పాలమూరు రివ్యూ : కల్వకుర్తిలో టీఆర్ఎస్‌ ది ఎదురీతేనా..?

తెలంగాణ రాష్ట్ర సమితిలో.. అసంతృప్తులు వెనక్కి తగ్గడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. లేకపోతే.. టీఆర్ఎస్‌లోనే ఉండి అలజడి రేపుతున్నారు. టీఆర్‌ఎస్‌ అసంతృప్తులు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తగ్గినట్లే తగ్గి… అనుచరుల ఒత్తిడితో మళ్లీ నిర్ణయాలు మార్చుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలోనూ పరిస్థితి అంతే ఉంది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ప్రచారానికి కూడా రానని చెబుతున్నారు. దీంతో ఆదివారం కేటీఆర్ నిర్వహించాల్సిన సభ కూడా వాయిదా పడింది. అనుచరుల ఒత్తిడితో రానున్న ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగానైనా బరిలో నిలవాలని కసిరెడ్డి నిర్ణయించుకున్నారు. అందుకే టీఆర్ఎస్ తెగదెంపులు చేసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

కల్వకుర్తి అంశం ఎంతకూ ఓ కొలిక్కి రావడం లేదు. కల్వకుర్తిలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు టీఆర్‌ఎస్‌ అధిష్టానం టికెట్‌ ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంతో ఇంతకాలం ఆశగా ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో పలుమార్లు మంత్రి కేటీఆర్‌ పలుమార్లు చర్చలు జరిపినా ఆయన వెనక్కితగ్గలేదు. ఎన్నికల బరిలో ఖచ్చితంగా నిలవాల్సిందేనని కసిరెడ్డి అనుచరవర్గం పట్టుబడుతోంది. ప్రతీ మండలంలో కసిరెడ్డి అనుచరులు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ బరిలో నిలవాల్సిందేనంటూ తీర్మానాలు చేస్తున్నారు. దీంతో ఆయన కేటీఆర్, కేసీఆర్ ఆదేశాలను పట్టించుకోకూడదని డిసైడయ్యారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ కు పట్టు ఉంది. నల్లగొండ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన నేతలు ఈ జిల్లాలోనే ఉన్నారు. అందుకే టీఆర్ఎస్ ఈ జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అత్యధిక స్థానాలు గెలుపొందేందుకు ప్లాన్లు వేసుకుంటోంది. అందుకు అనుగుణంగా కేడర్‌లో జోష్‌ తగ్గకుండా ఉండేందుకు ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రతీ వారం పార్టీ ముఖ్యనేతలతో ఎక్కడో ఓ చోట సభలు ఉండేలా ప్రణాళిక తయారు చేశారు. అందులో భాగంగా ఇప్పటికే నాగర్‌కర్నూల్‌లో మంత్రి కేటీఆర్‌ సభ నిర్వహించగా… తర్వాత వారం స్వయంగా సీఎం కేసీఆర్‌ వనపర్తిలో ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఇక ప్రణాళిక ప్రకారం ఈ వారం ఉమ్మడి జిల్లా పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండలో సభ జరగాల్సి ఉండగా కసిరెడ్డి వ్యవహారం కారణంగా రద్దు చేశారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించారో.. టీఆర్ఎస్ నేతలకు అర్థం కావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close