జనసేన పార్టీ గుర్తు ని పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రకటించారు. నిడదవోలులో జరిగిన సభలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిడికిలి గుర్తు జనసేన పార్టీ గుర్తు గా ఉంటుందని ప్రకటించారు.
అయితే పిడికిలి గుర్తు ప్రకటించడానికి ముందు చంద్రబాబు నాయుడుపై తనదైన శైలిలో విమర్శలు చేశాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఎక్కడికెళ్లినా చేతిలోని రెండు వేళ్ళను v ఆకారంలో చూపుతూ ఉంటారని, ( ఇది విక్టరీ సింబల్ ని సూచిస్తూ చంద్రబాబు చూపిస్తూ ఉంటారు), ఆ రెండు వేళ్లు చంద్రబాబు మరియు లోకేష్ లని సూచిస్తాయని, దానర్థం తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు మరియు లోకేష్ మేమిద్దరమే నని , పార్టీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ డమ్మీ లు అని అర్థం అని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశాడు. అయితే తమ పార్టీ గుర్తు మాత్రం ” పిడికిలి”గా ఉంటుందని, పిడికిలి అంటే అన్ని వేళ్ళు కలపాలని, తమ పార్టీ గుర్తు పిడికిలి అంటే అర్థం , ఇది అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకుని పోతుంది అని సూచించడానికి తాము ఈ గుర్తును ఎంచుకున్నామని పవన్కళ్యాణ్ ప్రకటించారు.
ఇక ఈ మధ్య ప్రతి సభలో కూడా తమ పార్టీ సిద్ధాంతం అన్ని కులాల మధ్య ఐక్యత అన్ని పవన్కళ్యాణ్ ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న ప్రతి సభకు కూడా జనాలు మాత్రం తండోపతండాలుగా వస్తున్నారు.