కంగనాతో పెట్టుకుంటే అంతే..! మణికర్ణిక దర్శకురాలు తనేనట..!!

బాలీవుడ్‌లో కంగనా రనౌత్ అంటే ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసు. మెత్తగా కనిపించే హీరో అయినా.. దర్శకుడు అయినా… వాళ్ల పని అయిపోయినట్లేనంటారు. ఆ విషయం తెలుగు దర్శకుడు క్రిష్‌కు సరిగ్గా తెలియలేదో… తెలిసినా… డైరక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ షిప్ అంటారని.. ధీమాతోనో కానీ ఆమెతో.. మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీని ప్రారభించారు. చాలా రోజులు సినిమాపై వర్క్ చేశారు. కానీ ఆ సినిమా కొలిక్కి రాలేదు. కాని.. క్రిష్ మాత్రం ఎన్టీఆర్ బయోపిక్‌లో బిజీ అయిపోయారు. ఆ తర్వాత ఆనూహ్యమైన వార్తలు బయటకు వస్తున్నాయి. కంగనాకు.. క్రిష్‌కు మధ్య గొడవలు జరిగాయని… విస్తృతంగా ప్రచారం జరిగింది. వాటిని కంగనానే ఖండించింది.

కానీ.. ఆమె వ్యవహరశైలి మాత్రం తేడాగా ఉంది. ఇప్పుడు తనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు క్లెయిమ్ చేసుకుంటోంది. ఈమె తీరు చూసి.. సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న సోనూ సూద్‌ కూడా తప్పుకున్నారు. ఓ కీలక పాత్రలో నటిస్తున్న సోనూసూద్ .. పార్ట్ మొత్తం దాదాపుగా పూర్తయింది. ఇంకొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుందనగా సోనూ సినిమా నుంచి వైదొలగారు. ఈ విషయాన్ని కూడా కంగనానే వెల్లడించారు. తన లాంటి మహిళా దర్శకురాలితో పని చేయడం ఇష్టం లేకే సోనూ బయటకు వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు.

నిజానికి కంగనా బాధ పడలేక.. క్రిష్.. సినిమాపై దృష్టి తగ్గిచిన తర్వాత కంగనా.. పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని.. స్క్రిప్ట్ మొత్తాన్ని కంగాళీ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కనీసం దర్శకుడు సమాచారం ఇవ్వకుండా.. సన్నివేశాలు చిత్రీకరించుకోవడం ప్రారంభించారట. ఆమె మెంటాలిటి అందరికీ తెలుసు కాబట్టి అందరూ లైట్ తీసుకుంటున్నారు. చివరికి క్రిష్ కూడా.. పూర్తిగా ఎన్టీఆర్ బయోపిక్‌పైనే దృష్టి పెట్టారు. జనవరిలో ఆ సినిమా రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ పరిస్థితి చూస్తూంటే.. మణికర్ణిక బయటకు వస్తుందా అని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close