చంద్రబాబు వ్యూహాలపై టీఆర్ఎస్ నేతలకు బెంగ పట్టుకుందా..?

తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు భయపడుతున్నారా..?. ఎన్నికల భారం మొత్తం… తెలంగాణ టీడీపీ నేతలకే అప్పగించేసి చంద్రబాబు సైడైపోయారు. కానీ ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు నమ్మడం లేదు. చంద్రబాబు ప్రత్యక్షంగా తెలంగాణ ఎన్నికల విషయంలో పట్టించుకోకపోయినా..తెర వెనుక వ్యూహరచన చేస్తున్నారని గట్టిగా నమ్ముతున్నారు. ఈ కోణంలోనే చంద్రబాబుపై ఘాటు విమర్శలు ప్రారంభించారు. టీఆర్ఎస్ ఎంపీ, ప్రస్తుతం చెన్నూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాల్క సుమన్… ఏపీ ఇంటలిజెన్స్ అధికారులు.. తెలంగాణలో క్యాంప్ ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏమిటంటూ.. విమర్శలు గుప్పించారు. వందల కోట్లు తెలంగాణకు తరలించారని ఆరోపించారు. తెలంగాణను కలుషితం చేసేందుకు… చంద్రబాబు ఏపీ ఇంటెలిజెన్స్‌ను వాడుకుంటున్నారని ఆరోపించారు. వేరే రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌ పోలీసులు తెలంగాణలో ఎందుకు తిరుగుతున్నారనేది ఆయనకు వచ్చిన ధర్మసందేహం.

డీజీపీ, గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని సుమన్ డిమాండ్ చేశారు.ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఎవరూ చర్యలు తీసుకోకపోతే… తామే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతామని హెచ్చరికలు కూడా చేశారు. అచ్చంగా ఇలాంటి విమర్శలనే.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా చేశారు. చంద్రబాబు డబ్బు సంచులను తెలంగాణ నుంచి విత్‌ డ్రా చేసుకోకపోతే టీఆర్‌ఎస్ దళాలు పట్టుకుని చట్టానికి అప్పగిస్తాయని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీ నుంచి నిధుల సాయం అందుతుందని… టీఆర్ఎస్ కు కచ్చితమైన సమాచరం వచ్చి ఉంటుందని.. అందుకే.. విమర్శలు ప్రారంభించారన్న అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు.. మాత్రం.. టీఆర్ఎస్ ఆరోపణల్ని తేలిగ్గా తీసి పడేస్తున్నారు. రాజకీయాల్లో .. అలా చేస్తారేమో అన్న భయంతో.. ముందస్తుగా ఆరోపణలు చేస్తూంటారని..టీఆర్ఎస్ నేతలు అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారంటున్నారు. అంతగా.. ఏపీ నుంచి డబ్బు సంచులు వస్తే.. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని చేతుల్లో ఉంచుకుని.. ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసని… విపక్ష నేతంలదరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న అనుమానాన్ని టీ టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి…మహాకూటమితో టీఆర్ఎస్ పోటీలో… ప్రధానంగా చంద్రబాబు పేరునే.. గులాబీ నేతుల స్మరిస్తున్నారు. ఆయన వ్యూహాలకు చెక్ పెట్టడానికి ముందస్తు ఆరోపణలు ప్రారంభించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నర్సరావుపేట రివ్యూ : గాలి మారుతోంది !

నర్సరావుపేట కోడెల హయాంలో వైసీపీ కంచుకోట. కానీ నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండటంతో .. కోడెల సొంత మండలాన్ని సత్తెనపల్లి నియోజకవర్గంలో చేర్చేశారు. అదనంగా రెడ్డి...

కడపలో వైఎస్ ఓటు బ్యాంక్ చెరో ఓటు ట్రెండ్ – అవినాష్ పుట్టి మునిగినట్లే !

కడపలో అవినాష్ రెడ్డి పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తోంది. కడపలో వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించేవారు ఎవరూ ఆ కుటుంబానికి ఓటేసే అవకాశం లేదు. వైఎస్ కుటుంబాన్ని అభిమానించేవారు మాత్రం ఈ...

మంగళగిరిలో ఓటుకు నాలుగు వేలు..!?

కుప్పం.. మంగళగిరి.. పిఠాపురం.. ఈ మూడు నియోజకవర్గాలపై వైసీపీ ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. కారణం అక్కడ చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ లు పోటీ చేస్తుండటమే. దీంతో వారిని ఎలాగైనా ఓడించాలని...

సజ్జల భార్గవ, వైసీపీ సోషల్ మీడియా టీంపై సీఐడీ కేసులు !

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారంటే ఏంటో వైసీపీ సోషల్ మీడియా, వాటి ఇంచార్జ్ సజ్జల భార్గవను చూస్తే అర్థమైపోతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీపై కేసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close