హంగ్ వస్తే గవర్నర్ ఎవరి వైపు..? కేంద్రం వైపా..? రాజ్యాంగం వైపా..?

భారతదేశానికి ఓ సర్వోన్నతమైన రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం వల్లే చాయ్ వాలా ప్రధానమంత్రి అయ్యారని మోడీ చెబుతూ ఉంటారు. మరి ఆ రాజ్యాంగాన్ని ఆ మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తుందా ..? లేదా..? అనే దానిపై ప్రజల్లో చాలా రోజుల నుంచి సందేహాలు ఉన్నాయి. అలాంటి మరో పరిస్థితి తెలంగాణలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో హంగ్ అంటూ వస్తే.. కచ్చితంగా విషయం గవర్నర్ చేతుల్లో ఉంటుంది. కానీ గవర్నర్ సర్వాధికారి కాదు. ఆయన గవర్నర్ చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. కానీ నడుచుకోకపోయినా… ఆయనను అడిగే వారు లేరు. ఇక్కడే కేంద్రం గేమ్స్ ఆడబోతోంది. కర్ణాటకలో ఆడిన ఆటలు ఇక్కడ కూడా చూసే అవకాశాన్ని కేంద్రం కల్పించే అవకాశాలు చాలా ఉన్నాయి.

తెలంగాణలో హంగ్ అంటూ వస్తే.. ఎవరు ఎక్కువ సీట్లు గెల్చుకుంటే… వారికి గవర్నర్ ముందు పిలుపునివ్వాలి. అది పార్టీ అయినా… కూటమి అయినా సరే. ఎన్నికలకు ముందు ప్రజాకూటమిగా ఏర్పడి పోటీ చేశారు కాబట్టి… టీఆర్ఎస్ కన్నా.. కూటమికి ఒక్క సీటు ఎక్కువ వచ్చినా.. వారికే ప్రభుత్వ ఏర్పటుకు అవకాశం ఇవ్వాలి. ఉదాహరణకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి 51 సీట్లు, ప్రజాఫ్రంట్‌కు 52 సీట్లు ..కాంగ్రె్‌సకు 48 సీట్లు, టీడీపీకి 4 సీట్లు వచ్చినా.. వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే మొదటి అవకాశాన్ని ఫ్రంట్‌కే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అంశంపై గతంలోనే సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకున్న కూటమికే అవకాశం ఇవ్వాలని సుప్రీం స్పష్టం చేసింది.ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజాఫ్రంట్‌ ముందుకు రాకపోయినా, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెజారిటీని నిరూపించుకోలేక పోయినా తర్వాతి అవకాశం అతిపెద్ద పార్టీకి దక్కుతుంది. నుంది. అతి పెద్ద పార్టీ ముందుకు రాక పోయినా, లేదా మెజారిటీని నిరూపించుకోలేక పోయినా మూడో అవకాశంగా ఎన్నికల అనంతరం పొత్తులు పెట్టుకునే కూటమికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. సుస్థిరప్రభుత్వం ఏర్పాటవుతుందన్న నమ్మకాన్ని ఆ కూటమి గవర్నర్‌కు కలిగించాల్సి ఉంటుంది.

కానీ కర్ణాటకలో మాత్రం… కేంద్రం డైరక్షన్స్‌తో ఆడిన గవర్నర్.. ఏ ఒక్క నిబంధననూ పట్టించుకోలేదు. రాజ్యాంగానికి తనదైన భాష్యం చెప్పుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీకి అవకాశం ఇచ్చారు. బేరసారాల కోసం ఏకంగా రెండు వారాల గడువు ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టుకు వెళ్లడం, బల నిరూపణకు గడువును కుదించడంతో మంత్రివర్గ ఏర్పాటుకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. అక్కడి గవర్నర్ కన్నా… తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇంకా ఎక్కువ విధేయతను… ప్రధాని మోడీపైన.. బీజేపీపైన చూపిస్తున్నారు. ఈ విషయంలో గవర్నర్ … కేంద్రం మాటను జవదాటే అవకాశం లేదు. అంటే.. హంగ్ అంటూ వస్తే.. తెలంగాణలో భిన్నమైన రాజకీయాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మళ్లీ డేట్ మార్చుకొన్న విశ్వ‌క్ సినిమా

విశ్వ‌క్‌సేన్ క‌థానాయ‌కుడిగా నటించిన చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి'. ఎప్పుడో రెడీ అయినా, ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. మార్చిలో రావాల్సిన సినిమా ఎల‌క్ష‌న్ల వ‌ల్ల ఆగింది. ఎన్నిక‌లు అయిపోయిన...

విదేశాలకు వెళ్లేందుకు జగన్‌కు పర్మిషన్ ఇవ్వొద్దన్న సీబీఐ

పోలింగ్ ముగియగానే కుటుంబంతో సహా లండన్ వెళ్లిపోవాలనుకున్న జగన్ కు సీబీఐ షాకిచ్చింది. ఆయన మళ్లీ తిరిగి వస్తాడన్న నమ్మకం లేదని నేరుగా చెప్పలేదు కానీ.. అలాంటి అర్థం వచ్చేలా అఫిడవిట్ దాఖలు...
video

‘మాయావ‌న్’ టీజ‌ర్‌: సూప‌ర్ హీరో Vs సామాన్యుడు

https://youtu.be/jQ5f_tGienU దుష్ట‌శ‌క్తికీ, సామాన్యుడికీ పోరు ఎప్పుడూ ర‌స‌వ‌త్త‌రంగానే ఉంటుంది. దానికి సైన్స్‌, దైవ శ‌క్తి తోడైతే ఇక చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవ‌ల విడుద‌లైన 'హ‌నుమాన్‌' ఈ జోన‌ర్ క‌థే. ఇప్పుడు సందీప్ కిష‌న్...

గాడిద గుడ్డు వర్సెస్ వంకాయ – బీజేపీ కౌంటర్ ఫలిస్తుందా..?

తెలంగాణకు పదేళ్లలో బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తోన్న కాంగ్రెస్ కు కౌంటర్ ప్రచారం మొదలు పెట్టింది బీజేపీ. అరవై ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఇచ్చింది వంకాయ....

HOT NEWS

css.php
[X] Close
[X] Close