కూకట్‌పల్లి రాజకీయంతో వైసీపీ మరో సెల్ఫ్‌గోల్..!?

కూకట్ పల్లి రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడం.. ఏపీలో చర్చనీయాంశమయింది. ఏపీ రాజకీయాల్లో వైసీపీకి మరో సెల్ఫ్ గోల్‌గా మారుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీ సీఎంను తీవ్రంగా విమర్శిస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వీల్లేదని.. ఒకవేళ ఇస్తే తమ ప్రత్యేక రాయితీల సంగతి ఏమిటని నిలదీస్తున్న కేసీఆర్ కు టీఆర్ఎస్‌కు వైసీపీ మద్దతు ప్రకటించడం ఏమిటన్న విస్మయాన్ని టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ఎస్‌తో జగన్ కుమ్మక్కయ్యారని.. ఎప్పటి నుంచో తాము చేస్తున్న వాదన నిజమేనని తేలిందని టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. వైసిపి, జనసేన, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని, వీరంతా ప్రధాని మోదీ దర్శకత్వంలో ఆయన ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారని చంద్రబాబు పదే పదే ఆరోపిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో జగన్ తన సామాజిక వర్గం వారిని టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బ్రదర్ అనిల్ కుమార్.. మత ప్రార్థనల తర్వాత అందరికీ టీఆర్ఎస్‌కు ఓటు వేయమని చెబుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కూడా జగన్ ఆదేశాల మేరకే కూకట్ పల్లి నేతల నోటి నుంచి జై కేసీఆర్ .. జై జగన్ నినాదాలు ఆ మాటలు వెలువడ్డాయని తెలుగుదేశం నేతలు అంటున్నారు. భవిష్యత్‌లో వైసీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని, లేకపోతే బిజెపి, వైసీపీ , జనసేన లోపాయికారి అవగాహనతో పోటీ చేస్తాయని టిడిపి నేతలు చెబుతున్నారు. కూకట్‌పల్లి వైసిపి సానుభూతి పరుల సభను తెలంగాణలో ఉంటే సెటిలర్లందరికీ సోషల్ మీడియా ద్వారా పంపి ఇప్పటికే కొంతమంది నేతలు వైరల్ చేశారు.

తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్నామని ప్రకటించిన తర్వాత.. జగన్ ఇక ఎన్నికలను పట్టించుకోకుండా ఉంటే మంచిదని.. కానీ అనవసరంగా… టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఉండే రెడ్డి సామాజికవర్గం మొత్తం… కేసీఆర్‌కు వ్యతిరేకంగా.. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఏకమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జగన్… కేసీఆర్ కు మద్దతు ప్రకటించడం కరెక్ట్ కాదని భావన వ్యక్తమవుతోంది. కర్ణాటక ఎన్నికల్లో.. వైసీపీ నేతలు.. బీజేపీ కోసం పని చేశారు. బెంగళూరులో రెడ్డి సామాజికవర్గం ఓట్లను.. బీజేపీకి వేయాలని ప్రచారం చేశారు. ఇప్పుడా వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close