రీకాల్ పిటిషన్ తిరస్కరణ..! సీఎం అయినా కోర్టుకు రావాల్సిందేనన్న న్యాయమూర్తి..!!

బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసులో అరెస్ట్ వారెంట్‌ను రీకాల్ చేయాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున న్యాయవాది వేసిన పిటిషన్‌ను… ధర్మాబాద్ కోర్టు తిరస్కరించింది. రీకాల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో… కోర్టుకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరారు. చట్టానికి ఎవరూ మినహాయింపు కాదని, ముఖ్యమంత్రైనా.. ఎవరైనా కోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని, ఎవరికీ స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వదల్చుకోలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చంద్రబాబు సహా 16 మంది నేతలు.. అక్టోబర్ 15న కోర్టులో హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఈ కేసు వివాదం మరో నెల రోజుల పాటు నడవనుంది.

తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ వ్యవహారం రాజకీయ వేడి రేపింది. ఈ రోజు ఏం జరుగుతోందన్న ఉత్కంఠ.. ప్రజల్లో ఏర్పడింది. ఇరవై ఒకటో తేదీన హాజరు కావాలంటూ… బాబ్లీ ఆందోళన కేసులో… చంద్రబాబు సహా పదహారు మందిపై.. కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పట్లో ఆందోళన చేసిన వారు.. 70 మందికిపైగా ఉంటే.. ఇప్పుడు కేవలం 16 మందికే వారెంట్ రావడం.. అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోయినా… ఇప్పుడు పంపిన వారెంట్లలో ఆయన ముఖ్యమంత్రిగా సంబోధించడం వంటి అంశాలపై టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. చివరికి అసలైన వారెంట్ ప్రతిని కూడా.. నాందెడ్ పోలీసులు… ముఖ్యమంత్రికి అందజేయలేకపోయారు. దీంతో చంద్రబాబు లాయర్‌ను కోర్టుకు పంపారు. రీకాల్ పిటిషన్ వేయించారు.

ఈ రోజు.. వారెంట్ అందుకున్న పదహారు మందిలో.. తెలంగాణకు చెందిన గంగుల కమలాకర్, కేఎస్ రత్నం లాంటి నేతలు.. కోర్టుకు వచ్చారు. వీరితో పాటు.. మిగతా పదహారు మంది నేతలూ… వచ్చే నెల పదిహేనో తేదీన మళ్లీ హాజరు కావాలని కోర్టు ఆదేశించంది. కోర్టు స్ఫష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో.. వచ్చే నెల పదిహేనో తేదీన.. చంద్రబాబు తప్పనిసరిగా కోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పటికి తెలంగాణ ఎన్నికల మూడ్ మరింత వేడెక్తుతుంది కాబట్టి.. మరింత రాజకీయం రాజుకునే చాన్స్ ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close