వైసీపీ ట్రాప్‌లో సీనియర్ మంత్రులు..! పొత్తుల రచ్చ అందుకేనా..?

కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ పొత్తు అంటూ.. కొన్నాళ్లుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. మంత్రుల అభిప్రాయాలు అడిగారు. చంద్రబాబు ఎక్కడా.. పొత్తుల గురించి బయటపడటం లేదు. తెలంగాణలో పొత్తులుంటాయని..సూచన ప్రాయంగా చెప్పారు తప్ప.. కచ్చితంగా కాంగ్రెస్ తో ఉంటుందని చెప్పలేదు. అయినా.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు మాత్రం.. తమ అభిప్రాయాలను ఘాటుగానే వెల్లడించేస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తు ఖాయం అంటూ.. వైసీపీ చేస్తున్న ప్రచారం ట్రాప్ లో టీడీపీ నేతలు పడ్డారన్న అభిప్రాయాలు టీడీపీలో వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనవసర ప్రకటనలు చేస్తున్న మంత్రులపై మండిపడ్డారు. పొత్తులపై మాట్లాడవద్దని ఆదేశించారు.

వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా మళ్లీ నరేంద్రమోదీ కాకూడదనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినే.. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేశారు. ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చే ఎన్నికల తర్వాత కీలకంగా వ్యవహరించబోతున్నాయి. కానీ అధికారం చేపట్టే పరిస్థితి రాదు. కచ్చితంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడమో.. కాంగ్రెస్ మద్దతు తీసుకోవడమో చేయాల్సి ఉంటుంది. ఈ కారణంతోనే కాంగ్రెస్, టీడీపీల మధ్య దూరం తగ్గుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అది రాజకీయవర్గాల్లో పొత్తుల వరకూ వెళ్లింది. కింది స్థాయిలో తెలంగాణలో మాత్రం..కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై సానుకూలత వ్యక్తమవుతోంది. అటు తెలంగాణ టీడీపీ నేతలు.. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పొత్తులపై ఆసక్తితో ఉన్నారు. అనుకూలమైన ప్రకటనలు చేస్తున్నారు.

పొత్తుల వ్యవహారంపై రచ్చ చేస్తున్న మంత్రులకు టీడీపీ అధినేత చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో చర్చ జరగకుండా… పొత్తులపై బయట ఎందుకు రచ్చ చేస్తున్నారని చంద్రబాబు మంత్రులను ప్రశ్నించారు. జగన్ మీడియాలో కొద్ది రోజులుగా కాంగ్రెస్ తో పొత్తంటూ జరుగుతున్న ప్రచారం ప్రభావానికి గురై.. మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పొత్తులపై టీడీపీ పోలిట్‌బ్యూరోలో నిర్ణయం తీసుకుంటారని..సీనియర్ మంత్రులకు తెలియకపోతే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారు. పొత్తులపై ఇక ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించారు. మొత్తానికి పొత్తులపై ఎవరూ మాట్లాడకూడదని.. చంద్రబాబు హెచ్చరించడంతో.. పరిస్థితి ప్రస్తుతానికి సద్దుమణిగినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒక్క కేసీఆర్ మాటలే వినిపించాయా – అదీ నెల తర్వాత !

కేసీఆర్‌ ప్రచారంపై ఈసీ రెండు రోజులు బ్యాన్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అన్ని పార్టీల నేతల్లోనూ కేసీఆర్ మాటల్ని ఈసీ ఇంత సీరియస్ గా తీసుకుందా అన్న డౌట్ కు...

రాజ్ దీప్ ఇంటర్యూలు : పవన్ జోష్, చంద్రబాబు విజన్ – జగన్ అహంకారం !

అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఇండియాటుడే చానల్ హెడ్ రాజ్ దీప్ సర్దేశాయ్ ముగ్గురు ప్రధాన నేతల్ని... ఇంటర్యూ చేశారు. ఏపీకే వచ్చారు. ముగ్గురు ప్రధాన నేతల ఇంటర్యూలను...

సేమ్ బీఆర్ఎస్ లాగే వైసీపీకి ఓవైసీ సపోర్ట్ !

మాము కేసీఆర్ ను మూడో సారి సీఎంను చేసుకుందామని అసదుద్దీన్ ఓవైసీ ముస్లిలు ఎక్కువగా ఉండే ఊళ్లన్నీ తిరిగారు. కేసీఆర్ సీఎం కాకపోతే.. కాంగ్రెస్ గెలిస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టారు. కానీ ఒక్కరూ...

బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోన్న ధృవ్ రాతీ..!

ధృవ్ రాతీ... సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. పొలిటికల్ బెసేడ్ వీడియోలు చేస్తూ ప్రకంపనలు రేపుతున్నాడు. మీడియా అంత గోది మీడియాగా మారిందన్న ఆరోపణలు వస్తోన్న వేళ ధృవ్ రాతీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close