అంబ‌రీష్ ఆఖ‌రి క్ష‌ణాల్లో…

ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు అంబ‌రీష్ మ‌ర‌ణం ఆయ‌న అభిమానుల్ని తీవ్రంగా క‌ల‌చి వేసింది. కొంత‌కాలంగా ఆయ‌న ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఆ కార‌ణం చేత‌నే… ఆయ‌న క‌న్నుమూశారు. అయితే ఆఖ‌రి క్ష‌ణాల్లో ఆయ‌న తీవ్ర భావోద్వేగాల‌కు గుర‌య్యార‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. బెంగ‌ళూరులోని మండ్య జిల్లాలో శ‌నివారం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 30 మంది మ‌ర‌ణించారు. ఈ వార్తని టీవీల్లో చూసిన అంబ‌రీష్ తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యార‌ని స‌మాచారం. పాత్రికేయుల‌కు ఫోన్లు చేసి.. ఈ వార్త త‌న‌ని క‌ల‌చి వేసింద‌ని, బాధితుల్ని ప‌రామ‌ర్శించ‌డానికి రావాల‌ని ఉంద‌ని, అయితే త‌న ఆరోగ్యం స‌హ‌క‌రించ‌డం లేద‌ని చెప్పార్ట అంబ‌రీష్‌. అప్ప‌టి నుంచీ ఆయ‌న బీపీ క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చింద‌ని, హార్ట్ బీట్‌లో కూడా తేడా గ‌మ‌నించామ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. వెంట‌నే.. స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కానీ ఫ‌లితం లేకుండా పోయింది. అంబ‌రీష్ – సుమ‌ల‌త జంట‌కు అభిషేక్ ఏకైక సంతానం. త‌న‌ని హీరోగా చూసుకోవాల‌న్నది అంబ‌రీష్ ఆశ‌. అందుకు త‌గిన ప్ర‌య‌త్నాలు కూడా మొద‌ల‌య్యాయి. అయితే ఆ కోరిక తీర‌కుండానే క‌న్నుమూశారు రెబ‌ల్ స్టార్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close