గుండెపోటుతో బాల సాయిబాబా మృతి..!

కర్నూలుకు చెందిన వివాదాస్పద స్వామిజీ బాల సాయిబాబా గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ ఆశ్రమంలో ఉన్న ఆయనకు నిన్న అర్థరాత్రి గుండెపోటు రావడంతో.. బంజారాహిల్స్ లోని విరించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన మృతి చెందారు. శివరాత్రి రోజున.. నోటి నుంచి ఆత్మలింగం తీస్తూ.. బాల సాయిబాబా ప్రసిద్ధి చెందారు. ఆ రోజున టీవీ చానళ్లందరికీ…ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేలా టైమ్ స్లాట్స్ బుక్ చేసుకునేవారు. బాలసాయి అసలుపేరు కన్ననూరు బాలరాజు. ఆయనపై అనేక భూకబ్జా కేసులు ఉన్నాయి.

పలుమార్లు కోర్టు మెట్లెక్కారు కూడా..! 2012లో డీజీపీగా దినేష్ రెడ్డి ఉన్నప్పుడు.. డీజీపీ కార్యాలయం సమీపంలో ఓ ఆటోలో ఆరున్నర కోట్ల రూపాయలు బయటపడ్డాయి. ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. నోట్లు బయటపడిన వెంటనే.. వాటిని ఆటోలో పెట్టి తరలిస్తున్న వ్యక్తి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత పోలీసులు విచారణ జరిపితే.. అవి.. బాలసాయి బాబాకు చెందిన వ్యక్తులు తరలిస్తున్నారని తేలింది. బాలసాయి ట్రస్ట్ లోని రామారావు అనే వ్యక్తి నాలుగు రోజుల తర్వాత ఆ సొమ్ము తనదేనంటూ పోలీసులుక స్టేట్ మెంట్ ఇచ్చారు.

ట్రస్ట్ పేరుతో అనేక భూకబ్జాలు చేసిన ఆరోపణలు ఉన్నాయి.ఇప్పటికీ తుంగభద్ర ఒడ్డున బాలసాయి సెంట్రల్‌ సేవా నిలయం ఉంది. సంక్రాంతి రోజున.. పుట్టిన రోజు వేడుకల్ని.. సినిమా తారల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి కన్నుల పండువగా నిర్వహిస్తూంటారు. చాలా సందర్భాల్లో సినిమా తారలతో డాన్సులు చేయించడం వివాదాస్పదమయింది. మొదట్లో కొన్ని టీవీ చానళ్లు బాల సాయి మ్యాజిక్కులు చేస్తారని విపరీతంగా కథనాలు వేసేవి. తర్వాత … తగ్గించాయి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ కు నోటీసులు అంతా తూచ్..!!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు విషయంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయంలో ఢిల్లీ పోలిసుల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులే అందలేదు....

ఈవెంట్ కంపెనీ నిర్వాకం.. నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వ‌ల్ల‌, నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు మేట‌ర్...

క్రిష్ పేరు మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అది కూడా ఓకే. అయితే షాకింగ్ ఏమిటంటే......

పాయకరావుపేట రివ్యూ : వంగలపూడి అనితకు కలిసొస్తున్న కాలం !

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close