మ‌హేష్ టైటిల్‌.. ఇదేం ప‌బ్లిసిటీ బాబూ..!

ఓ బ‌డా హీరో సినిమా రెడీ అవుతోందంటే.. టైటిల్ ఏంటా? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూడ‌డం స‌హ‌జం. మ‌హేష్ బాబు లాంటి స్టార్ హీరో అయితే ఆ ఆత్రుత ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. మూడు నాలుగు టైటిళ్లు ప్ర‌చారంలోకి రావ‌డం, జ‌నాలు ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకోవ‌డం, చివ‌రికి టైటిల్ ఖ‌రారు కావ‌డం… సాధార‌ణంగా టైటిల్ ని బ‌య‌ట‌కు తీసుకొచ్చే ప‌ద్ధ‌తి ఇది. కానీ మ‌హేష్ 25వ సినిమా కోసం ఓ కొత్త ఆలోచ‌న చేసింది చిత్ర‌బృందం. రోజుకో ఇంగ్లిష్ లెట‌ర్‌ని విడుద‌ల చేస్తూ.. ఆస‌క్తిని పెంచేద్దాం అనుకుంది. మూడు రోజులు గ‌డిచేస‌రికి ‘రిషి’ అనే టైటిల్ అని బ‌య‌ట‌కు లీకైపోయింది. మూడ్రోజుల‌కే టైటిల్ ఏమిటో తెలిసిపోతుంది అనుకున్న‌ప్పుడు ఇలాంటి ప‌బ్లిసిటీ ఎత్తుగ‌డ ఎందుకు వేశారో అర్థం కావ‌డం లేదు. రేపొద్దుట ‘మ‌హేష్ 25 వ సినిమా పేరు రిషి’ అని ఎనౌన్స్ చేసినా.. సూప‌ర్ స్టార్ అభిమానుల్లో కిక్ ఉండ‌దు. ఎందుకంటే ఆ టైటిల్ ఆల్రెడీ తెలిసిపోయింది కాబ‌ట్టి. ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌హేష్ సినిమా టైటిల్ ఏమై ఉంటుంద‌న్న‌ది ఎవ్వ‌రికీ తెలీదు. ఆ సీక్రెసీని జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటూ వ‌స్తున్న చిత్ర‌బృందం ఒక్క‌సారిగా.. ప్ర‌మోష‌న్ లోపంతో టైటిల్‌ని బ‌య‌ట‌పెట్టేసుకుంది. మ‌హేష్ 25వ సినిమా కాబ‌ట్టి.. ప్ర‌మోష‌న్‌ని కూడా కొత్త త‌ర‌హాలో ఆలోచించాల‌నుకోవ‌డం బాగుంది. కానీ… ఈ త‌ర‌హా ప్ర‌మోష‌న్ ఇలాంటి బ‌డా స్టార్ సినిమాల‌కు ఏమాత్రం న‌ప్ప‌దు. కానీ ఇప్ప‌టికే ఆల‌స్యం అయిపోయింది. రిషి అనే టైటిల్ ఫిల్మ్‌న‌గ‌ర్ అంతా పాకేసింది. టైటిల్ విష‌యంలో మ‌హేష్ అభిమానుల్లో మ‌ళ్లీ ఆస‌క్తిని పెంచాలంటే మాత్రం… ఆ టైటిల్‌ని ప‌క్క‌న పెట్టి, ఓ అంద‌మైన అద్భుత‌మైన టైటిల్ ప్ర‌క‌టించ‌డం మిన‌హా మ‌రో మార్గం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

‘పూరీ’ తమ్ముడికి ఓటమి భయం?

విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నర్సీపట్నం 'హార్ట్' లాంటిది, ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్...

మదర్స్ డే @ 200 సంవత్సరాలు

ప్రతి ఏడాది మే రెండో ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారని మనకు తెలుసు.. అయితే ఈ ప్రతిపాదన మొదలై 200 సంవత్సరాలు అయిందనే విషయం మీకు తెలుసా? వాస్తవానికి 'మదర్స్ డే వేడుకలు'...

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close