టీవీ 9లో జనసేన కవాతులు ఎందుకు కనిపించడం లేదు..? ఆరెస్సెస్ ఏం చేసింది..?

జనసేన కార్యక్రమాలు .. ప్రముఖ టీవీ చానల్ టీవీ 9లో ప్రసారం కావడం లేదు. రోజువారీ ప్రజాపోరాటయాత్రల విషయంలోనే.. సోమవారం నిర్వహించిన మెగా కవాతు విషయంలోనూ… టీవీ 9 పూర్తిగా.. జనసేనకు దూరం పాటించింది. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే.. గతంలో టీవీ 9 సీఈవో రవి ప్రకాష్ పై వ్యక్తిగత విమర్శలు చేసి.. ట్విట్టర్ లో కుటుంబానికి చెందిన వ్యక్తిగత ఫోటోలు పెట్టి బెదిరింపు ధోరణిలో మాట్లాడిన తర్వాత కూడా .. జనసేన కార్యక్రమాలకు టీవీ 9లో కవరేజీ వచ్చింది. కానీ … రాజమండ్రి కవాతు విషయంలో మాత్రం పూర్తిగా దూరం పాటించారు. కనీసం.. సమాచారం కూడా ఇవ్వలేదు. అదే దూరాన్ని కంటిన్యూ చేస్తున్నారు. జనసేన కార్యక్రమాల విషయంలో టీవీ 9 పూర్తిగా నిషేధాజ్ఞలు విధించుకోవడం వెనుక ఏం జరిగిందన్న చర్చ అటు రాజకీయ .. ఇటు మీడియా సర్కిల్స్ లోనూ నడుస్తోంది. నిజానికి జనసేన విషయంలో టీవీ 9కి ప్రత్యేకమైన రాజకీయ ఎజెండా లేదు. ఇవ్వాలని కానీ.. వద్దు అని కానీ.. ఏమీ నియమాలు పెట్టుకోలేదు. దానికి తగ్గట్లుగానే… ధవళేశ్వరం కవాతును… కవర్ చేయడానికి టీవీ 9 ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంది. పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని దాదాపుగా అర గంట సేపు లైవ్ గా ఇవ్వాలని అంతర్గతంగా సూచనలు కూడా డెస్క్ కు వెళ్లాయట.

కానీ.. పవన్ కల్యాణ్…తన కవాతు సభ మొత్తాన్ని టీవీ నైన్ లో నిరంతరాయంగా చూపించడానికి… సీఈవోపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారట. తనతో టచ్ లో ఉన్న ఆరెస్సెస్ పెద్దల ద్వారా… టీవీ 9 సీఈవోపై ఒత్తిడి తెచ్చారని సమాచారం. కొద్ది రోజుల క్రితం.. అమిత్ షా సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమానికి వచ్చినప్పుడు… అప్పటి టీవీ నైన్ యజమానిని ప్రత్యేకంగా కలిశారు. ఆ సమయంలోనే కాదు.. సహజంగానే అధికారంలో ఉన్న పార్టీకి సిద్ధాంతకర్తగా ఆరెస్సెస్ … మీడియాలో కొన్ని వర్గాలపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆ కోణంలోనే… పవన్ కల్యాణ్… టీవీ 9 సీఈవోపై ఒత్తిడి తెచ్చారని.. తన ప్రోగ్రాం.. మొత్తం కవరేజీ ఇవ్వాల్ననట్లుగా… ఆదేశాల్లాంటి సూచనలు రావడంతో… టీవీ 9 సీఈవో.. మొత్తానికే… అసలు వద్దని చెప్పేశారని… ప్రచారం జరుగుతోంది.

పవన్ కల్యాణ్ కు సలహాలిచ్చే వ్యక్తుల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని.. పవన్ ని ఎవరు నమ్ముతారో.. వారే.. సినిమా ప్రోగ్రామ్స్ మాదిరి మీడియా కవరేజీ ఉండేలా నిర్దేశిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినిమాలకు డబ్బులిచ్చి పబ్లిసిటీ చేసుకోవచ్చు కానీ.. రాజకీయ కార్యక్రమాలకు మీడియా ఇచ్చే కవరేజీనే మైలేజీ తీసుకొస్తోంది. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్.. గుర్తించలేకపోతున్నారు. నిజానికి టీవీ నైన్ సీఈవోతో పవన్ నేరుగా మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమయ్యేది. కానీ ఈగో సమస్య వల్ల మధ్యలో ఆరెస్సెస్ జోక్యం కోరడంతో.. పరిస్థితి మారిపోయింది. రాజకీయ కారణాలతో ప్రసారాలు నిలిపి వేస్తే.. ఏమీ చేయలేరు కానీ.. ఇలా కమ్యూనికేషన్ గ్యాప్ తో మీడియా సంస్థలతో గొడవలు పడితే.. అది జనసేనకే మైనస్ అనేది చాలా మంది రాజకీయ నేతల అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close