ప్రొ.నాగేశ్వర్ : మూడు రాష్ట్రాల ప్రీ పోల్ సర్వేలు ఏం చెబుతున్నాయి..?

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మామూలుగా..నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉంది. అందులో మిజోరం చిన్న రాష్ట్రం. మిగతా మూడు రాష్ట్రాల్లో రాజకీయ ఫలితాలు… జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయి. అక్కడ కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ తలపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే… ఓ సర్వే బయటకు వచ్చింది. అందులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్న అంచనాలు వచ్చాయి.

మూడు రాష్ట్రాల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందా..?

వాస్తవంగా.. ఈ సర్వేలు చెప్పినదేమిటంటే… అవుట్‌రైట్‌గా రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. మీరు గుర్తించే ఉంటారు.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు … గంట ముందు.. రాజస్థాన్ లో బీజేపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించింది. మోడీ అక్కడ ప్రచారంలో ఉన్నారు కాబట్టి.. ఈ ప్రకటన చేయడానికి వెసులుబాటుగా.. ఈసీ తన మీడియా సమావేశాన్ని కూడా వాయిదా వేసుకుంది. ఇంత చేసినా.. అక్కడ బీజేపీ గెలవడానికి అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి. కానీ మధ్యప్రదేశ్‌, చత్తీస్ గఢ్‌లలో … కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతూనే… చిన్న స్వింగ్ అటూ ఇటూ అయినా.. ఫలితాల్లో తేడా వస్తుంది. అందుకే ఆయా రాష్ట్రాల్లో బీఎస్పీ లాంటి పార్టీలతో పొత్తు కీలకం. ఓవరాల్‌గా చూస్తే.. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉందనేది అంచనా వేయవచ్చు. మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో బీజేపీ ప్రభుత్వాలు పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్నాయి. అలాగే ఐదేళ్లే అధికారంలో ఉన్నప్పటికీ… రాజస్థాన్ ప్రభుత్వం కూడా తీవ్రమైన అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా… కూడా.. ఈ వ్యతిరేక పవనాలు ఉన్నాయి. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో… 27 పార్లమెంట్ స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే.. బీజేపీ కేవలం ఐదింటిలోనే గెలిచించింది. 22 స్థానాల్లో ఓడిపోయింది. వీటిలో అత్యధికం సిట్టింగ్ సీట్లు.

ఎంపీ, చత్తీస్‌ఘడ్‌లలో బీఎస్పీ ఫలితాల్ని తారుమారు చేస్తుందా..?

రాజస్థాన్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఆ స్థానంలో జరిగిన ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. బీజేపీని సానుభూతి కూడా ఆదుకోలేదు. విచిత్రం ఏమిటంటే.. ఎమ్మెల్యేలు ఇలా చనిపోవడానికి.. అసెంబ్లీలో దయ్యం ఉందన్న కారణాన్ని కొందరు లేవనెత్తారు. దీనిపై… గంట సేపు అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. రాజస్థాన్ శాసనసభా వ్యవహారాల మంత్రి కూడా.. దెయ్యం ఉన్న మాట నిజమే.. కాబట్టి… చర్చ చేపట్టాలన్నారు. అసెంబ్లీ భవనం కట్టే ముందు.. అక్కడ స్మశానం ఉందని.. అందుకే కచ్చితంగా దెయ్యం ఉందని కొంత మంది వాదించారు. ఈ దెయ్యం ఉందాలేదా అన్నది పక్కన పెడితే.. ఈ మూడు రాష్ట్రాల్లో… అధికార వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అయితే మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్‌లలో బీఎస్పీ తీసుకున్న వైఖరి వల్ల… బీజేపీ బయటపడుతుందా అన్నది ఒక అనుమానం. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే.. 2019 ఎన్నికల్లో ప్రభావం ఎలా ఉంటుంది..?

ముఖాముఖి పోరులో కాంగ్రెస్ పైచేయి సాధిస్తుందా..?

ఈ మూడు రాష్ట్రాల్లో ఏమి జరిగితే… 2019 ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని ఎవరూ చెప్పలేరు. ఎందుకు అంటే… మన దేశ రాజకీయాల్లో ఒక రకమైన పొలిటికల్ ట్రెండ్ లేదు. భారతదేశంలో.. జాతీయ మ్యాండేట్ అంటే.. అనేక రాష్ట్రాల ప్రజల తీర్పుల కలయికే… మూడ్ ఆఫ్ ది నేషన్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. ఏపీలో కాంగ్రెస్‌ లేదు. తమిళనాడులో కాంగ్రెస్, బీజేపీ రెండూ లేవు…అలా ఒక రాష్ట్రానికి..మరో రాష్ట్రానికి ఎలాంటి పోలిక లేదు. అందువల్ల… మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే.. దేశం మొత్తం కాంగ్రెస్ హవా ఉంటుందని చెప్పడం కరెక్ట్ కాదు. అయితే.. ఈ మూడు రాష్ట్రాల ప్రత్యేకత ఏమిటంటే… బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ పడటం. జాతీయ స్థాయిలో మిత్రులతో కలిసి బీజేపీ అయినా అధికారంలోకి.. లేదా.. మిత్రులతో కలిసి కాంగ్రెస్ అయినా అధికారంలోకి రావాలి. అలాంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు ముఖాముఖి తలపడుతున్న ఎన్నికలు ఇవి. అంతే కాదు… బీజేపీ గత ఎన్నికల్లో మ్యాగ్జిమం సీట్లు వచ్చిన హిందీ బెల్ట్ రాష్ట్రాలు ఇవి.

కాంగ్రెస్ గెలిస్తే పాజిటివ్ వేవ్ వస్తుందా..?

భారతీయ జనతా పార్టీ అనుకూల చానల్ వెల్లడించిన సర్వేలో… రాజస్థాన్ లో బీజేపీ నాలుగు సీట్లు, మధ్యప్రదేశ్ లో ఏడు సీట్లు … యూపీలో నలబై, యాభై సీట్లు కోల్పోతుందని చెబుతోంది. అంటే.. దేశవ్యాప్తంగా మోడీ గ్రాఫ్… తగ్గుతున్న సమయంలో.. కాంగ్రెస్‌తో స్ట్రెయిట్ ఫైట్ జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు కచ్చితంగా బీజేపీ భవిష్యత్‌ను ప్రభావితం చేస్తాయి. మోడీ సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. అంటే.. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయాలపై కచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీకి కచ్చితంగా పాజిటివ్ వేవ్ వస్తుంది. ఇప్పటి వరకు దగ్గరగా దూరంగా ఉంటున్న పార్టీలు దగ్గరవుతాయి. కాంగ్రెస్ నాయకత్వాన్ని సమర్థిస్తూ.. కూటమిలో చేరే అవకాశం ఉంది. అయితే.. ఈ మూడు రాష్ట్రాల్లో వచ్చే ఫలితాలు.. 2019లో రిపీట్ అవుతాయని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close