ఫ్యామిలీ కోటింగు ఇస్తున్న బోయ‌పాటి

‘విన‌య విధేయ రామ‌’…. రామ్ చ‌ర‌ణ్ సినిమాకి బోయ‌పాటి ఈ టైటిల్ ఫిక్స్ చేయ‌డానికి జ‌నం షాక‌య్యారు. భ‌ద్ర‌, తుల‌సి, ద‌మ్ము, సింహా, లెజెండ్‌…. ఇలాంటి మాస్ టైటిళ్ల‌తో హోరెత్తించిన బోయ‌పాటి ఫ్యామిలీ డ్రామా టైపు క‌థ‌ని, టైటిల్‌ని ఎంచుకున్నారేంటి అని ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ ఆశ్చ‌ర్యాల‌న్నింటినీ ప‌టాపంచ‌లు చేస్తూ ఫ‌స్ట్ లుక్‌నీ, టీజ‌ర్‌నీ వదిలాడు బోయ‌పాటి. అస‌లు టైటిల్‌కీ, టీజ‌ర్‌కీ సంబంధం లేకుండా… త‌న‌దైన యాక్ష‌న్ మూడ్‌లోకి వెళ్లిపోయిన బోయ‌పాటిని చూసి ఈసారి మ‌రోసారి ముక్కున వేలేసుకున్నారు. బోయ‌పాటి ఏం మార‌లేద‌ని, టైటిల్‌లో ఉన్న సాఫ్ట్‌నెస్‌, త‌న టీజ‌ర్‌లో లేద‌ని కామెంట్లు చేశారు.

అందుక‌నేనేమో.. ఇప్పుడు ఈ సినిమాకి ఫ్యామిలీ కోటింగు ఇవ్వ‌డంలో బిజీ అయిపోయాడు బోయ‌పాటి. దానికి త‌గ్గ‌ట్టుగానే సాఫ్ట్‌, కూల్ మూడ్‌లో ఉన్న పోస్ట‌ర్లు ఒకొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నాడు. మొన్న‌నే కొబ్బరి బొండాల స్టిల్ వ‌దిలిన బోయ‌పాటి.. ఇప్పుడు ఫ్యామిలీ అంతా క‌ల‌సి హ్యాపీ మూడ్‌లో ఉన్న మ‌రో స్టిల్‌ని బ‌య‌ట‌కు తీసుకొచ్చాడు. ఈరోజు విడుద‌ల చేస్తున్న తొలి పాట కూడా ఫ్యామిలీ సాంగే. దాంతో… మ‌ళ్లీ టైటిల్‌కి త‌గ్గ మూడ్ క్రియేట్ చేయాల‌ని, ఇదో ఫ్యామిలీ సినిమా అనే ఆలోచ‌న అంద‌రికీ క‌ల‌గాల‌న్న‌ది త‌న విశ్వ ప్ర‌య‌త్నం.

అయితే బోయ‌పాటి ఇస్తున్న ఈ కోటింగుల‌పై కూడా సోష‌ల్ మీడియాలో బోలెడ‌న్ని జోకులు పుట్టుకొస్తున్నాయి. కొబ్బ‌రి బొండాల స్టిల్ చూసి… ”తాగండి తాగండి.. త‌దుప‌రి సీన్లో మీ అంద‌రి నుంచీ ఓ లారీ వెళ్లిపోయి, ర‌క్త‌పాతం సృష్టించే సీన్ ఒక‌టి.. బోయ‌పాటి ప్లాన్ చేశాడు” అంటూ సెటైర్లు వేస్తున్నారు. బోయ‌పాటి పంథానే అది. ఓ హ్యాపీ మూడ్‌లో ఉన్న ఫ్యామిలీని చూపించి, ఆ వెంట‌నే విల‌న్ల‌ని రంగంలోకి దింపి… ర‌క్త‌పాతం సృష్టిస్తాడు. మ‌రి అదే ఫార్ములా ఇందులోనూ ఉందేమో చూడాలి..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బటన్ నొక్కి లబ్దిదారుల నోట్లో మట్టి – డబ్బుల్లేవా ?

పోలింగ్ కు రెండు రోజుల ముందు లబ్దిదారుల ఖాతాల్లో రూ. 14వేల కోట్లు వేసేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బులు జమ చేయడం లేదు. ఇదిగో అదిగో అంటూ ...

హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్…ఎందుకంటే..?

జూనియర్ ఎన్టీఆర్ తన ల్యాండ్ కు సంబంధించి వివాదం తలెత్తడంతో హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న ప్లాట్ విషయంలో ఈ వివాదం తలెత్తింది. 2003లో గీత లక్ష్మీ అనే...

సరైన ఏర్పాట్లు ఉంటే ఏపీలో 90 శాతం పోలింగ్ !

దేశంలో అత్యధిక రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 82 శాతం వరకూ పోలింగ్ నమోదయింది. అంతా పెద్ద పెద్ద క్యూలైన్లు ఉండటాన్ని గొప్పగా చెబుతున్నారు. కానీ పోలింగ్ పర్సంటేజీ...

ఇసుక మాఫియాకు సుప్రీంకోర్టు లెక్కే కాదు !

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు మాఫియా మాత్రం అబ్బే ఇసుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close