అమిత్ షా హైదరాబాద్ నుంచి పోటీ చేయడం లేదా..?

“హైదరాబాద్‌ నుంచి పోటీ చేసే యోచనలో అమిత్ షా..” కొన్నాళ్ల క్రితం.. బీజేపీ క్యాంప్‌ నుంచి ఉద్ధృతంగా సాగిన ప్రచారం ఇది. చాలా మంది ఆశ్చర్యపోయారు. నిజమేనా అనుకున్నారు. అయితే దీనిపై బీజేపీ నేతలు చాలా కాన్ఫిడెంట్‌గా స్పందించారు. కచ్చితంగా పోటీ చేస్తారని చెప్పుకుండా… చేస్తే..సులువుగా గెలిచేస్తారని… ఉదరగొట్టేశారు. అప్పుడే అమిత్ షా హైదరాబాద్‌లో పోటీ చేస్తే .. తెలంగాణ లెక్కలు ఎలా ఉంటాయో కూడా అంచనా కు వచ్చారు. హైదరాబాద్‌లో అమిత్ షా పోటీ చేయడం వల్ల.. తెలంగాణ మొత్తం హిందూ ముస్లిం ఓట్లు పోలరైజ్ అవుతామని.. బీజేపీ గొప్పగా ఉనికి చాటుకుంటుందని చెప్పుకున్నారు. తీరా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి.. బీజేపీ నేతలు.. తూచ్ అనేశారు. అమిత్ షా.. హైదరాబాద్ నుంచి పోటీ చేయబోవడం లేదని చెప్పడానికి… ఓవైసీపై… ఓ సామాన్య కార్యకర్తను నిలబెట్టి గెలిపించుకుంటామని కవర్ చేస్తున్నారు.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు… అమిత్ షా హైదరాబాద్ నుంచి పోటీ చేయడం లేదని క్లారిటీ ఇవ్వగానే.. అటు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైపీ.. సోషల్ మీడియాలో టీజ్ చేయడం ప్రారంభించారు. అమిత్‌షా హైదరాబాద్‌లో పోటీచేసినా తమ పార్టీయే గెలుస్తుందని సవాల్ చేశారు. తెలంగాణలో ఇప్పుడు ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలను కూడా బీజేపీ మళ్లీ గెలవలేదని జోస్యం చెప్పారు. పెట్రోల్‌ధరల నియంత్రణ, యువతకు ఉద్యోగ కల్పనపై భాజపా తమ నిర్ణయాలను వెల్లడించాలని డిమాండ్‌చేశారు. గతంలోనూ ఓవైసీ ఇదే చాలెంజ్‌ను చాలా సార్లు చేశారు. హైదరాబాద్‌లో తనపై పోటీ చేయాలని… సవాల్ చేశారు. కానీ బీజేపీ మాత్రం… మొదట రెడీ అన్నట్లుగా ప్రచారం చేసి.. చివరికి వచ్చే సరికి వెనక్కి తగ్గింది.

హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో.. మతం ప్రకారమే ఓటింగ్ జరుగుతుంది. హిందువులు గణనీయ సంఖ్యలో ఉన్నా… ముస్లింలే మెజార్టీ. ముస్లం ఓట్లు గుంపగుత్తగా మజ్లిస్‌కే పడుతున్నాయి. గతంలో మజ్లిస్‌కు పోటీగా.. మజ్లిస్ బచావో తహరిక్..ఎంబీటీ అనే పార్టీ ఉండేది. మజ్లిస్‌తో పోటీగా ఓట్లు..సీట్లు కూడా సాధించేంది. క్రమంగా ఆ పార్టీ ప్రాభవం కోల్పోవడంతో.. మజ్లిస్‌కు ఎదురు లేకుండా పోయింది. ఎలా చూసినా.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో… మజ్లిస్‌ గెలుపు ఖాయం. అలాగే హైదరాబాద్‌ పార్లమెంట్ స్థానం కూడా. అందుకే.. ఓవైసీ దైర్యంగా.. బీజేపీ అగ్రనేతలకే సవాల్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వియ్యంకుడి తరఫున విక్టరీ వెంకటేష్ ప్రచారం..!!

లోక్ సభ ఎన్నికల సమయం సమీపిస్తోన్న వేళ సినీ స్టార్లు కూడా ప్రచార పర్వంలోకి దూకుతున్నారు. తమ బంధువులను ఎన్నికల్లో గెట్టేక్కించేందుకు తమ వంతు పాత్ర పోషించాలని డిసైడ్ అయ్యారు. తాజాగా టాలీవుడ్...

బీఆర్ఎస్ ను పతనావస్తకు చేర్చుతున్న కేసీఆర్..!?

బీఆర్ఎస్ ఉనికికి పరీక్షలా మారిన లోక్ సభ ఎన్నికల్లో గులాబీ బాస్ ప్రసంగం పేలవంగా ఉంటుందా..? కాంగ్రెస్ ను ఇరకాటంలో నెట్టకపోగా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపేలా ఆయన ప్రసంగం ఉంటుందా..? ...

కాంగ్రెస్ అలర్ట్…బీఆర్ఎస్ కోవర్టులపై యాక్షన్..!!

కాంగ్రెస్ సర్కార్ ను బద్నాం చేసేందుకు ఆయా శాఖల అధికారులు కుట్రలు చేస్తున్నారా..? గోప్యంగా ఉంచాల్సిన కీలక సమాచారాన్ని బీఆర్ఎస్ కు చేరవేస్తున్నారా..? ఇరిగేషన్ , విద్యుత్ శాఖలో మాత్రమే కాకుండా ఇతర...

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close