కూకట్పల్లిలో సోదరి నందమూరి సుహాసిని తరపున ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారం చేయడంపై జూనియర్ ఎన్టీఆర్ వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ కారణాలు చెప్పి.. ప్రచారానికి డుమ్మా కొట్టాలని నిర్ణయించుకున్నట్లు మీడియా వర్గాలకు.. ఎన్టీఆర్ సన్నిహితులు సమాచారం అందించారు. అయితే.. సోదరికి మద్దతుగా.. ఓ వీడియో విడుదల చేస్తారని చెబుతున్నారు. నామినేషన్ వేసే రోజున.. జూ.ఎన్టీఆర్ , కల్యాణ్ రామ్ .. సోదరికి మద్దతుగా ట్వీట్ చేశారు. ఆ తర్వాత వీరు ప్రచారానికి వస్తారని.. భావించారు. కానీ.. చివరికి డుమ్మా కొడుతున్నట్లు క్లారిటీ వస్తోంది. జూనియర్ ప్రచారానికి వస్తున్నట్లు కన్ఫర్మ్ చేస్తే.. టీ టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసేవారు. కానీ ఇప్పటి వరకూ.. జూనియర్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. దాంతో.. ఆయన ప్రచారం గురించి మర్చిపోయి.. ఇతర వ్యవహారాలను చక్కదిద్దుకుంటున్నారు… కూకట్పల్లి టీడీపీ నేతలు.
శనివారం ముఖ్యమంత్రి చంద్రబబు రోడ్ షో నిర్వహించారు. బాలకృష్ణ ఆదివారం రోజంతా ప్రచారం చేయనున్నారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పలువురు ఇప్పటికే.. ప్రచారం చేస్తున్నారు. నారా బ్రహ్మణితో కూడా ప్రచారం చేస్తారని చెబుతున్నారు. అదే సమయంలో… టీడీపీ నేతలు.. కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను బట్టి.. ఆయా వర్గాలు, ప్రాంతాలకు చెందిన నేతలను పిలిపించి ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండటంతో.. రామ్మోహన్ నాయుడు.. రెండు రోజులుగా… ప్రచారం చేస్తున్నారు. వివిధ సామాజికవర్గాల ప్రజల్ని ఆకట్టుకోవడానికి.. ఆయా నేతల్ని రంగంలోకి దింపుతున్నారు. కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల వ్యూహాలపైనా.. ప్రత్యేకంగా… ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఓ బ్యాక్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ల వారీగా… విశ్లేషణలు చేసుకుని.. ఎప్పటికప్పుడు.. పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నారు. భారీ మెజార్టీ తీసుకు రావాలని ప్లాన్ వేసుకుంటున్నారు.
అంతా బాగానే ఉన్నా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవడం వల్ల.. కుటుంబంలో విబేధాలనే అంశం తెరపైకి వస్తుందని.. ఎన్టీఆర్ వీడియో విడుదల చేసినా… దానికంత ప్రభావం ఉండదని.. ఒక్క రోజు ర్యాలీలో పాల్గొన్నా… ఆ కిక్ టీడీపీ శ్రేణులుకు వేరేగా ఉంటుందంటున్నారు. కానీ జూనియర్ మాత్రం డుమ్మా కొట్టడానికే నిర్ణయించుకోవడం.. ఆశ్చర్యానికి గురి చేసేదే..!