కేటీఆర్ ట్వీట్ ఆరోపణలు..! జరిగిందేమిటో చెప్పిన లగడపాటి..!!

తెలంగాణలో ప్రజాభిప్రాయం … టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నా.. లగడపాటి రాజగోపాల్.. చంద్రబాబు ఒత్తిడితో.. తప్పుడు సర్వే ఫలితాలను ప్రకటిస్తున్నారని… కేటీఆర్ నిన్న ట్విట్టర్‌లోఆరోపించారు. దీనికి సాక్ష్యంగా నవంబర్ 10 తేదీన తనకు లగడపాటి పంపిన సర్వే రిపోర్ట్‌ను.. స్క్రీన్ షాట్‌గా తీసి ట్విట్టర్‌లో పెట్టారు. దీనిపై లగడపాటి రాజగోపాల్..అసలేం జరిగిందో.. వివరించేందుకు మీడియా ముందుకు వచ్చారు. సెప్టెంబర్‌లో ఓ బంధువు ఇంట్లో కేటీఆర్ కలిశారని… సర్వే గురించి అడిగారన్నారు. కేటీఆర్ కోరినందున.. తాను కలిశానన్నారు. రేవంత్ రెడ్డి బయపెట్టిన దాని ప్రకారం.. ఇద్దరి మధ్య గత సెప్టెంబర్ నుంచి సర్వేల విషయంలో అనేక సార్లు భేటీలు, మాటలు జరిగాయని అర్థం చేసుకోవచ్చు. ఐదేళ్లలో కేటీఆర్‌ను ఎప్పుడూ కలవలేదన్న లగడపాటి తమ మధ్య ఎప్పుడు ఫస్ట్ మీటింగ్ జరిగిందో వివరించారు.

సెప్టెంబర్ 10 : లగడపాటి బంధువుల ఇంట్లో ఓ పంక్షన్‌లో కలిసిన కేటీఆర్, సర్వేపై చర్చ, ఓ సారి కలుద్దామని ప్రతిపాదన

సెప్టెంబర్ 17 : కేటీఆర్‌ను కలిసిన లగడపాటి, సర్వే చేసి పెట్టమని అడిగిన కేటీఆర్

నవంబర్ 05: సర్వేపై.. లగడపాటి, కేటీఆర్ మధ్య చర్చలు

నవంబర్ 10 : కూటమి ఏర్పడకు ముందు చేసిన సర్వే రిపోర్టులు షేర్ చేసిన లగడపాటి

నవంబర్ 11: కూటమి ఏర్పడిన తర్వాత రిపోర్టును షేర్ చేసిన లగడపాటి , డిసెంబర్ పదొండో తేదీన మీరే చూస్తారంటూ..కేటీఆర్ రిప్లయ్

ఆసమయంలో కేటీఆర్ సర్వే చేసి పెట్టమని అడిగారని.. తాను చేసి పెట్టానని రాజగోపాల్ తెలిపారు. 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేటీఆర్‌కు చెప్పాన్నారు. కేటీఆర్ 23 నియోజకవర్గాల జాబితా పంపించి సర్వే వివరాలు అడిగారని .. వాటి గురించి చెప్పానన్నారు. మొత్తంగా కేటీఆర్ అడిగిన 37 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందన్న విషయాన్ని ఆయనకు వాట్సాప్‌లోనే రిపోర్ట్ పంపానన్నారు. ఆ వాట్సాప్ స్క్రీ న్ షాట్‌ను..లగడపాటి మీడియాకు షేర్ చేశారు. ఎన్నికలకు పొత్తులతో వెళ్లాలని కేటీఆర్‌కు సూచించాను.. కానీ సింగిల్‌గానే కొడతామని కేటీఆర్ చెప్పారని లగడపాటి చెప్పుకొచ్చారు. కేటీఆర్ స్క్రీన్ షాట్‌లో చూపించిన సర్వే… కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, కోదండరాం.. విడివిడిగా ఉన్నప్పుడు చేసిననిని…అందరూ కలిస్తే పోటాపోటీగా ఉంటుందని అప్పుడే చెప్పానన్నారు.

నవంబర్ 28 తర్వాత నాకు అనేక రిపోర్టులు వచ్చాయి. వాటిని నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేదున్నారు. గిరిజనులు మొత్తం టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మారిపోయారన్నారు. నిన్నామొన్నటిదాకా టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంటుందనుకున్న వరంగల్‌లోనూ పరిస్థితులు మారిపోయాయని.. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లీడింగ్‌లోకి వచ్చిందన్నారు లగడపాటి. కాంగ్రెస్సే గెలుస్తుంది నవంబర్ 11వ తేదీన మెసెజ్ పెట్టానని.. కేటీఆర్ దాన్ని… మాత్రం ట్వీట్‌లో పెట్టలేదన్నారు. చేదు నిజం చెప్పాను కాబట్టే కేటీఆర్ కు నచ్చలేదని వ్యాఖ్యానించారు. మొత్తానికి లగడపాటి,కేటీఆర్ మధ్యసర్వేలకు సంబంధంచి చాలా చర్చ జరిగిందని..తేలిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close