ఒక్క హైకోర్టేనా..? ఉమ్మడి సంస్థల వివాదాలూ ఎందుకు పరిష్కరించరు..?

ఉమ్మడి హైకోర్టు విభజన అంశం ఇప్పుడు.. అటు కేంద్రంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రానికి కూడా కీలకంగా మారింది. విభజన చట్టంలో అదొక్కటే పరిష్కారం కాని వివాదం అన్నట్లు..లీకుల మీద లీకులు ఇస్తున్నారు. ఓ సారి ఏపీలో జనవరి నుంచే హైకోర్టు కార్యకాలాపాలు ప్రారంభమవుతాయని లీకిచ్చారు. మరోసారి హైదరాబాద్ లోనే కొన్నాళ్ల ఏపీ హైకోర్టు పని చేస్తుందన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న హైకోర్టు విభజన పిటిషన్ పై కూడా.. తెలంగాణ ప్రభుత్వ ఇదే మాదిరిగా స్పందించింది. ప్రసుత్తం ఉన్న హైకోర్టు భవనాన్నే విభజించి..రెండు హైకోర్టులు ఏర్పాటు చేయవచ్చన్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తెలిపింది. ప్రస్తుతమున్న హైకోర్టు భవనాన్ని ఏపీకి ఇచ్చేందుకు..అభ్యంతరం లేదన్న తెలంగాణ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది ఉమ్మడి హైకోర్టును ప్రతివాదిగా చేర్చింది. గతంలో హైకోర్టు విభజనపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఆ రాష్ట్ర భూభాగంలోనే ఉండాలని స్పష్టం చేసింది.

హైకోర్టు భవనాలను ఏపీకి ఇచ్చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా ఔదార్యం చూపిస్తోంది. కానీ.. పరిష్కృతంగా ఉన్న వివాదాల పరిష్కారానికి మాత్రం.. ఒక్క ఇంచ్ కూడా ముందుకు రావడంలేదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్య వస్థీకరణ చట్టంలోని 9 వ షెడ్యూల్‌ పేర్కొన్న సంస్థల విభజన ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసినా.. పరిష్కారానికి చూపిన చొరవ అంతంతమాత్రమే. రాజ్‌భవన్‌ వేదికగా రెండు రాష్ట్రాల మంత్రులు గవర్నర్‌ సమక్షంలో పలుమార్లు భేటీ అయ్యారు. కీలకమైన 9వ షెడ్యూల్‌లోని 12 ఉమ్మడి సంస్థలపై ఏకాభిప్రాయం కుదిరిందని కూడా అప్పట్లో ప్రకటించారు. సమావేశం ఎప్పుడూ హైదరాబాద్‌లోనే కాకుండా విజయవాడలోనో, అమరావతిలోనే జరపాలని కూడా అనుకున్నారు. అయితే ఈ నిర్ణయం మాటలకే పరిమితం అయ్యింది.

ఏపీలో ఉన్న పారిశ్రామిక, వాణిజ్యపరమైన ప్రభుత్వ సంస్థల ఆస్తులు, అప్పులను.. విభజన తేదీ నాటికి ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఏ ప్రాంతంలో ఉన్నదనే దాన్నిబట్టి కాకుండా ఆ సంస్థ కార్యకలాపాలు ఏయే ప్రాంతాలకు విస్తరించి ఉన్నాయనే దాన్ని బట్టి విభజించాలని సెక్షన 53లో పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి కేసులో భౌగోళికంగా ఆయా సంస్థలు తమ రాష్ట్రంలోనే ఉన్నాయి కాబట్టి అవన్నీ మావే అని తెలంగాణ చేసిన వాదన సరికాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి సంస్థల ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని తేల్చి చెప్పింది. అయితే కేంద్రం మాత్రం.. ఆ తీర్పును సైతం పక్కన పెట్టి హైదరాబాద్ లో ప్రధాన కార్యాలయం ఉన్న సంస్థలన్నీ.. తెలంగాణకే చెందుతాయన్నట్లుగా సుప్రీంకోర్టులోనే అఫిడవిట్ దాఖలు చేసింది. దాంతో వివాదం మరింత పీట ముడి పడింది. వీటన్నింటినీ పరిష్కరించుకుండా.. ముందుగా హైకోర్టును విభభచించాల్సిందేన్నట్లుగా.. అటు కేంద్రం.. ఇటు తెలంగాణ తొందర పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close