తెలంగాణలో వేలు పెట్టారు, చంద్రబాబు అంతు చూస్తాం : కేటీఆర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడను రాజకీయంగా అంతు చూస్తామని.. టీఆర్ఎస్ అధినేత కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ లోని ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… చంద్రబాబుపై తన ఆగ్రహాన్ని తీవ్ర స్థాయిలో వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో నాలుగు బిల్డింగులు కట్టించిన చంద్రబాబుకే అంత ఉంటే.. అసాధ్యమనుకున్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు ఇంకెంత ఉండాలని.. కేటీఆర్ చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు ఎలా బుద్ధి చెప్పాలో కేసీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చన్నారు. చంద్రబాబు తన శక్తిని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని, డబ్బులు, మీడియా రెండింటినీ అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ విమర్సలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో కూడా చంద్రబాబును ఆయన పార్టీని తెలంగాణ సమాజం తరిమికొడుతుందనే విశ్వాసం తనకు ఉందన్నారు. కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని.. ఆ ఫ్రంట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తమ పట్టు చూపెడతామని.. కేటీఆర్ వ్యాఖ్యానించారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై కేటీఆర్ ఒక్కసారిగా బెదిరింపు ధోరణిలో హెచ్చరికలు చేయడం .. రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. తెలంగాణలో చంద్రబాబు మహాకూటమిలో చేరితే… ఏపీలో వచ్చే ఎన్నికల్లో విపక్ష పార్టీలకు టీఆర్ఎస్ సాయం చేస్తుందని… అక్కడ.. తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ప్రయత్నించడం ఖాయమని.. కొన్నాళ్లుగా ప్రచారం జరగుతోంది. అయితే టీఆర్ఎస్ నేతల నుంచి పరోక్షంగా ఇప్పటి వరకూ వచ్చిన ఇలాంటి విమర్శలను.. చంద్రబాబు లైట్ తీసుకున్నారు. మొదట్లో ప్రచారానికి దూరంగా ఉండాలనుకున్నారు. అయితే.. టీఆర్ఎస్ నేతలు పూర్తిగా చంద్రబాబును సెంటర్ పాయింట్ గా చేసి తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేస్తూండటంతో… ఆయన ప్రచారానికి వచ్చారు. విడతల వారీగా… టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.

కేటీఆర్ వ్యాఖ్యలు.. అసహనాన్ని చూపిస్తున్నాయని.. టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయ పార్టీగా.. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం… తప్పెలా అవుతుందని.. ఓ రాజకీయ పార్టీ అధినేతగా ప్రచారం చేయడం… వేలు పెట్టడం ఎలా అవుతుదని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో అంతు చూస్తామనే హెచ్చరికలు సరికాదంటున్నారు. అదే సమయంలో… కేసీఆర్ అసహనానికి కారణం.. ఆయనలో ఓటమి భయం రావడమేనని విమర్శిస్తున్నారు. మొత్తానికి పోలింగ్ మూడు రోజుల ముందు.. కేటీఆర్.. చంద్రబాబును టార్గెట్ చేసి.. రాజకీయాలను మలుపు తిప్పినట్లుగానే భావించాలి,

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా జగన్ రెడ్డి..!?

తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పొరపాటే వైసీపీ కూడా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తే..ఏపీలో టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీలను జగన్ రెడ్డి ప్రజల్లోకి...

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close