కేసీఆర్ కి కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి స‌వాల్‌!

ప‌నికి మాలిన నాయ‌కులంతా న‌ల్గొండ జిల్లాలోనే ఉన్నార‌నీ, అంద‌ర్నీ ప్ర‌జ‌లు ఓడ గొట్టాల‌ని మొన్న‌టి స‌భ‌లో కేసీఆర్ విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి స్పందించారు. న‌ల్గొండ‌లో జ‌రిగిన ఓ ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ… వ‌చ్చే ఎన్నిక‌ల్లో జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ 10 నియోజ‌క వ‌ర్గాల్లో విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. అంతేకాదు, జిల్లాలో ప‌ది స్థానాలు హ‌స్తగ‌తం కాక‌పోతే, అప్ప‌టికి తాను ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నా స‌రే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతా అంటూ స‌వాల్ చేశారు. త‌న సవాల్ ను కేసీఆర్ స్వీక‌రిస్తున్నారా లేదా చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

కేసీఆర్ త‌న సొంత నియోజ‌క వ‌ర్గంలో ఒకలా, కాంగ్రెస్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క వ‌ర్గాల్లో మ‌రోలా ప్ర‌జ‌ల‌ను చూస్తున్నార‌ని ఆరోపించారు. గజ్వేల్‌, సిద్ధిపేట నియోజ‌క వ‌ర్గాల్లో థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్లు ఎందుకు పెట్ట‌లేద‌నీ, ఇక్క‌డే ఎందుకు పెడుతున్నార‌నీ, దీని వ‌ల్ల మిర్యాల‌గూడ ప‌రిస‌ర ప్రాంతాలన్నీ కాలుష్య‌మ‌యం అవుతాయ‌న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దామ‌చ‌ర్ల ప్లాంటును మూసేస్తామ‌ని కోమ‌టిరెడ్డి హామీ ఇచ్చారు. బతుక‌మ్మ చీరల పేరుతో తెరాస నాయ‌కులు కోట్ల‌కు కోట్లు దోచుకున్నారంటూ ఆరోపించారు.

నిజానికి, తెరాస‌కు ఈసారి న‌ల్గొండ జిల్లా స‌వాలుగానే క‌నిపిస్తోంది. ఇత‌ర జిల్లాల్లో త‌మ చ‌తుర‌త‌తో గులాబీ జెండా ఎగ‌రేసినా… ఈ జిల్లాకి వ‌చ్చేస‌రికి కేసీఆర్ కొంత త‌ట‌ప‌టాయిస్తున్నారు. ఎక్క‌డ ఉప ఎన్నిక‌లు జ‌రిగినా తామే గెలుస్తామ‌ని గ‌తంలో గొప్పగా చెప్పుకుంటే వ‌చ్చిన కేసీఆర్‌… న‌ల్గొండ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేసి, వెన‌క్కి త‌గ్గిపోయిన సంగ‌తి తెలిసిందే. గుత్తా సుఖేందర్ రెడ్డి తెరాసలో చేరినా, కాంగ్రెస్ కు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డా కూడా ఆయన్ని ఆపేశారు కదా. రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, టీడీపీలు క‌ల‌వ‌డం ద్వారా ఈ జిల్లాలో చాలా నియోజ‌క వ‌ర్గాల్లో తెరాస‌కు మ‌రింత గ‌ట్టిపోటీ ఖాయ‌మ‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల‌ను తెలంగాణ ద్రోహులుగా విమ‌ర్శ‌లు చేసి, ప్ర‌జ‌ల్లో మ‌రోసారి సెంటిమెంట్ ర‌గ‌ిల్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. నిజానికి, న‌ల్గొండ కాంగ్రెస్ కి మంచి ప‌ట్టున్న జిల్లా. కీల‌క నేత‌లు ఇక్క‌డి నుంచే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మ‌రి, కోమ‌టిరెడ్డి స‌వాల్ చేసిన‌ట్టుగా ప‌ది స్థానాలు ద‌క్కించుకునేందుకు ఆయ‌న సొంతంగా చేయ‌బోయే కృషి ఎలా ఉంటుందో చూడాలి. కోమ‌టిరెడ్డి స‌వాలుకు తెరాస నుంచి ఎవ‌రు స్పందిస్తారో చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close