నేటి అరుకు, నాటి అలిపిరి.. ఈ రెండు ఘ‌ట‌న‌ల‌కీ ఒక లింక్‌!

అరుకు ఎమ్మెల్యే స‌ర్వేశ్వ‌ర‌రావును మావోయిస్టులు హ‌త‌మార్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో, విదేశీ ప‌ర్య‌ట‌న నుంచి వ‌చ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లారు. పార్టీ త‌ర‌ఫున‌, ప్ర‌భుత్వం త‌ర‌ఫున అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ హామీ ఇచ్చారు. ఇంకోప‌క్క‌, అరుకు ప్రాంతంలో పోలీసులు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌నీ, మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో నిఘా వైఫ‌ల్యం చెందింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ ప్రాంతంలో పోలీస్ శాఖ‌లో భారీగా బ‌దిలీలు ఉండొచ్చ‌ని తెలుస్తోంది. ఎందుకంటే, అరుకు ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం కూడా కావ‌డంతో, వీలైనంత త్వ‌ర‌గా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్చ‌లు తీసుకుని, ఆ ప్రాంతంలో భ‌ద్ర‌త‌కుఎలాంటి స‌మ‌స్యా లేద‌నే విశ్వాసాన్ని ప‌ర్యాట‌కుల్లో క‌లిగించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

మ‌రోప‌క్క‌… ఈ ఘ‌ట‌న జ‌రిగి రోజులు గడుస్తూ ఉన్నా, మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా లేక‌పోవ‌డం కూడా చ‌ర్చ‌నీయం అవుతోంది. నిజానికి మావోయిస్టులు ఏ చిన్న ఘ‌ట‌న‌కు పాల్ప‌డినా… ఫ‌లానా కార‌ణంతో చేశామంటూ ఏదో ఒక క‌ర‌ప‌త్రం, లేదా ప్ర‌క‌ట‌న ద్వారా ఏదో ఒక దళం పేరుతో తెలియజేస్తూ ఉంటారు. అరుకు ఘ‌ట‌న‌పై ఇప్ప‌టివ‌ర‌కూ అలాంటి ప్ర‌క‌ట‌న ఏదీ వెలువ‌డ‌క పోవ‌డం కొంత చ‌ర్చ‌నీయ‌మే అవుతోంది. దీంతో అరుకు ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌ర‌గాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కిలారు స‌ర్వేశ్వ‌ర‌రావు హ‌త్య‌కు పాల్ప‌డ్డ‌ది అరుణ అనే మ‌హిళా మావోయిస్టు. ఈమె మావోయిస్టు అగ్ర నేత చ‌లప‌తికి భార్య‌!

ఈ చ‌ల‌ప‌తి ఎవ‌రంటే… గ‌తంలో, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపైన అలిపిరిలో జ‌రిగిన దాడికి సంబంధించి ఈయ‌న కీల‌కపాత్రదారి, ప్ర‌ధాన నిందితుడు కావ‌డం గ‌మ‌నార్హం. ఈయ‌న భార్య అరుణ తాజా అరుకు ఘ‌ట‌న‌లో కీల‌క పాత్ర పోషించారు. అయితే, ఈ ఘ‌ట‌న‌లో పాల్గొన్న అరుణ‌… పార్టీ ఎందుకు మారారు అంటూ ప్ర‌శ్నించ‌డంతోపాటు, పార్టీ మారేందుకు ఎంత తీసుకున్నారంటూ ప్ర‌శ్నించారంటూ తెలిసిన స‌మాచారం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. దీంతో ఇది మావోయిస్టులకు సంబంధించిన‌ అజెండా మేర‌కు జ‌రిగిందా… లేదా, వీరి వ్య‌క్తిగ‌త అజెండాలో భాగంగా ఈ దాడికి తెగ‌బ‌డ్డారా అనే అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి. ఇంకోటి, దాడికి పాల్ప‌డ్డ‌వారు మావోయిస్టు యూనిఫామ్ లో ఎందుకు రాలేద‌నీ, దాడి స‌మ‌యంలో పార్టీల‌కు సంబంధించిన ప్రస్థావ‌న ఎందుకు వ‌చ్చింద‌నేదీ చ‌ర్చ‌నీయం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close