పుంజుకోని 99 టీవీ, గుర్రుగా ఉన్న జనసైనికులు

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీద కొన్ని చానళ్ళలో ఆ మధ్య అదేపనిగా నెగటివ్ ప్రోగ్రామ్స్ వేసి, ఆయన పార్టీని దెబ్బతీయడానికి, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నించడంతో పవన్ కళ్యాణ్ మీడియా పై తిరగబడ్డ విషయం తెలిసిందే. తన తల్లిని బూతులు తిట్టించారని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ మీడియాపై ఎదురుదాడికి సిద్ధపడడం కూడా తెలిసిందే. అయితే రాజకీయ పార్టీకి మీడియా అవసరం ఎంత ఉందో ప్రజారాజ్యం సమయంలోనే తేటతెల్లం కావడంతో, తన పార్టీకి మద్దతుగా కొన్ని చానళ్లు ఉండేలా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకున్నాడు. ఆ క్రమంలో జనసేన నేత ,మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ 99టీవీ చేజిక్కించుకోవడంతో జనసేన అభిమానులు తమకంటూ ఒక ఛానల్ ఉందని సంబరపడిపోయారు. కానీ ఇప్పుడు అదే అభిమానులు 99 టీవీ ఛానల్ పైన కంప్లైంట్ లు చేస్తున్నారు.

పుంజుకో లేకపోయిన 99టీవీ:

చానల్ ప్రారంభించి కొద్ది రోజులే అయింది కాబట్టి బాలారిష్టాలు ఉండడం సహజమే. అయితే మరో ఆరేడు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని ఇప్పటికీ ఆ అరిష్టాలను దాటి ముందుకు వెళ్లకపోవడంతో అభిమానుల్లో చానల్ పై ఒక విధమైన అసంతృప్తి కనిపిస్తోంది. ఒక ఇరవై వార్తా చానల్ ల దాకా తెలుగులో ఉంటే, 99టీవీ స్థానం 18 లేదా 19 లో ఉంటోంది. మొదటి స్థానంలో ఉన్న టీవీ 9 కి 70 పాయింట్ల దాకా రేటింగ్ ఉంటే, 99టీవీ 4 పాయింట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

అభిమానుల కంప్లైంట్లు ఏమిటి?

మొట్టమొదటి కంప్లైంట్ , ఇప్పటికీ చాలా చోట్ల ఈ ఛానల్ రావడం లేదు. హైదరాబాద్ నగరంలోనే బ్రైట్ వే లాంటి ఆపరేటర్లు ఈ ఛానల్ ని బ్లాక్ చేసి చాలా కాలం అయింది. కొంతమంది అభిమానులు ఆపరేటర్లను ఈ విషయమై ప్రశ్నిస్తే, ఛానల్ నుంచి వాళ్లకు బకాయిలు ఇంకా రావలసి ఉందని వారు చెబుతున్నారు. ఇదే సమస్య మిగతా చాలా ఆపరేటర్ల తో కూడా ఉంది. అన్నేసి కోట్లు పెట్టి ఛానల్ కొనుక్కున్న వాళ్ళు, చిన్న చిన్న బకాయిలు తీర్చడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ అభిమానులు 99టీవీ దృష్టికి కూడా తీసుకు వెళ్తున్నారు.

రెండవ కంప్లైంట్, ఇప్పటికీ ఈ ఛానల్ డిటిహెచ్ లో రావడం లేదు. ఈమధ్య వీడియోకాన్ లో వస్తున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాలలో ఎక్కువమంది ఉపయోగించే ఆపరేటర్ల లో ఈ ఛానల్ ఇప్పటికీ రావడం లేదు. అసలు ప్రసారాలు రాకపోతే టి ఆర్ పి లు మాత్రం ఎలా వస్తాయి అని జనసేన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

అలాగే ఛానల్ లో వచ్చే ప్రోగ్రాం ల నాణ్యత విషయంలో కూడా కంప్లైంట్ లు ఉన్నాయి. వీడియో క్వాలిటీ లాంటి విషయాల్లో గత రెండు నెలల్లో చాలా మెరుగుదల కనిపించినప్పటికీ, ప్రోగ్రామ్స్ జనాకర్షకంగా లేకపోవడం, జనసేన అభిమానులను తప్ప మిగిలిన తటస్థ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయకపోవడం వంటి విషయాల్లో అభిమానులు 99టీవీ పై గుర్రుగా ఉన్నారు.

ఛానల్ యాజమాన్యం ఏమంటున్నారు:

ఛానల్ లో పనిచేసే పై స్థాయి సిబ్బంది, త్వరలోనే ఛానల్ యొక్క ప్రసారాలు అన్ని డిటిహెచ్ లలో వస్తాయని రెండు నెలలుగా అభిమానులను ఊరిస్తున్నారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా ఇంతకాలం ఆలస్యమైందని సర్ది చెబుతున్నారు.

అలాగే వీడియో క్వాలిటీ విషయంలో కూడా ఛానల్ కు కొంత సమస్య ఉంది. ఈ ఛానల్ యొక్క శాటిలైట్ లింక్ నోయిడా కు వెళ్లి నోయిడా నుండి రీ-కాస్ట్ అవ్వాల్సి రావడంతో క్వాలిటీ లోపిస్తోందని యాజమాన్యం అంగీకరిస్తున్నారు. అయితే ఈ టెక్నికల్ ప్రాబ్లం పరిష్కరించడానికి ఇదివరకే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అని, త్వరలోనే ఈ పరిష్కారం అవుతుందని వివరణ ఇస్తున్నారు.

అలాగే, అన్ని ఆపరేటర్లలో ప్రసారాలు త్వరలో వస్తాయని అభిమానులకి సర్ది చెబుతున్నారు

మొత్తం మీద:

మొత్తం మీద ఈ ఛానల్ విషయంలో ఇప్పటికీ అభిమానులకయితే కాస్తంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. గట్టిగా మాట్లాడితే, ఇప్పటికీ ఈ ఛానల్ ని టీవీ లో చూసే వారి కంటే యూట్యూబ్ లో చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అదేవిధంగా చానల్ అధినేత తోట చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడు. పైగా పార్టీలో అత్యంత కీలకమైన పదవి లో ఆయన ఉన్నారు. మాజీ ఐఏఎస్ కూడా అయిన ఆయనకు, ఎన్నికలలోపు ఛానల్ ని ప్రజలందరిలో కి తీసుకెళ్ల లేకపోతే అది ఆయన సొంత వైఫల్యంగా అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు పార్టీ అభిమానులు కానీ భావించే అవకాశం ఉందని ఆయనకు తెలిసే ఉంటుంది. మరి ఇప్పటికైనా ఈ చానల్ ను మరింత దూకుడుగా జనాల్లోకి తీసుకెళ్లే విషయంలో ఆయన ఎంతవరకు సఫలీకృతం అవుతాడనేది వేచిచూడాల్సి ఉంది

– జురాన్ (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close