ఛీ.. ఛీ.. ఛోటా! ” బ్యాన్ ఫ్రమ్ టిఎఫ్ఐ ” ట్రెండింగ్

‘తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఛోటా కె. నాయుడును వెలి వేయండి’ అని ట్విట్ట‌ర్‌లో సోమవారం కాజల్ అగర్వాల్ అభిమానులు చిన్నపాటి ఉద్యమం లేవనెత్తారు. ఒకానొక దశలో ‘బ్యాన్ ఛోటా ఫ్రమ్ టిఎఫ్ఐ’ హ్యాష్‌ట్యాగ్ హైద‌రాబాద్‌లో ట్రెండ్‌ అయ్యింది. దీనంతటికీ కారణం ఒక్కటే… ‘కవచం’ టీజర్ లాంచ్‌లో కాజ‌ల్‌ని ఛోటా ముద్దు పెట్టుకోవడమే. కాజల్ కాస్త ఎత్తుగా వుండబట్టి బుగ్గ మీద పెట్టుకోవాలనుకున్న ముద్దు కొంచెం కిందకు వచ్చింది కానీ… లేదంటే బలంగా బుగ్గ మీద ఛోటా ముద్దు పెట్టేవారేమో! ఛోటా చర్యతో షాక్ తిన్న అభిమానులు అతడిపై ట్విట్టర్ వేదికగా యుద్ధం ప్రకటించారు. అతణ్ణి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వేలి వేయాలని ట్రెండ్ చేస్తున్నారు. హఠాత్తుగా ఛోటా ఇచ్చిన ముద్దుకు కాజల్ కూడా షాక్‌కి గుర‌య్యారు. ‘ఛాన్స్ పే డ్యాన్స్’ అంటూ సెటైర్ వేశారు. తరవాత వెంటనే తేరుకుని కవర్ చేసే ప్రయత్నం చేశారు. ‘ఛోటా తన కుటుంబంలో ఒకరు. పర్వాలేదు’ అని సర్దిచెప్పారు. అయితే ఛోటా చర్యను మాత్రం ప్రేక్షకులలో ఎక్కువశాతం మంది సమర్ధించడం లేదు. ‘ఛీ.. ఛీ.. ఛోటా. ఇవేం పనులు’ అంటున్నారు. వేదిక ఎక్కకముందు మెహ్రీన్‌తోనూ ఛోటా కె నాయుడు అసభ్యంగా ప్రవర్తించినట్టు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డైవర్ట్ ఓటు…కాంగ్రెస్ కు శాపంగా మారనుందా..?

ఎంపీ ఎన్నికల పోలింగ్ తర్వాత ఎలాంటి ఫలితాలు రానున్నాయని కాంగ్రెస్ డిస్కషన్ స్టార్ట్ చేసింది. ఏ నియోజకవర్గాల్లో ఎంతమేర పోలింగ్ నమోదైంది..? అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారా..? టఫ్ కాంపిటేషన్ ఉన్న...

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close