కాంగ్రెస్‌కు ట్రబుల్ షూటర్లే లేరా..? కూటముల్ని డీల్ చేసే పద్దతి ఇదేనా..?

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. ఇప్పుడు గాలి ఎటు వెళ్తే అటు వెళ్లే పరిస్థితిలో ఉంది. అధికార పార్టీలపై ప్రజలు విసుగెత్తి.. మళ్లీ కాంగ్రెస్‌కు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నా.. అందుకోలేక ఆ పార్టీ కిందా మీదా పడే పరిస్థితికి వచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన అవకాశాలు ఉన్నాయని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాంటి సమయంలో… వాటిని మరింత మెరుగు పర్చుకుని విజయాలుగా మార్చుకోవడానికి… పక్కా వ్యూహాలు అమలు చేసుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది..? ఒక్కొక్క ప్లస్ పాయింట్‌ను దూరం చేసుకుని మొత్తానికే మైనస్ చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ… ఈ విషయంలో చేస్తున్న అతి పెద్ద తప్పు.. కలసి వచ్చే పార్టీల్ని కలుపుకుని వెళ్లలేకపోవడం.

ఉత్తరప్రదేశ్‌లో కూటమి ద్వారా.. సాధించిన విజయాలు.. మిరుమిట్లు గొలుపుతున్నాయి. అయినా మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్ దగ్గరకు వచ్చే సరికి పొత్తుల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది. మూడు రాష్ట్రాల్లో నాలుగైదు శాతం.. బలమైన దళిత ఓటు బ్యాంక్ ఉన్న మాయవతి పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా… ఆమెతో వ్యవహారాలను డీల్ చేసే విధానం చేయకుండా.. అహంకారంతో వ్యవహరంచడంతో… ఆమె తన దారి తాను చూసుకుంది. ఇప్పుడు బీఎస్పీ వల్లే… మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్‌లలో… కాంగ్రెస్ విజయావకాశాలు డైలమాలో పడ్డాయన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మాయవతి వద్దకు కాళ్ల బేరానికి వెళ్లినా.. ఆమె గతంలో… డిమాండ్ చేసిన సీట్ల కంటే ఎక్కువ డిమాండ్ చేస్తుంది. ఇక సమాజ్ వాదీ పార్టీ కూడా..మాయావతి బాటలోనే ఉంది. ఇలాంటి మిత్రులందరూ.. విడివిడిగా పోటీ చేయడం వల్ల.. అంతిమంగా.. బీజేపీకి లాభం చేకూరుతుంది. కానీ కలసి పోటీ చేయడం వల్ల… ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగైదు సీట్లలో పోటీ చేసే అవకాశం కోల్పోతుందేమో కానీ.. విజయాలతో దేశవ్యాప్తంగా వచ్చే ఇమేజ్ వేరుగా ఉంటుంది. పైగా… ఒక్క మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్‌లలో మాత్రమే కాదు.. 2019లో మాయావతి, అఖిలేష్‌ల మద్దతు… కాంగ్రెస్ పార్టీకి అత్యవసరం.

ఇక తెలంగాణలోనూ అదే పరిస్థితి. కాంగ్రెస్‌తో కలిసి పోరాడాలని… అన్ని పార్టీల దగ్గరకు వెళ్లి బతిమాలిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తీరా ఇప్పుడు సీట్ల విషయంలో ఆయా పార్టీలను పురుగులు చూసినట్లు చూస్తున్నారు. రాహుల్‌కు ఏం నివేదికలిస్తున్నారో.. ఆయనేం చెబుతున్నారో కానీ… మొదట్లో మిత్రపక్షాలకు 29 సీట్లు ఇస్తామని… తాము 90 సీట్లలో పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు వంద సీట్లలో పోటీ చేస్తామని.. 19 సీట్లు మిత్రపక్షాలకు ఇస్తామని చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డినే అందరి దగ్గరకు వెళ్లి కూటమి కట్టి.. ఇప్పుడు ఇలా మాట్లాడుతూంటే.. ఎవరికైనా మండిపోకుండా ఉంటుందా..? కోదండరాంకు ఇప్పుడు అలాగే ఉంది.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి పొత్తులను పెట్టుకున్నా.. సీట్ల విషయంలో కాస్త లిబరల్‌గా ఉండాలి. ఎందుకంటే.. ఆయాపార్టీల మద్దతు రేపు.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు అవసరం అవుతుంది. ఇది తెలిసి కూడా… కాంగ్రెస్ సీనియర్ నేతలు పట్టించుకోవడం లేదు. కూటముల్లో చిచ్చు ఏర్పడుతున్నా.. ఏ ఒక్క కాంగ్రెస్ నేతా బాధ్యతా తీసుకోవడం లేదు. ఫలితంగా.. కాంగ్రెస్ పార్టీ… చేతిలోకి వచ్చిన దాన్ని నేల పాలు చేసుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close