కోన వెంక‌ట్ భ‌య‌పెడుతున్నాడేంట‌బ్బా..??

క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల‌కు అనుగుణంగా క‌థ‌లు అల్ల‌డంలో కోన వెంక‌ట్ దిట్ట‌. ఢీ, రెఢీ, దూకుడు…. ఇలా చాలా మంచి హిట్లున్నాయి అత‌ని ఖాతాలో. విల‌న్‌ని బ‌క‌రా చేసి హీరో ఆడుకునే కాన్సెప్టుల‌కు త‌నే ఆధ్యుడు. ఇప్పుడు ఆ కాలం చెల్లిపోయింది. ట్రెండ్ మారింది. కోన కూడా మారాల్సివ‌చ్చింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ ‘నేను… ఆ పాత కమ‌ర్షియ‌ల్ సినిమాలే తీస్తా.. జాగ్ర‌త్త‌’ అని హెచ్చ‌రిస్తున్నాడు. ఈమ‌ధ్య కోన `నీవెవ‌రో` అనే సినిమా తీశాడు. దానికి ర‌చ‌న అందించ‌డ‌మే కాకుండా, నిర్మాణ భాగ‌స్వామిగానూ వ్య‌వ‌హ‌రించాడు. ఈసినిమాకి స‌రైన స్పంద‌న రాలేదు. ‘జాబు సంతృప్తి వ‌చ్చింది.. జేబు సంతృప్తి ఇంకా రాలేదు’ అని కోన‌నే స్వ‌యంగా చెబుతున్నాడు కూడా. ఈ సినిమా చాలా క‌ష్ట‌ప‌డి చేశామ‌ని, కోట్లు ఖ‌ర్చు పెట్టి తీశామ‌ని, ప‌ది రూపాయ‌ల పెన్నుతో దాన్ని జ‌డ్జ్ చేయొద్ద‌ని.. విమ‌ర్శ‌కుల‌పై రెండు మూడు బాణాలు విసిరాడు. ఇది ఆక్రోశం కాద‌ని, ఆవేద‌న‌ని.. చెప్పుకొచ్చాడు కోన‌. `ఎప్పుడూ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే తీస్తావా` అని అడిగినందుకే `గీతాంజ‌లి`తో రూటు మార్చార‌ని, `నీవెవ‌రో` లాంటి మంచి క‌థ‌ల్ని, కొత్త కాన్సెప్టుల్నీ ఆద‌రించ‌క‌పోతే… మ‌ళ్లీ ఆ పాత క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే తీస్తాన‌ని ఓ హెచ్చ‌రిక‌లాంటిది జారీ చేశాడు. సినిమా తీసేది చూసేవాళ్ల గురించే గానీ, తీసేవాళ్ల కోసం కాద‌ని… ప‌రోక్షంగా విమ‌ర్శకుల్ని ఎత్తుకున్నాడు. ఇలా అన్నాన‌ని మ‌ళ్లీ హెడ్డింగులు పెట్టి న్యూస్‌లు సృష్టించొద్ద‌ని.. సుతిమెత్త‌గానే చుర‌క‌లు వేశాడు. మొత్తానికి ‘నీవెవ‌రో’ రిజ‌ల్ట్‌పై, దాని పై వ‌చ్చిన రివ్యూల‌పై కోన సంతృప్తిగా లేడ‌న్న‌ది మాత్రం అర్థ‌మైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close