ఎప్పుడూ ఆరోపణలేనా..? అప్పుడప్పుడు ఆధారాలు చూపించు పవన్..!!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఓ అలవాటు ఉంది. అదేమిటంటే.. ప్రభుత్వం తరపున ఏ పని జరిగినా.. అది అవినీతి అని అనుకుంటూ ఉంటారు. అందుకే… మూడేళ్లలో ఏపీ ప్రభుత్వ బడ్జెట్ రూ. నాలుగు లక్షల కోట్లకు అటూ ఇటుగా ఉంటే.. చంద్రబాబు రూ. నాలుగున్నర లక్షల కోట్లు.. విదేశాలకు తరలించారని.. పుస్తకాలేశారు. దాన్ని ఢిల్లీ నుంచి గల్లీ దాకా పంచారు. కోడికత్తి దాడి వల్ల ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు కానీ..లేకపోతే.. ఆయన నోటి వెంట అవినీతి పురాణం వస్తూ ఉండేది. పక్క నుంచి అంబులెన్స్ వెళ్లినా.. అందులో ఆయనకు అవినీతి కనిపిస్తుంది. ఇప్పుడు అచ్చంగా.. జనసేన అధినతే పవన్ కల్యాణ్ కూడా.. జగన్ కళ్లల్లోనుంచే చూస్తున్నట్లు ఉన్నారు.

క్వారీలు ఉంటే అది అక్రమ మైనింగేనా..?

ఊరికనే ఆరోపించడానికి మైనింగ్ అనే పదం ఒకటి దొరికింది కదా..అని పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లినా అక్రమ మైనింగ్ అంటూ చెలరేగిపోతున్నారు. చివరకి కంకర క్రషర్ కనిపించినా.. అది తెలుగుదేశంపార్టీ నేతల అక్రమ మైనింగేనని తేల్చి చెప్పి.. దాన్ని నేరుగా నారా లోకేష్‌కు ముడి పెడుతున్నారు. ఆ తర్వాత బాక్సైట్ దగ్గరకు తీసుకుపోయి.. నక్సలైట్లకు మద్దతుగా మట్లాడేస్తున్నారు. నిజంగా అది అక్రమ మైనింగ్ అని నిరూపించాలనుకుంటే పది నిమిషాల పని. మైనింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఆన్ లైన్‌లో ఉంటాయి. ఫలానా ఊరిలో ఫలానా వారు.. ఫలానా మైనింగ్ చేస్తున్నట్లు రికార్డులు ఉంటాయి. ఆ గ్రామ పంచాయతీలోనూ ఉంటాయి. అక్కడ ఎలాంటి రికార్డులు లేకపోతే.. నిరూపించడం పది నిమిషాల పని. దాని ఓనర్ ఎవరో.. ఏ పార్టీ వారో తేల్చడం అంత కన్నా ఈజీ. నిరూపించాలే అవకాశం ఉన్నా.. పవన్…ఎందుకిలా..మైనింగ్ మరక ప్రభుత్వానికి అంటించాలనుకుంటున్నారో మరి..! అసలు అక్రమ మైనింగ్ అంటే ఏమిటో.. దానికి ఆధారాలు ఎలా ఉంటాయో… గాలి జనార్ధన్ రెడ్డి ఇష్యూలో అప్పట్లో మీడియాలో వచ్చంది. ఊరికనే ఆరోపించడం వల్ల అది బయటకు రాలేదు.

ఒక్క ఆధారంతో ఓ అవినీతి ఆరోపణ చేస్తే ఆ కిక్కే వేరప్పా…!?

జనసేన అధినేత ఆవేశ పరుడు.. అని అందరూ అనుకుంటారు. అలా అనుకుంటే సరిపోదు.. ఆలోచనా పరుడు అని కూడా అనిపించుకోవాలి. అలా అనిపించుకోవాలంటే.. మాట్లాడే ప్రతి మాటా… నమ్మేలా ఉండాలి. ఓ ఆరోపణ చేశారంటే.. ప్రజల్లో నిజమే సుమీ అనుకునేలా ఉండాలి. కానీ… ఏదో గాలికి వచ్చిన ఆరోపణలు.. వాళ్లూ వీళ్లు చెప్పారని ఆరోపణలు చేస్తే. ఏం ప్రయోజం ఉంటుంది. నిజంగా.. ఒకే ఒక్క ఆధారం బయటపెట్టి… అదీ కూడా.. ఎంతో గొప్పగా పరిశోధన చేయాల్సిన అవసరం లేదు.. జగన్ కేసుల్లోలా… ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన ఏదో ఓ కంపెనీ … లోకేష్‌కు లేదా సీఎంకు.. లేదా.. కనీసం ఏదో ఓ టీడీపీ నేతకు లాభం చేకూర్చినట్లు… ఒక్క డాక్యుమెంట్ బయట పెట్టి ఆరోపణలు చేస్తే.. వచ్చే ఆ కిక్ ఎలా ఉంటుందో.. ఊహించుకుంటే బెటర్. ఆ ప్రయత్నం చేయకుండా.. ఊరికే ఆరోపణలు చేస్తే.. రివర్స్ సవాళ్లు వస్తాయి. తనపై చేసిన ఆరోపణలకు.. గతంలో లోకేష్ చాలా సార్లు సవాల్ చేశారు. ఇప్పుడు మళ్లీ చేశారు. మోదీ దత్త పుత్రుడు పవన్‌ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని లోకేష్ అంటున్నారు. అవినీతి అని గగ్గోలు పెట్టి నిరూపంచలేకపోయారని సెటైర్ వేశారు. పదవి కోసం తప్పుడు ప్రచారం మాని ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్‌చేశారు. ఫ్యాక్ట్‌ఫైండింగ్‌కమిటీ రిపోర్ట్‌పై ఎందుకు ప్రశ్నించడంలేదని ట్విట్లర్‌లో లోకేష్‌నిలదీశారు. మరి వీటికి పవన్ సమాధానం ఆరోపణలేనా..? ఆధారాలేమైనా బయటపెడతారా..?

నిర్మాణాత్మక విమర్శ ఒక్కటైనా ఉందా..?

అచ్చంగా.. జగన్మోహన్ రెడ్డిలా మాట్లాడుతూ… తను పదవిలో లేకపోవడం వల్ల ప్రజలందరూ బాధపడిపోతున్నారని… పదేపదే చెప్పుకోవడం ఎందుకు..?. ప్రజలంతా బాధల్లో ఉన్నారని.. ఏదో సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించడం ఎందుకు..? ప్రభుత్వం కూడా ఉలిక్కి పడేలా… ఒక్క విమర్శ చేస్తే… అది ప్రజల్లో.. క్రెడిబులిటీ పెంచదా..? ఉన్న పళంగా ప్రభుత్వం రియాక్ట్ కావాల్సిన సమస్యల మీద.. సూటిగా గురి పెడితే… వచ్చే పేరు వేరే ఉంటుంది కదా..!. రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి… అధికార పార్టీని ఎన్ని మాటలైనా అనొచ్చు.. సీఎం పీఠం మీద ఉన్నారు కాబట్టి.. చంద్రబాబు మీద ఎంతైనా బురద జల్లొచ్చు అనుకోవడం.. నిఖార్సైన రాజకీయం కాదు. పవన్ చెప్పే కొత్త రాజకీయం అసలు కాదు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close