‘సైరా’ గురించి జ‌గ‌ప‌తిబాబు కామెంట్స్‌

విల‌న్ పాత్ర‌ల‌తో ఓ ఊపు ఊపేస్తున్నాడు జ‌గ‌ప‌తిబాబు. తాజాగా ‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌’లో మ‌రోసారి త‌న న‌ట విన్యాసం చూపించాడు. క‌ళ్ల‌లో క్రూర‌త్వాన్ని ప‌లికించి – బ‌సి రెడ్డి పాత్ర‌ని నిల‌బెట్టాడు. జ‌గ్గూభాయ్ దృష్టి ఇప్పుడు మిగిలిన భాషా చిత్రాల‌పై ప‌డింది. త‌మిళ, క‌న్న‌డ చిత్రాలు కొన్ని ఒప్పుకున్న జ‌గ్గూ… బాలీవుడ్‌లోనూ ఓ సినిమా చేస్తున్నాడు. తెలుగులో త‌న చేతిలో ఉన్న సినిమాల్లో `సైరా` ముఖ్య‌మైన‌ది. ఈ సినిమా గురించి తొలిసారి పెద‌వి విప్పాడు జ‌గ‌ప‌తిబాబు.

”ఇప్ప‌టి వ‌ర‌కూ నేను చేసిన పాత్ర‌ల్లో `సైరా` విభిన్న‌మైన‌ది. నా గెట‌ప్ కూడా ఊహించ‌ని విధంగా ఉంటుంది. ఈ పాత్ర‌ ఓ రకంగా నాకు ఛాలెంజ్‌. ఈ పాత్ర ఏమిట‌న్న‌ది ఇప్పుడే చెప్ప‌ను. దానికి చాలా స‌మ‌యం ఉంది. రామ్ చ‌ర‌ణ్ ఓ క‌థానాయ‌కుడిగా ఉంటూనే, నిర్మాణ బాధ్య‌త‌ల్ని నెత్తిమీద పెట్టుకున్నాడు. త‌న త‌ప‌న చూస్తే ఆనందంగా ఉంది” అంటూ చ‌ర‌ణ్‌కి కూడా కితాబిచ్చాడు జ‌గ్గూభాయ్‌. నిజానికి ‘ఖైది నెం.150’లో జ‌గ‌ప‌తిబాబు న‌టించాల్సింది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ పాత్ర కోసం మ‌రొక‌ర్ని తీసుకున్నారు. ఈసారి మాత్రం జ‌గ్గూ ఈ ఛాన్స్ అందిపుచ్చుకున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close