ముఖ్య‌మంత్రి కాదు.. అజెండా ముఖ్య‌మంటున్న కోదండ‌రామ్‌!

కేసీఆర్ కి మ‌రోసారి ఎందుకు ఓటెయ్యాలంటూ ప్ర‌శ్నించారు తెలంగాణ జ‌న స‌మితి అధ్య‌క్షుడు కె. కోదండ‌రామ్‌. హైద‌రాబాద్ లో జ‌రిగిన ఓ ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ… గ‌డ‌చిన నాలుగేళ్లూ తెలంగాణ‌లో నిరంకుశ పాల‌న సాగింద‌ని విమ‌ర్శించారు. కేసీఆర్ నాలుగేళ్ల‌లే ఏం చేశార‌ని, ప్ర‌జ‌లు ఆయ‌నకి ఓటెయ్యాల‌న్నారు. ప్ర‌జా కూట‌మికి అనూహ్యంగా మ‌ద్ద‌తు పెరుగుతోందనీ, ఎన్నిక‌ల త‌రువాత తామే ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున నిల‌బ‌డే ఒక కొత్త నాయ‌క‌త్వం వ‌స్తుంద‌నీ, అందుకే తాము మ‌హా కూట‌మిలో భాగ‌స్వామ్యం అయ్యామ‌న్నారు. అయితే, కూట‌మి ఏర్పాటు, సీట్ల పంప‌కాలు వంటి అంశాల్లో జాప్యం జ‌ర‌గ‌డం వ‌ల్ల కొంత న‌ష్టం జ‌రుగుతున్న మాట వాస్త‌వ‌మే అని కోదండ‌రామ్ స్ప‌ష్టం చేశారు. కూట‌మి త‌ర‌ఫున పోటీ చేసే అభ్య‌ర్థులు ఒక్క‌రు మాత్ర‌మే ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌నీ, స్నేహ పూర్వ‌క పోటీలు లేకుండా చేస్తామని ఆయ‌న చెప్పారు.

తాము ఓడిపోయేవాళ్లం కాద‌నీ, గ‌రిక‌గ‌డ్డి లెక్క పీకేసిన కొద్దీ ఒక్క చుక్క వాన‌ప‌డితే లేచి వ‌చ్చిన‌ట్టు పైకొస్తామ‌న్నారు. త‌ప్ప‌నిస‌రిగా రాష్ట్రంలో ఒక ప్ర‌త్యామ్నాయం తెచ్చి తీర‌తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. దానికి కావాల్సిన సామాజిక ప‌రిస్థితులు కూడా ఇవాళ్ల ప‌రిప‌క్వంగా ఉన్నాయ‌ని తాను గ‌ట్టిగా న‌మ్ముతున్నా అన్నారు. అజెండాను గెలిపించాల‌నేదే త‌మ తాప‌త్ర‌య‌మ‌నీ, ఎక్స్ గెలుస్తాడా వై గెలుస్తాడా అనే విధంగా వ్య‌క్తుల గెలుపు త‌న‌కు ముఖ్యం కాద‌న్నారు. ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతార‌నేది కూడా ముఖ్యం కాద‌న్నారు. ఈసారి ఎన్నిక‌ల్ల అజెండా గెలిస్తే చాలు.. అదే త‌మ విజ‌యం అని భావిస్తున్నామ‌న్నారు కోదండ‌రామ్‌. ప్ర‌జ‌ల కోసం నిల‌బ‌డే ఒక కొత్త నాయ‌క‌త్వం పెంపొందించాల‌నేది త‌మ ఆశ‌యం అన్నారు.

ముఖ్యమంత్రి ఎవ‌ర‌నేది త‌మ‌కు ముఖ్యం కాద‌ని కోదండ‌రామ్ ఈజీగా చెప్పేశారు! కానీ, ఈ మ‌ధ్య సీట్ల కేటాయింపుల సంద‌ర్భంగా ఆ చ‌ర్చ తెర‌మీద లేకుండా పోయింది. కాంగ్రెస్ లో ఎంత‌మంది ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థులున్నారో తెలిసిందే కదా. ఇప్పుడు సీట్లు పంచాయితీలు కూడా దాదాపుగా అయిపోయాయి. ఒక‌వేళ మ‌హా కూట‌మి మంచి ఫ‌లితాల‌నే సాధించిందే అనుకోండి… అప్పుడు ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌న్న లొల్లి చాలా పెద్ద‌దే అవుతుంది క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close