ఆదిలాబాద్ రివ్యూ : కూటమిలో చిక్కుముళ్లు..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీట్ల లెక్కలు ఎప్పటికీ తేలడం లేదు. పొత్తులతో నిమిత్తం లేకుండానే కాంగ్రెస్‌ ఏకపక్షంగా సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంపై గుర్రుగా ఉన్న తెలంగాణ జన సమితి ఆ పార్టీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలోని బెల్లంపల్లి ఎస్సీ రిజర్వుడ్‌స్థానంతోపాటు మంచిర్యాల జనరల్‌స్థానాన్ని తమకు కేటాయించాలని ఇప్పటికే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జనరల్‌ స్థానంతో పాటు ముథోల్‌ లేదంటే ఏజెన్సీలోని ఒక స్థానాన్ని తమ పార్టీకి వదిలిపెట్టాలని కోదండరాం కాంగ్రెస్‌ అగ్రనేతలను కోరారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు తెరాస అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఖరారు ఉత్కంఠ రేపుతోంది. రాహుల్‌గాంధీ పర్యటన కంటే ముందే దసరా నాటికీ అభ్యర్థుల జాబితా ఖరారు చేస్తామన్న కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇప్పటికీ ఒక్క స్థానాన్ని కూడా ప్రకటించలేదు. టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న నేతలు ఎవరికి వారే పార్టీ గుర్తులతో ప్రచారం సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు ఎస్టీ నియోజకవర్గాలకు గాను ఓటర్ల బలాలను పరిగణనలోకి తీసుకుని ఆయా తెగలకు టికెట్లు ఇచ్చేలా అధిష్ఠానం ఫార్ములా రూపొందించుకుంది. ఇందులో లంబాడ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న ఖానాపూర్‌స్థానాన్ని లంబాడ తెగ అభ్యర్థికి, ఆసిఫాబాద్‌, బోథ్‌నియోజకవర్గాల్లో ఆదివాసీ గిరిజన అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్‌కు పెద్ద సమస్యగా మారిన గిరిజన వర్గవివాదం టికెట్ల ఖరారులో సమన్యాయంతో సద్దుమణిగిందని నేతలు భావిస్తున్నారు.

తండ్రిచాటు తనయులుగా రాజకీయాలు నెరపిన గడ్డం బ్రదర్స్‌ పరిస్థితి ఈ ఎన్నికల్లో అయోమయంగా మారింది. బెల్లంపల్లి లేదంటే చెన్నూరు టికెట్‌ను ఆశించిన మాజీ మంత్రి వినోద్‌కు టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. తమ్ముడు వివేక్‌తో ఎడమొహంగా ఉన్న వినోద్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్థం చేసుకోగా దిల్లీ పెద్దలు మాత్రం పార్టీలోకి రావాలనుకుంటే వెంట వివేక్‌ను తీసుకరావాలని సూచించినట్లు తెలిసింది. ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉంటే ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు తప్పుడు సంకేతాలు వెళతాయని.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు వస్తే టికెట్లపై చర్చిస్తామని తేల్చిచెప్పినట్లు సమాచారం. బెల్లంపల్లి, చెన్నూరులో ఏదో ఒకటి వినోద్‌కు పెద్దపల్లి ఎంపీ స్థానం వివేక్‌కు టికెట్లపై పునరాలోచిస్తామని చెప్పడం గమనార్హం. కాంగ్రెస్‌ఎస్సీ సెల్‌జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజుతో వినోద్‌మంతనాలు సాగిస్తుండగా వివేక్‌మాత్రం టీఆర్ఎస్‌లోనే ఉండాలనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close