రేవంత్ రెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు!

కాంగ్రెస్ నేత‌ రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ఎట్ట‌కేల‌కు ముగిశాయి. గ‌డచిన రెండ్రోజులుగా నలుగురు ఐటీ అధికారులు రేవంత్ ఇంట్లోనే ఉంటూ ఆదాయానికి మించిన ఆస్తుల‌పై వివ‌రాల‌ను సేక‌రించే ప‌నిలో ఉన్నారు. దీన్లో భాగంగా ప‌లు కీల‌క డాక్యుమెంట్లు, ప్రింట్లు స్వాధీనం చేసుకున్న‌ట్టు స‌మాచారం. దాదాపు 43 గంట‌ల‌పాటు రేవంత్ ఇంట్లో ఐటీ సోదాలు జ‌రిగాయి. రేవంత్ రెడ్డిని 31 గంట‌ల‌పాటు విచారించారు. మొత్తానికి, శ‌నివారం తెల్ల‌వారు జామున 2 గ‌. 30 ని.ల‌కు ఐటీ అధికారుల దాడులు ముగిశాయి. అయితే, అక్టోబ‌ర్ 3న ఐటీ కార్యాల‌యానికి రేవంత్ రెడ్డి హాజ‌రు కావాల్సి ఉంటుంద‌ని అధికారులు చెప్పారు. ఉద‌య సింహ‌ను అక్టోబ‌ర్ 1న విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఐటీ దాడిలో దాదాపు రూ. 20 కోట్ల విలువ‌ల గ‌ల లెక్క‌లు చూపని ఆస్తుల వివ‌రాల‌ను అధికారులు సేక‌రించిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ సొమ్ము రేవంత్ బావ‌మ‌రిది జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి పేరుతో ఒక కంపెనీకి చెందిన‌విగా ఉన్నట్టు గుర్తించిన‌ట్టు సమాచారం. రేవంత్ తోపాటు ఆయ‌న భార్య‌ను కూడా అధికారులు విచారించారు. దాదాపు 150 ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను రాబ‌ట్టార‌నీ, అవి కూడా లిఖిత పూర్వ‌క స‌మాధానాల‌ని తెలుస్తోంది. విచార‌ణ‌లో భాగంగా ఓటుకు నోటు కేసుకు సంబంధించిన రూ. 50 ల‌క్ష‌ల న‌గ‌దుకు సంబంధించి కూడా అధికారులు కొన్ని ప్ర‌శ్న‌లు అడిగిన‌ట్టుగా తెలుస్తోంది. రేవంత్ వియ్యంకుడు పోర్షే కారు వాడుతున్నార‌ని అధికారు అడిగితే… దాన్లో తప్పేముందీ, ఆయ‌న పోర్షే కారులో తిరగ‌డ‌మూ నేర‌మేనా అంటూ రేవంత్ కొంత ఘాటుగా స‌మాధానం చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది.

రేవంత్ ఇంట్లో సేక‌రించిన డాక్యుమెంట్ల ప‌రిశీల‌న ప్ర‌క్రియ శ‌నివారం కూడా కొన‌సాగే అవ‌కాశం ఉంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో రేవంత్ రెడ్డి చూపించిన ఆస్తుల వివ‌రాల‌కు, ఆ త‌రువాత ఆయ‌న చెల్లిస్తున్న ప‌న్నుల‌కూ మ‌ధ్య పొంతన లేద‌ని అధికారులు గుర్తించార‌ట‌. అంతేకాదు, ఆదాయానికి త‌గ్గ‌ట్టుగా ప‌న్నులు చెల్లించ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు కూడా అధికారుల నుంచి వినిపిస్తున్న ప‌రిస్థితి. ఇక‌, తాజా దాడుల గురించి… దీన్లోని రాజ‌కీయ కోణం గురించి రేవంత్ రెడ్డి మీడియాకు శనివారం వివ‌రించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close