తెలంగాణ రాజకీయాల్లో ఆయనకు రాజకీయ వ్యూహాల్లో చంద్రబాబునాయుడుకు ఉన్నంత తెలివి తేటలున్నాయన్న పేరు ఉంది. ఆ పార్టీని ఆయన ఏళ్ల తరబడి … కాచుకున్నారు. అలాంటి నేత ఇప్పుడు.. పూర్తిగా సైడైపోయారు. ఉబికి వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ.. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాల్ని దిగమింగుకుంటూ… కష్టంగా ఉన్నా.. పార్టీ విజయం కోసం అహరహం శ్రమిస్తున్నారు. ఆయనెవరో మీకిపాటికి అర్థమైపోయి ఉంటుంది.. ఆయనే హరీష్ రావు. టీఆర్ఎస్ లో … కొద్ది కాలం కిందటి వరకూ నెంబర్ టూ. ఇప్పుడు ఏ అంకెలోఉన్నారో… అసలు ఉన్నారో లేరో కూడా ఆయనకు తెలియదు. వారసుడికి పట్టం గట్టడానికి కేసీఆర్… ఎవరూ అడ్డం ఉండకూడదనుకుంటున్నారు. ఫలితంగా… హరీష్ రావుకు పొమ్మనలేక పొగబెట్టే పరిస్థితి ముందు నుంచీ కనిపిస్తోంది.
అంతకు ముందు ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. హరీష్ అభిప్రాయం తీసుకునే కేసీఆర్. ఇటీవలి కాలంలో ప్రగతి భవన్ లో అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదన్నది బహిరంగ రహస్యం. పార్టీపై పూర్తి స్థాయి పట్టు సాధించిన హరీష్ ను ఒక్కసారిగా బయటకు పంపితే సమస్య వస్తుంది కాబట్టి.. మెల్లగా పొగబెడుతున్నారు. ఇప్పటికే గజ్వేల్ బాధ్యతలు ఇచ్చారని చెప్పినప్పటికీ.. అక్కడ… ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీనే వ్యవహారాలు చక్క బెడుతున్నారు. హరీష్ కు పని లేదు. వాళ్లు హరీష్ ను జోక్యం చేసుకోనీయడం లేదు. ఉన్న పళంగా.. ఇరవై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను… కేసీఆర్ హరీష్ కు ఇచ్చి… ప్రచారం చేయమని చెప్పారు. ఆ ఇరవై ఆరు నియోజకవర్గాల్లో టీఆ్ఎస్ ఓటమి బాటలో ఉందని.. రేపు ఓడిపోతే.. పూర్తిగా ఆ వైఫల్యం తన మీద వేసి… తనకు క్యారెక్టర్ మీద దెబ్బ వేసి.. ఏ పదవి ఇవ్వకుండా పక్కన పెట్టేద్దామన్న ప్లాన్ లో ఉన్నారన్న సమాచారం .. హరీష్ కు అందింది. అయినప్పటికీ.. ఆయన పార్టీ ఇచ్చిన పరిమిత వనరుసలతోనే ప్రచారం చేస్తున్నారు.
అయితే హరీష్ రావు పరిస్థితి ఆయన సన్నిహితులకే.. కాదు..మీడియా వర్గాలకూ తెలుసు. ఇటీవలి కాలంలో.. ఆయన ఓ టీవీ చానల్ ఇంటర్యూకు వెళ్లారు. స్టూడియో ఇంటర్యూ అయిపోయిన తర్వాత.. జర్నలిస్టులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఆ సమయంలో పార్టీ గెలుస్తుందన్న కాన్ఫిడెన్స్ చూపించినా.. పార్టీలో తన పరిస్థితి గురించి మాట్లాడేటప్పుడు మాత్రం.. ఆయనకు తెలియకుండానే.. కన్నీటి పొర వచ్చేసింది. దాన్ని బట్టే.. హరీష్ పార్టీలో తన పరిస్థితిని తలుచుకుంటేనే కుమిలిపోతున్నాడన్న విషయం అర్థం అవుతోంది. గతంలో.. రాజకీయాల నుంచి విరమించుకుంటానని భావోద్వేగపూరితంగా చెప్పిన అంశమే జర్నలిస్టులకు గుర్తొచ్చింది. బహుశా ఎన్నికల తర్వాత హరీష్ రావు ఏదైనా కీలక నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదేమో..?