కేసీఆర్ కంటి పరీక్షలను అమిత్ షా సమక్షంలో చేయించుకున్నారా..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. మూడో కంటికి తెలియకుండా.. ఢిల్లీ వెళ్లారు. అలాగే తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఏం చేశారనేదానిపై… అనేక అనేక ఉహాగానాలు వస్తున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. కేసీఆర్.. తీరిక లేకుండా బహిరంగసభల్లో పాల్గొనబోతున్నారు కాబట్టి… పన్ను, కన్ను.. రెండూ సరిగ్గా ఉన్నాయో లేదో.. చెక్ చేసుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. దాని కోసం.. ఢిల్లీ వరకూ ఎందుకు… తెలంగాణలో కంటి వెలుగు ప్రోగ్రాం జరుగుతోంది కదా.. అన్న విమర్శలు చాలా వస్తున్నాయి. ఆ విమర్శలతో పాటు… అసలు ఢిల్లీ టూర్ వెనుక ఉన్న అజెండా ఏమిటన్నది కూడా.. బయటకు వస్తోంది.

కేసీఆర్ బీజేపీ పెద్దలతో ఢిల్లీలో మంతనాలు జరిపారన్నది ప్రధానమైన ఆరోపణ. నిజానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం హైదరాబాద్‌కు వచ్చారు. బీజేపీకి చెందిన యువమోర్చా కార్యక్రమంలో ప్రసంగించారు. ఆయన వచ్చిన ప్రత్యేక విమానం బేగంపేట విమానాశ్రయంలో ఉంది. ఆయన తిరిగి వచ్చే టప్పటికీ.. ఢిల్లీకి వెళ్లే పని మీద.. కేసీఆర్ కూడా… బేగంపేటకు వచ్చారు. అక్కడ ఇరువురి మధ్య గంటన్నర సేపు చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఎన్నికలపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగిందని చెబుతున్నారు. సిట్టింగ్ సీట్లకు భరోసా ఇచ్చిన కేసీఆర్ ను..మరో నాలుగైదు .. బీజేపీకి బలమున్న స్థానాల్లో…సహకరించాలని అమిత్ షా కోరినట్లు సమాచారం. ఇది కాకుండా.. రాజకీయ వ్యూహారాలపైనా.. వారి మధ్య చర్చ జరిగింది.

ఓ పార్టీ అధ్యక్షుడ్ని కలవడానికి.. ప్రత్యేకంగా బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లాడన్నపేరు ఎందుకన్న ఉద్దేశంతో… ఆరోగ్య పరీక్షల కోసం ఢిల్లీకి వెళ్తున్నట్లు బయలుదేరి వెళ్లారు కానీ.. కేసీఆర్.. ఇలా వెళ్లి అలా వచ్చేశారు. నిజానికి కేసీఆర్.. ఢిల్లీ ఎజెండా.. అమిత్ షాతో చర్చలు జరపడమే.. అదికూడా బెంగపేట ఎయిర్ పోర్టులో. కానీ ఎవరికీ అనుమానం రాకుండా… అలా ఢిల్లీ వరకూ వెళ్లొచ్చారనేది.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి హాట్ టాపిక్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close