ప్రొ.నాగేశ్వర్ : దేశాన్ని రిలయన్స్ కమ్మేస్తోందా..?

భారత ఆర్థిక వ్యవస్థపై రిలయన్స్ కంపెనీకి ఉన్న గ్రిప్‌ అందరికీ తెలిసిందే. ఇప్పుడు దేశ రక్షణ వ్యవహారాల్ని శాసించేలా.. రాఫెల్ డీల్‌లోకి కూడా ప్రవేశించింది. దేశంలోని సహజ వనరులపైనా ఆయిల్, గ్యాస్ ద్వారా రిలయన్స్ దే ఆధిపత్యం. కమ్యూనికేషన్స్ పైనా.. రిలయన్స్ దే ఆధిపత్యం. నెట్ వర్క్ 18 ద్వారా మీడియా కూడా.. రిలయన్స్ చేతుల్లోనే ఉంది. అనేక చానళ్లను నడిపిస్తోంది. వెబ్ సైట్లు కూడా.. లీడింగ్ వెబ్ సైట్లను నడుపుతోంది. ఈ మీడియానే కాకుండా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో కూడా… రిలయన్స్ ఓ మేజర్ ప్లేయర్. ఇక న్యూస్ అండ్ ఎంటర్ టెయిన్ మెంట్ రంగంలో… డిస్ట్రిబ్యూషన్ చాలా ఇంపార్టమెంట్. ఓ ఉత్పత్తిని ఇళ్లలోకి తీసుకెళ్లాలంటే.. ఇవి చాలా ముఖ్యం. మన దేశంలో కేబుల్ టీవీ ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుందో మనకు తెలుసు. ఇప్పుడు ఈ కేబుల్ రంగంలోకి కూడా.. రిలయన్స్ వచ్చింది.

కేబుల్ టీవీ రంగంలోనూ అడుగు పెట్టిన రిలయన్స్..!

ఇప్పుడు ఈ కేబుల్ రంగంలోకి కూడా.. రిలయన్స్ వచ్చి చేరింది. కేబుల్‌ టీవీ, బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు అయిన డెన్‌ నెట్‌వర్క్స్‌, హాత్‌వే కేబుల్‌, డేటాకామ్‌ సంస్థల్లో వాటాలను తీసుకునేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేసింది. హాత్‌వేలో 51.3 శాతం వాటా , డెన్‌ నెట్‌వర్క్స్‌లో 66 శాతం వాటాను కొనుగోలు చేసింంగి, హాత్‌వే, డెన్‌ నెట్‌వర్స్క్ 1,100 నగరాల్లో 5 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్నారు. తాజా డీల్‌ ద్వారా ప్రత్యక్షంగా 20 మిలియన్ల కేబుల్ చందాదారులు రియలన్స్‌ అధీనంలోకి రానున్నారు. అంతేకాదు కేబుల్ మార్కెట్లో 25 శాతం వాటాను రిలయన్స్‌ సొంతం అవుతుంది. హాత్ వే మన దగ్గర కూడా ఉంది. ఇవి ఓల్డెస్ట్ కేబుల్ నెట్ వర్క్ కంపెనీలు. సిటీ కేబుల్ ను దాటి కూడా… మార్కెట్లో ఎక్కువ వాటా రిలయన్స్ చేతుల్లోకి వచ్చింది. అంటే… న్యూస్.. రిలయన్సే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎంటర్‌టెయిన్మెంట్ రిలయన్సే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పటికే నెట్ వర్క్ 18, వయాకాం18తో … అనేక ఎంటర్ టెయిన్ మెంట్ చానల్స్… రిలయన్స్ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు కేబుల్ వ్యవస్థను గ్రిప్ లోకి తీసుకోవడం వల్ల… ప్రజల మనసుల్ని, కల్చర్‌ను కూడా డామినేట్ చేసే పరిస్థితి వచ్చింది.

ఇక రిలయన్స్ చెప్పిందే నమ్మాలా..?

ఎప్పుడైతే.. కేబుల్ ఇండస్ట్రీ రిలయన్స్ చేతుల్లోకి వచ్చిందో.. కంటెంట్ ప్రొడక్షన్, కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ రెండూ కలవడం ద్వారా… మ్యాగ్జియం మీడియా పవర్ మొత్తం రిలయన్స్ చేతుల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ఫలితంగా ఎం జరుగుతుంది..? . రాఫెల్ పై ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతోంది. స్కాం గురించి రోజుకో విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు… ఉన్నట్లు.. రిలయన్స్ గుత్తాధిపత్యం.. మీడియా, కేబుల్ రంగాలపై ఉంటే.. రాఫెల్ లో స్కాం లేదు.. అది అద్భుతమైన ఒప్పందం అని రిలయన్స్ మీడియా చెప్పదల్చుకుంటే.. అదే వేదం అయిపోతుంది. ప్రపంచం అంతా నమ్మేలాంటి పరిస్థితి వస్తుంది. అమెరికాలోనూ.. ఈ చానళ్లు లభ్యమవుతున్నాయి. అంటే ప్రవాస భారతీయులను కూడా ప్రభావితం చేసే దశకు రిలయన్స్ చేరుకుంది.

రిలయన్స్‌కు దేశం మోకరిల్లాల్సిన పరిస్థితి వస్తోందా..?

దీనికి తోడు.. ఇప్పుడు జియో మేజర్ ప్లేయర్ గా ఉన్నారు. ఏ పోటీ దారు కూడా ఇవ్వలేని ధరకు సేవలు అందిస్తూ…. మార్కెట్లోకి చొచ్చుకు వచ్చింది. విద్యారంగంలోకి జియో వచ్చేసింది. అసలు యూనివర్శిటీ కట్టక ముందే.. అదో నాణ్యమైన యూనివర్శిటీ కేటగిరిని కేంద్రం ఇచ్చేసింది. అంటే.. మీడియా, టెలికమ్యూనికేషన్, విద్య రంగంలో రిలయన్స్ పట్టు సాధిస్తోంది. ముఖేష్ అంబాని కనెక్టింగ్.. ఎవ్రీవన్.. ఎవ్రీవేర్..ఎవ్రీధింగ్ అని చెబుతూంటారు. అంటే.. ఎవ్రీవన్.. ఎవ్రీవేర్..ఎవ్రీధింగ్ రిలయన్స్ కు మోకరిల్లాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ప్రతి రంగంలోనూ… ప్రభావం చూపుతున్న రంగానికి ముకేష్ అంబాని పట్టు సాధించారు. టెలికాం రంగంలో చూశాం.. పోటీ దారుల్ని జియో ఎలా తరిమికొట్టగలిగిందో. అలా విధంగా కేబుల్ టీవీ రంగంలో కూడా చేయబోతోంది.

మన ఆలోచనల్ని సైతం ప్రభావితం చేయబోతోందా..?

గతంలో కొన్ని ప్రత్యేకమైన వెబ్ సైట్లకు… యూట్యూబ్ చానల్స్ కు ఉచితంగా నెట్ అందించేపేరుతో… కొన్ని ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ… దీన్ని అదృష్టవశాత్తూ అడ్డుకోగలిగారు. నెట్ న్యూట్రాలిటీ పేరుతో పెద్ద ఎత్తున నెటిజన్లు చైతన్యాన్ని ప్రదర్శించారు. అయితే… ఇలాంటి ప్రయత్నాలు చేయరా అంటే… చేయరని కాదు కచ్చితంగా చేస్తారు. ఇప్పటికే.. మనిషి ఆలోచనల్లో ప్రభావితం చేసే ప్రతి రంగంలోనూ రిలయన్స్ పట్టు పెంచుకుంటోంది. అంటే మనకు తెలియకుడానే.. మన ఆలోచనలను ప్రభావితం చేస్తూ పోతోందన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close