చంద్ర‌బాబుతో చెడ‌గొట్టుకున్న‌ది పార్టీయే అంటున్న జోషి!

భార‌తీయ పార్టీలో ప్ర‌స్తుతం సీనియ‌ర్లకు ద‌క్కుతున్న గౌర‌వం ఏపాటిదో చూస్తూనే ఉన్నాం. కొద్ది నెల‌ల కింద‌ట‌… ఓ బ‌హిరంగ స‌భ‌లో ఎల్ కే అద్వానీకి ప్ర‌ధాని మోడీ ఇచ్చిన ప్రాధాన్య‌త ఏపాటిదో దేశ‌మంతా చూసింది. ఒక‌ప్ప‌టి భార‌తీయ జ‌న‌తా పార్టీ వేరు, మోడీ నాయ‌క‌త్వంలోని ప్రస్తుత పార్టీ వేర‌నేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం పార్టీ న‌డుతుస్తున్న తీరు మీద సీనియ‌ర్ల‌లో కొంత ఆవేద‌న ఉంద‌న్న‌ది వాస్త‌వం. ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సీనియ‌ర్ నేత ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి చేసిన వ్యాఖ్య‌ల్లో అది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

అభివృద్ధి అనేది స‌హ‌జ‌మ‌నీ, అలాగే అధోగ‌తి కూడా అంతే స‌హ‌జ‌మైంద‌నీ.. ఒక్కోసారి మంచి ప‌రిణామాలు చోటు చేసుకుంటున్న‌ట్టు, దుష్ప‌రిణామాలు కూడా ఉంటాయ‌ని జోషీ వ్యాఖ్యానించారు. ద‌క్షిణాదిన పార్టీ ప‌రిస్థితి గురించి మాట్లాడుతూ… భాజ‌పా చేజేతులా ప‌రిస్థితి చెడ‌గొట్టుకుంద‌న్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో సంబంధాలు దెబ్బ‌తిన‌డానికి కార‌ణం పార్టీ స్వ‌యంకృత‌మేన‌ని చెప్పారు. ఆంధ్రాతోపాటు తెలంగాణ‌లో కూడా ఇదే ప‌రిస్థితి భాజ‌పాకి ఎదురైంద‌ని ముర‌ళీ మ‌నోహ‌న్ జోషి అభిప్రాయ‌ప‌డ్డారు. త‌మిళ‌నాడులో కూడా పార్టీ ప‌రిస్థితి బాగులేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నిజానికి, టీడీపీ విష‌యంలో భాజ‌పా సీనియ‌ర్ నేత‌లు అప్పట్లో పట్టు విడుపు ధోరణి అవలంభించేవారు. వాజ్ పేయి, ఎల్కే అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి వంటి సీనియ‌ర్లు పార్టీలో యాక్టివ్ గా ఉన్న రోజుల్లో.. చంద్ర‌బాబుకి చాలా ప్రాధాన్య‌త ఇచ్చేవారు. అంశాలవారీగా కేంద్ర రాష్ట్రాల మ‌ధ్య కొన్ని తేడాలు ఉన్న‌ప్ప‌టికీ… కొంత స‌ర్దుబాటు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌బ‌ట్టే భాజ‌పా-టీడీపీల బంధం అన్నేళ్ల‌పాటు సుదీర్ఘంగా కొన‌సాగింది. కానీ, మోడీ షా ద్వ‌యం చేతికి పార్టీ వ‌చ్చాక‌… స‌ర్దుబాటు ధోర‌ణి అనే ఊసే లేదు. వారి ఆజ్ఞ‌లు శిర‌సావ‌హించాలి, లేదంటే ప‌క్క‌కు త‌ప్పుకోవాలి! ఈ తీరువ‌ల్ల‌నే స‌హ‌జ మిత్రులు దూరం జరుగుతున్న పరిస్థితి. టీడీపీ కూడా అలానే దూర‌మైపోయింది.

మోడీ వ‌చ్చాక పార్టీ వ్య‌వ‌హార శైలిలో నియంతృత్వ పోక‌డ‌లు పెరిగాయ‌న్న‌ది చాలామంది అభిప్రాయం. అందుకు సాక్ష్యమే టీడీపీ విష‌యంలో అనుస‌రిస్తున్న తీరు. ఈ అసంతృప్తి సీనియ‌ర్ నేతల నుంచి కూడా వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం. ఆంధ్రా, తెలంగాణ‌ల్లో భాజ‌పాకి ఆద‌ర‌ణ లేకుండా చేసుకోవ‌డం మోడీ వ్య‌వ‌హార శైలే కార‌ణ‌మ‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారు ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి. దీన్ని అంగీకరించే పరిస్థితి పార్టీలో అస్సలు లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close