అరవైయేళ్ల ముసలోళ్లు అయినా… పదహారేళ్ల పడుచులు అయినా… మాంచి మాస్ బీటున్న సాంగ్ ప్లే అయితే, మనదైన తెలుగు సంస్కృతి వుట్టిపడే పల్లె పదాలు పెదాలపై నాట్యం చేస్తే… ఆడాల్సిందే. చిన్నగా చిందేయాల్సిందే. ‘నువ్వు నేను’లో ‘గాజువాక పిల్లా మేం గాజులోళం కాదా’, ‘బంపర్ ఆఫర్’లో ‘ఎందుకే రవణమ్మా’ పాటలు అంత హిట్టయ్యాయి. పవన్‌కల్యాణ్ సినిమాల్లో ఫోక్ సాంగులులను అంత త్వరగా ఎవరు మర్చిపోగలరు. అటువంటి పాట మరొకటి వచ్చింది. దర్శకుడు సంపత్‌నంది సమర్పణలో తెరకెక్కుతోన్న చిన్న సినిమా ‘పేపర్‌బాయ్’. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమాలోని ‘బొంబాయిపోతావా రాజా… బొంబాయి పోతావా’ పాటను ఈ రోజు విడుదదల చేశారు. ఇందులోని బ్యాండుబాజా, లిరిక్స్ బావున్నాయి. గతంలో ‘బాబు ఓ రాంబాబు’ (కెవ్వు కేక సినిమా), లేటెస్టుగా ‘గరుడవేగ’లో సన్నీ లియోన్ చేసిన ‘డియో డియో డిసక’ సాంగుల తర్వాత మరో మాస్ బీటున్న సాంగ్‌తో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ బ్యాండుబాజా మోగించాడు. కొత్త లిరిక్ రైటర్ సురేష్ ఉపాధ్యాయ సాహిత్యం మాస్ ప్రేక్షకులు, యూత్ చేత స్టెప్పులు వేయించేలా వుంది. సినిమాకి మాంచి బజ్ తీసుకొచ్చేలా వుందీ సాంగ్. ‘గాజువాక పిల్లా…’, ‘ఎందుకే రవణమ్మా…’ తరహాలో పబ్బుల్లో, క్లబ్బుల్లో… జాతరల్లో మోగేలా వుంది.