తెలంగాణ ఎన్నికలపై కాస్త క్లారిటీ ఇవ్వొచ్చు కదా జనసేనాని..!

జనసేన అధినేత ఎన్నికలు దగ్గర పడుతున్న కారణంగా.. పార్టీ వ్యవహారాలను మరింత చురుకుగా నిర్వహించాలని నిర్ణయించారు. సహజంగా.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముంచుకొస్తోంది తెలంగాణకు కాబట్టి.. పవన్ కల్యాణ్.. ఈ రాష్ట్రంపై దృష్టి పెట్టి ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ పవన్ కల్యాణ్… ఎన్నికలు దగ్గర పడుతున్నాయనుకుంటున్నది… పార్టీ వ్వహారాల్లో మరింత వేగం పెంచాలనుకుంటున్నది… ఏపీ రాజకీయాల గురించే. తెలంగాణ రాజకీయాల గురించి పవన్ కల్యాణ్…అస్సలు ఆలోచించడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా టూర్‌ను హఠాత్తుగా ఆపేసి మూడు రోజుల కిందట హైదరాబాద్ వెళ్లిన పవన్ శుక్రవారం సాయంత్రం విజయవాడకు వచ్చారు. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 15న ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. శనివారం 13 జిల్లాలకు చెందిన ముఖ్యనేతలతో పవన్ భేటీ అవుచాకుయ ఆదివారం పోలవరం ప్రాజెక్టును ఆయన సందర్శిస్తారు.

మరి ఈ టైట్ షెడ్యూల్‌లో .. రేపో మాపో.. ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్న తెలంగాణకు ఎందుకు ఒక్క రోజు కూడా.. కేటాయించడం లేదనేదే ఆసక్తికరంగా మారింది. అసలు తెలంగాణలో పోటీ చేసే ఉద్దేశం పవన్‌కి ఉందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. పోటీ చేయకుండా వెనుకడుగు వేసే ప్రశ్నే లేదని… జనసేన వర్గాలు చాలా కాలంగా చెబుతూ వస్తున్నాయి. గతంలో పవన్ కల్యాణ్… తెలంగాణలో పర్యటించినప్పుడు.. కచ్చితంగా పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ దిశగా కనీస ప్రయత్నాలు కూడా లేవు. తన బలం సరిపోదనుకుంటే… కేసీఆర్‌కు వ్యతిరేకంగా కూటములు రెడీ అయ్యాయి. వాటిల్లో చేరొచ్చు . లేకపోతే… కేసీఆర్‌కు అనుకూలంగా ఉండాలంటే.. ఆయనతోనే పొత్తు పెట్టుకోవచ్చు. సీపీఎం నేతృత్వంలోని బహుజన లెఫ్ట్ ఫ్రంట్… పవన్‌తో పొత్తు పెట్టుకునేందుకు చాలా తాపత్రయ పడింది కూడా. పవన్ కల్యాణ్ వారికి కనీస రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు.

పవన్ కల్యాణ్.. తెలంగాణలో పోటీ విషయంపై పూర్తి చేతులెత్తేశాడన్న ప్రచారం జరుగుతోంది. అదేజరిగిదే… రాజకీయాలపై ఆయన సీరియస్‌ నెస్ విషయంలో చాలా సందేహించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన ఏపీలో పోటీ చేసినా.. పూర్తిగా లైట్ తీసుకునే పరిస్థితి వస్తుంది. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత తొలి సారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. మళ్లీ ఐదేళ్లకు వస్తున్న ఎన్నికల్లో కూడా.. పోటీ చేసే సామర్థ్యాన్ని సమకూర్చుకోలేదని చెప్పి.. ఎన్నికలకు దూరంగా ఉండటం అంటే.. అంతకన్నా ఆత్మహత్యాసదృశ్యం మరొకటి ఉండదు. ఐదేళ్ల సమయంలో.. తెలంగాణలో పోటీ చేయడానికే సమర్థత సరిపోకపోతే.. ఇక ఏపీలో ఎలా పోటీ చేస్తారన్న విమర్శలు సహజంగానే వస్తాయి. ఇప్పటికైనా పవన్ కల్యాణ్.. తెలంగాణ ఎన్నికలపై.. తన విధానం ఏమిటో అధికారికంగా ప్రకటించాలి. లేకపోతే.. రాజకీయాల్లో హత్యలు ఉండవు… ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడిని… నిజం చేసిన వారవుతారు.

.. సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close