ఇది ప్రాంతీయ పార్టీలు, లేదా కాంగ్రెస్ త‌ర‌ఫు ప్ర‌య‌త్నం కాదు!

ఎన్డీయే పాల‌న‌లో అన్ని రాజ్యాంగబ‌ద్ధ వ్య‌వ‌స్థ‌లూ ఒక్కోటిగా నిర్వీర్యం అవుతున్నాయ‌ని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. బెంగ‌ళూరులో ఆయ‌న క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి, మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌తో భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడారు. త‌మ భేటీలో ప్ర‌ధానంగా ఇవే అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింద‌న్నారు. ఆర్బీఐ లాంటి స్వ‌యం ప్ర‌తిప‌త్తి ఉన్న వ్య‌వ‌స్థ‌ల మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మార్చేస్తున్నార‌నీ, కేంద్రం ప్ర‌భుత్వం క‌లిగిస్తున్న ఇబ్బందుల్ని ఎదుర్కొన‌లేక‌పోతున్నామంటూ ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ స్వ‌యంగా చెప్తున్నారంటేనే ప‌రిస్థితి తీవ్ర‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు చంద్ర‌బాబు. ఈడీ, ఆదాయ ప‌న్ను శాఖ‌ల్ని త‌మ రాజ‌కీయ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా కేంద్రంలోని అధికార పార్టీ వాడుకుంటోంద‌ని ఆరోపించారు.

క‌ర్ణాట‌క‌లో ఇలాంటి ప‌రిస్థితిని చూశామ‌నీ, త‌మిళ‌నాడు, తాజాగా తెలంగాణ విష‌యంలో కేంద్రం వైఖ‌రి ఇలానే ఉంటోంద‌న్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను బెదిరించ‌డం కోస‌మే వీటిని వాడుతున్నార‌న్నారు. రెండేళ్ల కింద‌ట తీసుకున్న నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం వ‌ల్ల ఇంత‌వ‌ర‌కూ ఒరిగిందేం లేద‌నీ, ఆర్థిక వ్య‌వ‌స్థ నాశ‌నం కావ‌డం త‌ప్ప ప్రయోజ‌నం లేద‌న్నారు. ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయ‌నీ, రైతులు చాలా అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని చెప్పారు. అందుకే, ఇప్పుడు అంద‌రూ క‌లిసిక‌ట్టుగా వీట‌న్నింటినీ కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉందన్నారు చంద్ర‌బాబు. రాజ్యాంగాన్నీ, ప్ర‌జాస్వామ్యాన్నీ, దేశాన్ని కాపాడుకోవాల్సిన స‌మ‌యం ఇద‌న్నారు.

తాను దేశంలోని ప్రాంతీయ పార్టీల త‌ర‌ఫున‌, లేదా కాంగ్రెస్ త‌ర‌ఫున ఈ ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌నీ… దేశాన్ని కాపాడుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింది కాబ‌ట్టి, ఒక బాధ్య‌త‌గ‌ల నాయ‌కుడిగా స్పందిస్తున్నాన‌ని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల త‌రువాత ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థి ఎవ‌రు, రాహుల్ గాంధీకి మ‌ద్ద‌తు ఇస్తారా అనే ప్ర‌శ్న‌లు మీడియా వేస్తే.. చంద్ర‌బాబు అలా స్పందించారు. ఆ విషయం సమయం వచ్చినప్పుడు అన్ని పార్టీలూ చర్చంచి నిర్ణయం తీసుకుంటాయన్నారు. తాను మాయావ‌తి, అఖిలేష్ యాద‌వ్ తో మాట్లాడాన‌నీ, రేపు స్టాలిన్ తో భేటీ అవుతున్నాన‌నీ… ఇలా అంద‌రితోనూ తాను క‌ల‌వ‌బోతున్నాన‌ని చెప్పారు. ఆ త‌రువాత‌, త‌మ కార్యాచ‌ర‌ణ ఏంట‌నేది నెమ్మ‌దిగా తెలుస్తుంద‌న్నారు. మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానంగా… కేంద్రంలోని భాజ‌పా ఆంధ్రాను మోసం చేసింద‌నీ, అందుకే ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కి రావాల్సి వ‌చ్చింద‌న్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close