మ‌రో ఆప్ష‌న్ లేదా వినాయ‌క్‌..??

‘ఖైది నెం. 150’ హిట్ త‌ర‌వాత కూడా వినాయ‌క్ ఖాళీగా ఉన్నాడంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. బాహుబ‌లి త‌ర‌వాత రికార్డుల‌న్నీ.. ఖైదీ పేరిటే ఉన్నాయి. అలాంటి ద‌ర్శ‌కుడు హీరోల కోసం వెదుక్కోవ‌డం విచిత్ర‌మే. ఖైది త‌ర‌వాత చాలా గ్యాప్ తీసుకుని సాయిధ‌ర‌మ్ తేజ్‌తో ‘ఇంటిలిజెంట్‌’ తీశాడు. అదేమంత ఇంటిలిజెంట్ మూవ్ కాద‌ని, ఆ త‌ర‌వాత అర్థ‌మైంది. ఆ సినిమా ఫ్లాప్‌తో వినాయ‌క్ మ‌రింత ఇబ్బందుల్లో ప‌డిపోయాడు. బాల‌కృష్ణ‌తో కాంబినేష‌న్ తెర‌పైకి వ‌చ్చినా… అది కార్య‌రూపం దాల్చ‌లేదు. అయితే ఇప్ప‌టికీ ‘బాల‌య్య‌తో సినిమా లైన్‌లోనే ఉంది’ అంటున్నాడు. బాల‌య్య – వినాయ‌క్ కాంబినేష‌న్ ఉండొచ్చు, ఉండ‌క‌పోవొచ్చు. ఒక‌వేళ ఈ ప్రాజెక్ట్ ఓకే అయినా.. బాల‌య్య ఖాళీ అవ్వ‌డానికి టైమ్ ప‌డుతుంది. ‘ఎన్టీఆర్‌’ అయిన వెంట‌నే బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ సినిమా మొద‌ల‌వుతుంది. అదెప్పుడు పూర్త‌వుతుందో తెలీదు. అప్ప‌టి వ‌ర‌కూ వినాయ‌క్ ఖాళీగా ఉండ‌లేడు క‌దా? ఎప్పుడైతే బాల‌య్య ‘ఎన్టీఆర్‌’ ప‌నుల్లో ప‌డిపోయాడో.. అప్పుడు వినాయ‌క్ మ‌రో ఆప్ష‌న్ చూసుకోవాల్సింది. అయితే ఇప్ప‌టికీ ‘బాల‌య్య సినిమా’నే న‌మ్ముకోవ‌డం ఏమిటో అర్థం కాదు. టాప్ ద‌ర్శ‌కులంతా బిజీగా ఉన్న స‌మ‌యంలో వినాయ‌క్‌లాంటి మాస్ ద‌ర్శ‌కులు హీరోల కోసం ఎదురు చూడ‌డం వింత‌గానే ఉంది. అఖిల్‌, ఇంటిలిజెంట్ ఫ్లాపుల మ‌హ‌త్మ్య‌మే ఇదంతా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close