సంగారెడ్డి రివ్యూ : జగ్గారెడ్డికి కేసీఆర్ సాయం చేశారా..?

తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో సంగారెడ్డికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. కేసీఆర్‌కు ఎదురొడ్డి నిలిచే నాయకుల్లో ఒకరైన తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గా జగ్గారెడ్డి అక్కడ బరిలో ఉన్నారు. తెలంగాణ సెంటిమెంట్ …ఓ స్థాయిలో ఉన్న సమయంలోనే… జగ్గారెడ్డి… తాను సమైక్యాంధ్రవాదినని ప్రకటించుకున్నారు. ఆయన డేరింగ్ నెస్ అందరికీ నచ్చుతుంది. అలా ప్రకటించుకున్న తర్వాత కూడా గత ఎన్నికల్లో యాభై వేల పైచిలుకు ఓట్లు తెచ్చుకున్నారు. టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే వరకూ.. జగ్గారెడ్డి.. ఈ సారి గెలుస్తాడా.. అన్న డొలయానంలో ఉన్నారు. కానీ… మానవ అక్రమ రవాణా కేసులో ఎప్పుడో కోల్డ్ స్టోరేజీలో పడిపోయిన కేసును కావాలనే బయటకు తీసి.. కొద్ది రోజులు జైల్లో ఉంచడంతో.. అనుకోని వరంలా కలసి వచ్చింది.

కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడినందుకే వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. జగ్గారెడ్డి తనదైన మార్క్ రాజకయాలు చేసుకుటున్నారు. అరెస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు జగ్గారెడ్డి తాను బయటకు రాలేదు. కుటుంబసభ్యులను ప్రచారానికి పంపారు. వారు కావాల్సినంత సెంటిమెంట్ పండించారు. ఆ తర్వాత జగ్గారెడ్డి రంగంలోకి దిగారు. ఓ ప్లాన్ ప్రకారం.. తనపై సానుభూతి వచ్చేలా.. అలాగే కేసీఆర్ ను ఢీకొట్టే నేతగా ప్రొజెక్ట్ చేశారు. ఓ రకంగా ఈ అవకాశాన్ని కేసీఆర్ కల్పించారనుకోవాలి. ఇప్పుడు విజయానికి తాను చాలా దగ్గరగా ఉన్నానని జగ్గారెడ్డి బలంగా విశ్వసిస్తున్నారు. జగ్గారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటారు. అడిగిన వారికి ఆర్థిక సాయం చేస్తారు. వీటితోనే సరిపెట్టుకోలేదు.. సంగారెడ్డికి సంబంధించి కొన్ని మౌలికమైన సమస్యలపై పోరాడారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్నది ప్రజల ప్రధాన డిమాండ్‌. దీనికోసం రెండు సంవత్సరాలుగా జగ్గారెడ్డి ఉద్యమం చేస్తున్నారు.

సంగారెడ్డిలో టీఆర్ఎస్‌కు ఇబ్బందికరమైన మరో అంశం.. సింగూరు జలాల తరలింపు. సంగారెడ్డికి అతి సమీపంలోనే సింగూరు ప్రాజెక్టు ఉన్నా నియోజకవర్గంలోని ఒక్క ఎకరాకు కూడా నీరు అందడం లేదు. సింగూరు నుంచి ఘనపురం, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల్లోకి నీటిని వదులుతున్నా సంగారెడ్డి నియోజకవర్గానికి అందడం లేదు. సంగారెడ్డి, పటాన్‌చెరు, రామచంద్రాపురం ప్రాంతాలకు తాగునీటి అవసరాలకు మాత్రమే సింగూరు నుంచి మంజీరా ప్రాజెక్టులోకి 2 టీఎంసీల నీటిని సరఫరా చేస్తున్నారు. నిజానికి గత ఏడాది పడిన వర్షాలతో.. ప్రాజెక్ట్ నిండింది. కానీ.. ఎలాంటి కేటాయింపులు లేకపోయినా… పదిహేను టీఎంసీలు.. కేసీఆర్ కుటుంబసభ్యుల నియోజకవర్గాలకు నీళ్లిచ్చేందుకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు తరలించారు. ఇదే.. ఈ నియోజకవర్గ ప్రజల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది. టీఆర్‌ఎస్‌ నుంచి ఓసారి, కాంగ్రెస్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన జయప్రకాశ్‌రెడ్డి మూడోసారి విజయంకోసం గట్టిగా పోరాడుతున్నారు. రాజకీయాలకు, ఆధ్యాత్మికతను జోడించడంలో సిద్ధహస్తుడైన ఆయన హంగూ ఆర్బాటం లేకుండానే ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ కుట్రలు పన్ని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిందని ప్రచారం చేస్తూ సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close