల తో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత వెనుకబడిపోయిందని గణాంకాలతో సహా నిరూపించారు. వనరులు, ఆదాయం, తలసరి ఆదాయం ఇలా ఏ విధంగా చూసినా పొరుగు వారికంటే ఆంధ్రప్రదేశ్ వెనక్కి పడిపోయిందని నిరూపించారు

రెండవది, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండడానికి కేంద్రం చెబుతున్న కుంటిసాకులు అవాస్తవాలని నిరూపించారు. ప్రత్యేక హోదా ఇవ్వవద్దని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందని, ప్రధాని , కేంద్ర ఆర్థికమంత్రి చెబుతూ వస్తున్న వాదనలని డొల్ల గా తేల్చేశారు. ఆర్థిక సంఘం సభ్యులు గోవిందరావు, అభిజిత్ సేన్ తోపాటు కమిటీ అధ్యక్షుడు వై. వి. రెడ్డి కూడా తామెన్నడూ అలా సిఫారసు చేయలేదని చెప్పారని తేదీలతో సహా సభలో నిరూపించారు. అయితే ఈ పాయింట్ గతంలో, అసెంబ్లీలో జగన్ కూడా ప్రస్తావించి ఉన్నారు, ఇవే పేర్లు, ఇదే తేదీలు ఆయన అప్పట్లో అసెంబ్లీలో గుర్తు చేసి ఉన్నారు. అయితే దీని మీద గల్లా జయదేవ్ చేసిన ఒక చక్కని improvisation ఏంటి అంటే, article 4 ని గుర్తుచేయడం. ఆర్టికల్-3 ఆధారంగా రాష్ట్రాలను విభజించినప్పుడు ఏ రాష్ట్రమైతే వనరులను, మౌలిక వసతులను కోల్పోతుందో ఆ రాష్ట్రానికి న్యాయం చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకునే అధికారాన్ని పార్లమెంటుకు ఆర్టికల్ 4 అందించింది. ఈ ఆర్టికల్ను ప్రధానంగా ప్రస్తావిస్తూ పార్లమెంటుకు కలిగిన అధికారం, ఆర్థిక సంఘం యొక్క అధికారుల కంటే గొప్పదని వ్యాఖ్యానిస్తూ నిజంగా పార్లమెంటు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే దానిని ఏ సంస్థ ఆప జాలదు అని వ్యాఖ్యానించారు.

అలాగే జీఎస్టీ వచ్చిన తర్వాత పారిశ్రామిక రాయితీలకు సాధ్యం కాదని కేంద్ర ఆర్థికమంత్రి, ఇతర ఢిల్లీ పెద్దలు చేస్తున్న వాదనను కూడా తిప్పికొట్టారు. జిఎస్టి వచ్చినప్పటికీ ప్రత్యేక హోదా కలిగిన ఈశాన్య రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీ ఇప్పటికీ కొనసాగుతున్నాయని గుర్తు చేసిన ఆయన తాము కోరుకున్నది కూడా అటువంటి పారిశ్రామిక వెసలుబాటు లేనని వ్యాఖ్యానించారు.

మిగతా ఎన్నో గణాంకాలను ప్రస్తావించి పటిష్టంగా ప్రసంగించిన ప్పటికీ పైన చెప్పిన మూడు అంశాలు ప్రధానంగా ఒక Paradigm shift లాంటివి. కొంతమంది ఇతర రాష్ట్ర ఎంపీలు కూడా ఢిల్లీ పెద్దలతో పాటు వంతపాడుతూ మీకెందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలి చాలా రాష్ట్రాల కంటే మీరు మెరుగ్గానే ఉన్నారు కదా అని చేస్తున్న వాదనను, జిఎస్టి వచ్చింది కదా ఇంకా పారిశ్రామిక రాయితీలు ఎలా కుదురుతాయి అనే వాదనను, ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఆర్థిక సంఘం కానీ మరొకరు కానీ సిఫారసు చేయాలన్న వాదనను సమర్థవంతంగా తిప్పికొట్టారు.

మరకలు ఇవే:

ఎంత గొప్ప స్పీచ్ అయినా అందులో కొన్ని మరకలు ఉండకపోవు. గల్లా జయదేవ్ స్పీచ్ లో కూడా అలాంటివి కొన్ని ఉన్నాయి.

ఉపన్యాసం ప్రారంభించడమే మహేష్ బాబు సినిమా “భరత్ అను నేను” ప్రస్తావనతో ప్రారంభించారు. ఇది మహేష్ బాబు అభిమానులను మరికొంతమంది తెలుగువారిని అలరించినా, విమర్శలకు బాగా తావిచ్చింది. పార్లమెంటులో మాట్లాడే ప్రతి మాటకు ప్రతి నిమిషానికి కొన్ని వేల రూపాయల ప్రజాధనం వెచ్చింపబడుతోంది. ఇంత సీరియస్ సందర్భంలో సినిమాను ప్రస్తావించడం చాలామందికి రుచించలేదు. ఎవరి దాకానో ఎందుకు జయదేవ్ వెనకాల కూర్చున్న అవంతి శ్రీనివాస్ ఆ సినిమా గురించి ప్రారంభించగానే తల కొట్టుకోవడం లైవ్ లో స్పష్టంగా కనిపించింది . కేవలం ఆ సినిమాలోని ప్రామిస్ కి సంబంధించిన డైలాగులు మాత్రమే ప్రస్తావించినా బావుండేది కానీ, గబగబా సినిమా కథ మొత్తాన్ని చెప్పడానికి ఎంపీ గారు ప్రయత్నించారు. నిజానికి ఇదేమీ పెద్ద పొరపాటు కాదు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో సినిమాలు రాజకీయాలు కలగలసిపోయి ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ “భరత్ అను నేను సినిమా” గల్లా జయదేవ్ సొంత బావమరిది అయిన మహేష్ బాబు నటించిన సినిమా కావడంతో పార్లమెంటుని కూడా సినిమా ప్రమోషన్కి వాడుకున్నాడని విపక్షాలు విమర్శించడానికి ఆస్కారమిచ్చింది. అలాగే మన రాజకీయ నాయకులు ఎంత సీరియస్ సందర్భంలో అయినా ఎంతో కొంత సొంత ప్రయోజనాన్ని పిండుకోవడానికి ప్రయత్నిస్తారని ప్రజల్లో ఇదివరకే ఉన్న భావన మరింత బలోపేతం కావడానికి ఇది దోహదం చేసింది.

రెండవది, గల్లా జయదేవ్ మాట్లాడుతూ విభజన పాపంలో బీజేపీకి కూడా వాటాను అంటగట్టారు. సహేతుకంగా విభజించకుండా పార్లమెంటు తలుపులు మూసి వేసి అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ది ఎంత తప్పు వుందో విభజన చట్టంలోని లొసుగులను సరిచేయడానికి ప్రయత్నించకుండా యధాతధంగా ఆమోదించి బిజెపి కూడా ఈ పాపంలో భాగం పంచుకుందని జయదేవ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ లాజిక్ బిజెపికే కాదు తెలుగుదేశం పార్టీకి కూడా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా ఉనికిలేని బిజెపి కంటే ఆ బిల్లును, అందులోని లొసుగులను చేయవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్లోని అందరికంటే సీనియర్ నాయకుడు అయిన, రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే పరమావధిగా జీవిస్తున్నాను అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీకి ఆ బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంది. అయితే విభజన సమయంలో ఆ బిల్లును పరిశీలించడానికి, అందులోని లొసుగులను సరిచేయడానికి తెలుగుదేశం పార్టీ కూడా ప్రయత్నించ లేదు కాబట్టి విభజన పాపంలో ఆ లెక్కన తెలుగుదేశం పార్టీకి కూడా వాటా ఉన్నట్టా?

మూడవది, ఇప్పటికే నెటిజన్లు సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్న అంశం, భరత్ అను నేను సినిమాలోని డైలాగు ఆధారంగా ప్రామిస్ నిలబెట్టుకో లేనివాడు మనిషే కాదు అంటూ మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించడం. నెటిజన్లు ఇప్పటికే, మరి చంద్రబాబు నాయుడు కూడా చాలా విషయాలలో ప్రామిస్ చేసి నిలబెట్టుకోలేదు కదా, మీ లాజిక్ ఆయనకు కూడా వర్తిస్తుందా అంటూ గల్లా జయదేవ్ ట్రోల్ చేస్తున్నారు.

చివరగా:

ఏదిఏమైనా ఇలాంటి చిన్న చిన్న విమర్శలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఆధారాలతో గణాంకాలతో చాలా స్పష్టంగా పార్లమెంటులో ప్రసంగించారు గల్లా జయదేవ్. ఆయన ప్రసంగం ఎంత పకడ్బందీగా ఉందని దానికి నిదర్శనం ఏమిటంటే ఆ తర్వాత మాట్లాడిన మోడీ కూడా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడు లాంటి రాజకీయ విమర్శలు చేశారు తప్పిస్తే గల్లా జయదేవ్ ప్రస్తావించిన గణాంకాలలో గాని , ఆధారాలలో గాని తప్పులు ఎత్తి చూప లేకపోయారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయినప్పటికీ ఈ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు , ప్రస్తావించిన గణాంకాలు ఆధారాలని మున్ముందు రాజకీయ నాయకులు చేసే వాదనల లో విరివిగా ఉపయోగించుకుంటారు అనడంలో సందేహం లేదు

జురాన్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close