సీపీఎం, టీఎంసీలను ఒకే కూటమిలో చంద్రబాబు ఉంచగలరా..?

బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటితో కలిసి ఓ కూటమిని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు విస్తృతంగా శ్రమిస్తున్నారు. అన్ని ప్రాంతీయ పార్టీలే. కానీ కొన్ని పార్టీలు.. జాతీయ పార్టీల్లాంటివి. అవి బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తూంటాయి. కానీ ఒకే రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉంటున్నాయి. ఇలాంటి పార్టీలను కలపడం… టీడీపీ అధినేతకు అత్యంత సవాల్‌తో కూడిన అంశంగా మారనుంది. ఇలాంటి సవాల్ మొదటిసారిగా చంద్రబాబు బెంగాల్ విషయంలో ఎదుర్కోబోతున్నారు. చంద్రబాబు నాయుడు ఈ నెల 19 తేదిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అవుతున్నారు. 22వ తేదిన ఢిల్లీలో జరగనున్న బిజెపీయేతర కూటమి పక్షాల సమావేశానికి హాజరు కావాల్సిందిగా చంద్రబాబు మమతను కోరనున్నారు.

నిజానికి బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నింటినీ ఏకం చేయాలనే సలహాను…మమతా బెనర్జీనే మొదట చంద్రబాబుకు ఇచ్చారు. చంద్రబాబు ప్రయత్నాలకు మద్దతు పలుకుతున్నారు కూడా. జనవరిలో కోల్‌కతాలో నిర్వహించబోయే ర్యాలీని ఆమె…బీజేపీయేతర కూటమి బలప్రదర్శనగా మార్చాలనుకుంటున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. కూటమిలో బాగస్వామ్య పక్షంగా ఉండనున్న సిపిఎంకు .. తృణమూల్ కాంగ్రెస్ కు బద్ద వైరం ఉంది. ఇటువంటి భిన్న స్వభావాలు కలిగిన వారిని కూటమిలోకి తీసుకువస్తే వీరు కలిసి ఉండటం కష్టమవుతుందని భావన ఉంది. వీరిరువురిని అనుసంధానం చేసే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారు. బెంగాల్‌లో బీజేపీ వేగంగా ఎదుగుతోందన్న అభిప్రాయాలు ఉన్నందున.. కలసి కట్టుగా పోరాడటంలో తప్పు లేదన్న ఆ రెండు పార్టీలకు సర్ది చెప్పే ప్రయత్నాన్ని చంద్రబాబు చేయవచ్చు.

22వ తేదిన ఢిల్లీలో జరగనున్న కూటమి సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే అటు కాంగ్రెస్ నుంచి, ఇటు చంద్రబాబు వైపు నుంచి నేతలందరికీ ఫోన్ లు వెలుతున్నాయి. ఢిల్లీలో జరగనున్న సమావేశంలో దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న వైనం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చించనున్నారు. సిబిఐ, ఐటీ, ఈడీ దాడులపై రాష్ట్రపతి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఎటువంటి స్పందన రాని పక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అవసరమైన కార్యాచరణను కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close